ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్... ఈ స్టార్ హీరోల భార్యలు చేసే వ్యాపారాలు తెలుసా?
భర్తలకు ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా మనకంటూ ఒక లక్ష్యం, ఉద్యోగం లేదా వ్యాపారం ఉండాలని ఆడవాళ్లు భావిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు తమ తమ వృత్తులు, వ్యాపారాల్లో రాణిస్తున్నారు.
star heroes
ఒకప్పుడు భర్తలు సంపాదించాలి భార్యలు ఇంటిపట్టున ఉండి కుటుంబాన్ని చక్కబెట్టాలని సాంప్రదాయంగా ఆలోచించేవారు. పరిస్థితులు మారిపోయాయి. మన స్టార్ హీరోల భార్యలు కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, తాము చేసే బిజినెస్ ల గురించి ప్రమోట్ చేసుకుంటూ తమకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ వరసలో ముందు గా చెప్పాల్సిన పేరు నమ్రత శిరోద్కర్, సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రేమించి పెళ్లాడిన ఆమె ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా కాని, సినీ రంగానికి మాత్రం దగ్గర ఉంటుంది. మహేష్ బాబుకు సంబంధించిన అన్ని విషయాలు ఆమె స్వయంగా చూసుకుంటుంది.
Mahesh Babu
ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలు కానీ, ఆయన ప్రచారం చేసే యాడ్స్ విషయంలో కానీ నమ్రత మాటే ఫైనల్. అదే విధంగా మహేష్ బాబు ని బ్రాండ్ గా చూపిస్తూ హంబుల్ అనే టెక్ట్స్ టైల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేసింది. ఫ్యాషన్ వేర్ తో పాటు… ఏసియన్ సంస్థతో కలిసి ఏ.ఎమ్.బి. పేరుతో లగ్జరీ మల్టీప్లెక్స్ ను స్థాపించింది. మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ పనులు కూడా దగ్గరుండి తనే చూసుకుంటుంది. దీంతో పాటు మినర్వా తో కలిసి రెస్టారెంట్లు స్థాపిస్తోంది.
రాంచరణ్ వైఫ్ ఉపాసన కూడా బిజినెస్ లో రాణిస్తూ, మరోవైపు రాంచరణ్ పీఆర్ వర్క్ కూడా ఆమెనే హ్యాండిల్ చేస్తుంది. అదే విధంగా ఎయిర్ లైన్స్ బిజినెస్ లో కూడా చురుగ్గా ఉంటుంది.
ఇక అల్లు అర్జున్ వైఫ్ స్నేహ రెడ్డి తన తండ్రి స్థాపించిన సేయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కి డైరెక్టర్ గా ఉంది. స్నేహారెడ్డి ఫిట్నెస్ ఫ్రీక్. అలాగే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. ఆమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఎన్టీఆర్ వైఫ్ లక్ష్మి ప్రణతి కూడా త్వరలోనే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ నిర్మాణ రంగంలో అడుగు పెడుతుండగా ఆ బాధ్యతలు కూడా ఆమె చూసుకుంటారట.
star heroes
ఇక నాని వైఫ్ అంజన ఎప్పుడో రాజమౌళి టీం లో చేరిపోయింది. బాహుబలి టైం నుంచి ఆర్కా మీడియా లో క్రియేటివ్ వర్క్ టీం లో పనిచేస్తుంది. ఇక రాజీవ్ కనకాల వైఫ్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
హీరో అల్లరి నరేష్ భార్య కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను ఏర్పాటు చేసి సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ మరి కొన్ని స్టార్టప్ కంపెనీలలో పెట్టుబడులు పెడుతూ దూసుకెళ్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే హీరోల భార్యలు మాత్రమే కాదు. సినీ రంగానికి దగ్గర ఉన్న ప్రతి ఒక్క మహిళా కూడా సొంతగా తమ ఉనికిని చాటుకుంటూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.