ఎన్టీఆర్, పవన్, ప్రభాస్, మహేష్ లను బెండ్ చేసే వీక్నెస్లు ఏమిటో తెలుసా? ప్రైవేట్ మేటర్ లీక్!
టాలీవుడ్ స్టార్ హీరోలను ప్రాజెక్ట్ కి ఒప్పించాలంటే చిన్న లాజిక్ ఫాలో అవ్వాలట. వాళ్ళ వీక్నెస్ పట్టుకొని కథ చెబితే దెబ్బకు బెండ్ అవుతారట. డేట్స్ ఇచ్చేస్తారట.
స్టార్ హీరోల డేట్స్ దొరకడం అంటే గోల్డ్ మైన్ దొరికినట్లే. మరి వీళ్ళను ఇంప్రెస్ చేయడం ఎలా? ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్, ప్రభాస్ లకు కొన్ని బలహీనతలు ఉన్నాయట. ఆ వీక్నెస్ మీద కొడితే దెబ్బకు డేట్స్ ఇచ్చేస్తారని... దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ సందర్భంలో వెల్లడించాడు...
చిత్ర పరిశ్రమలో లౌక్యం చాలా అవసరం. ఎదుటివాళ్ళ మనస్తత్వాన్ని బట్టి నడుచుకున్న వాళ్ళకే సుదీర్ఘ కెరీర్ ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటానంటే కుదరదు. స్టార్ హీరోలను దర్శకులు ... స్టార్ డైరెక్టర్స్ ని హీరోలు ప్రసన్నం చేసుకునే పనిలో ఉంటారు. ముఖస్తుతి అనేది చాలా కామన్.
Tollywood heroes
ఒక స్టార్ హీరో డేట్స్ దొరకాయంటే సదరు దర్శకుడికి, నిర్మాతకు పండగే. అందుకే పవన్ కళ్యాణ్ ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వెంట పడే దర్శక నిర్మాతల సంఖ్య భారీగా ఉంటుంది. ఓ హీరో కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసే దర్శక నిర్మాతలు ఎందరో. స్క్రిప్ట్ నచ్చితేనే హీరోలు దర్శకులకు డేట్స్ ఇస్తారు. కాగా టాలీవుడ్ స్టార్ హీరోలు ఒప్పించాలంటే చిన్న లాజిక్ ఫాలో అవ్వాలట. వాళ్ళ వీక్నెస్ పట్టుకొని కథ చెబితే ఒప్పేసుకుంటారట.
దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ... టాలీవుడ్ లో ఒక జోక్ ఉంది. మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజలకు ఇలా చెబితే వెంటనే డేట్స్ ఇస్తారట, అన్నారు. ఆ జోక్ ఏమిటంటే..
షూటింగ్ ఇప్పుడు మొదలైతే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు, అని చెబితే మహేష్ టక్కున డేట్స్ ఇచ్చేస్తాడట.
NTR
ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలే. చరిత్ర తిరగరాయబోతున్నాం... అని చెబితే ఎన్టీఆర్ ఇంప్రెస్ అయిపోతాడట. డేట్స్ ఇచ్చేస్తాడట.
షూటింగ్ మొత్తం ఇండోర్ లోనే. అవుట్ డోర్ కి వెళ్లాల్సిన అవసరం లేదని చెబితే చాలు.. ప్రభాస్ డేట్స్ ఇచ్చేస్తాడట.
ఈ సినిమాలో అన్నీ గన్సే. విలన్ పెద్ద గన్ డీలర్. విచ్చలవిడిగా గన్స్ తో కాల్చుకోవచ్చు, అని చెబితే పవన్ కళ్యాణ్ వెంటనే డేట్స్ ఇచ్చేస్తాడట.
ఇవాళ షూటింగ్ మొదలైతే జస్ట్ 30 రోజుల్లో షూటింగ్ పూర్తి అవుతుంది... అని చెబితే రవితేజ డేట్స్ ఇచ్చేస్తాడని, పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చాడు. ఇది పూర్తిగా వాస్తవం కాకపోయినా... వాళ్ళ వాళ్ళ మనస్తత్వం ఆధారంగా ఈ జోక్ క్రియేట్ చేశారు.