MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ కారణంగానే ఎన్టీఆర్‌కి ఫ్లాప్‌.. `రామయ్యా వస్తావయ్యా` డిజాస్టర్‌కి అసలు కారణం చెప్పిన దిల్‌రాజు..

ప్రభాస్‌ కారణంగానే ఎన్టీఆర్‌కి ఫ్లాప్‌.. `రామయ్యా వస్తావయ్యా` డిజాస్టర్‌కి అసలు కారణం చెప్పిన దిల్‌రాజు..

ఎన్టీఆర్‌ హీరోగా హరీష్ శంకర్‌ దర్శకత్వంలో రూపొందిన `రామయ్యా వస్తావయ్యా` మూవీ పరాజయం చెందిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి గల కారణాలను నిర్మాత దిల్‌ రాజు తెలిపారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2024, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఎన్టీఆర్‌ నటించిన ఫ్లాప్‌ చిత్రాల్లో `రామయ్యా వస్తావయ్యా` మూవీ ఒకటి. ఈ సినిమా ఇప్పుడు సడెన్‌గా వార్తల్లోకి ఎక్కింది. కారణం దర్శకుడు హరీష్‌ శంకర్‌ రియాక్ట్ కావడమే. కెమెరామెన్‌ చోటా కె నాయుడు.. ఓ ఇంటర్వ్యూలో హరీష్‌ శంకర్‌ గురించి కాస్త తప్పుగా మాట్లాడటంతో మండిపోయిన హరీష్‌ శంకర్‌.. ఆ సినిమాకి కెమెరామెన్‌గా నిన్ను తీసేసి మరొకరిని పెట్టుకోవాలనే ఆలోచన వచ్చిందని, కానీ బ్యాడ్‌ నేమ్‌ వస్తుందని మార్చకుండా సినిమా పూర్తి చేశామని, కానీ సినిమా ఫెయిల్యూర్‌ నిందని మీపై వేయలేదని చెప్పారు హరీష్‌ శంకర్‌. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ మేరకు ఆయన సోషల్‌ మీడియా ద్వారా ఓ నోట్‌ని పంచుకున్నారు. అది పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. ఇంకా దీనిపై కెలుకుతానంటే ఎప్పుడైనా, ఎక్కడైనా రెడీ అని కూడా సవాల్‌ విసిరాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. దీంతో `రామయ్యా వస్తావయ్యా` మూవీ చర్చనీయాంశం అయ్యింది. ఆ సినిమా ఫ్లాప్‌కి కారణమేంటనేది ఆరా తీసే పనిలో నెటిజన్లు ఉన్నారు. అందులో భాగంగా దిల్‌ రాజు చెప్పిన ఓ పాత వీడియోని వైరల్‌ చేస్తున్నారు. ఈ మూవీకి దిల్‌ రాజే నిర్మాత కావడం విశేషం. 
 

37

ఇందులో ఆయన మాట్లాడుతూ, తాను చేసిన సినిమాల్లో మూడు చిత్రాలు సక్సెస్‌ అయ్యేందుకు అవకాశం ఉందని, కానీ రాంగ్‌ టైమ్‌, స్క్రిప్ట్స్ కారణంగా ఫెయిల్ అయ్యాయని తెలిపారు. వాటిలో `రామ రామ కృష్ణ కృష్ణ`, `మున్నా`, `రామయ్యా వస్తావయ్యా` చిత్రాలు అని తెలిపాడు దిల్‌ రాజు. 
 

47

`రామయ్యా వస్తావయ్యా` సినిమా బ్యాడ్ టైమింగ్‌లో ఫెయిల్‌ అయ్యిందన్నారు. ప్రభాస్‌ నటించిన `రెబల్‌` సినిమా కంటే ముందు `రామయ్యా వస్తావయ్య` కథ వేరే ఉందని, ఆ కథ నచ్చే ఎన్టీఆర్‌, హరీష్‌, నేను కమిట్ అయ్యామని చెప్పారు. కానీ `రెబల్‌` సినిమా కారణంగా కథని మార్చినట్టు తెలిపారు. ఫాదర్‌కి జరిగిన అన్యాయంపై కొడుకు ప్రతీకారం తీర్చుకోవడమే కాన్సెప్ట్ ఒకేలా ఉందని, మొదట అనుకున్న కథని వద్దనుకున్నామని తెలిపారు. 
 

57

ఆ తర్వాత హరీష్‌ స్క్రిప్ట్ లో మార్పులు చేసి, ఈ కథ చెప్పాడు. ఓకే ఇది కూడా బాగుంది కదా అని చేయడానికి ముందుకు వచ్చాం. టైమ్‌ అలా మార్చేసిందని, `రెబల్‌` కంటే ముందే మా సినిమా వచ్చి ఉంటే రాంగ్‌ స్టెప్‌ వేసే వాళ్లం కాదు, మేం ముందు అనుకున్న కథ వేరు. అదే అయితే,  `రెబల్‌` కంటే ముందే తమ సినిమా వచ్చి ఉంటే సక్సెస్‌ అయ్యేదని తాను నమ్ముతున్నట్టు దిల్‌ రాజు తెలిపారు. 

67

ఎన్టీఆర్‌ హీరో, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో `రామయ్యా వస్తావయ్యా` చిత్రం వచ్చింది. సమంత, శృతి హాసన్‌ హీరోయిన్లుగా నటించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ మూవీ 2013లో విడుదలైంది. పరాజయం చెందింది.
 

77

మొత్తంగా ప్రభాస్‌ `రెబల్‌` కారణంగా ఎన్టీఆర్‌ కి ఫ్లాప్‌ పడిందని దిల్‌ రాజు మాటలని బట్టి అర్థమవుతుంది. ఇక రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన `రెబల్‌` చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా నటించగా, కృష్ణంరాజు.. ప్రభాస్‌కి తండ్రిగా నటించాడు. తండ్రిని ప్రత్యర్థులు చంపేయడంతో వారిపై ప్రభాస్‌ ప్రతీకారం తీర్చుకుంటాడు.  2012లో వచ్చిన ఈ మూవీ పరాజయం చెందింది.  `రామయ్యా వస్తావయ్యా` ఫస్ట్ అనుకున్న కథ కూడా ఇలానే ఉండటంతో, ఆ తర్వాత స్క్రిప్ట్ ని మార్చేశారట. కానీ అది కూడా ఫ్లాప్‌ అయ్యింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sharvari Wagh: ఈ హీరోయిన్ మాజీ సీఎం మనవరాలా ? త్వరలో స్పై యాక్షన్ మూవీతో రంగంలోకి..
Recommended image2
Ram Charan: పెళ్లి రోజున సర్ప్రైజ్ ఇచ్చిన రాంచరణ్, ఉపాసన.. అన్నా లెజినోవా రియాక్షన్ చూశారా, వైరల్
Recommended image3
Sreemukhi: అడుక్కున్నారు, అయినా ఆ షోని రిజెక్ట్ చేశా.. హీరోయిన్ గా కూడా ఛాన్స్ పోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved