జాన్వీకి రూ. 5 కోట్లు ఇచ్చారా? ఇక ఎన్టీఆర్, సైఫ్, కొరటాల ఎంత తీసుకున్నారో తెలుసా?
ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ దేవర థియేటర్స్ లో సందడి చేస్తుంది. కాగా ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ దేవర చిత్రంలో స్టార్ క్యాస్ట్ నటించగా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్స్ ఛార్జ్ చేశారని సమాచారం.
దాదాపు ఆరేళ్ళ అనంతరం ఎన్టీఆర్ సోలోగా నటించిన చిత్రం దేవర. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో దేవర నిర్మించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఎన్టీఆర్ కి జంటగా జాన్వీ కపూర్ నటించింది. ఆమెకు ఇది ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ.
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రధాన విలన్ రోల్ చేశాడు. శ్రీకాంత్, మురళీ శర్మ, ప్రకాష్ రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన దేవర మూవీ అంచనాల మధ్య విడుదలైంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందించారు.
దేవర విడుదల నేపథ్యంలో నటుల రెమ్యూనరేషన్ డిటైల్స్ వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ అత్యధికంగా రూ. 60 కోట్లు తీసుకున్నారట. ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ అని చెప్పొచ్చు. గతంలో ఎన్టీఆర్ యాభై కోట్లకు లోపే తీసుకునేవారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ చాలా ఆలస్యమైంది. ఆర్ ఆర్ ఆర్ కి సైతం ఎన్టీఆర్ పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారని వినికిడి.
దేవర విజయం పై ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఆధారపడి ఉంటుంది. నార్త్ లో దేవర ప్రభావం చూపితే... ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ వంద కోట్లకు చేరే సూచనలు కలవు. ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రశాంత్ నీల్ తో ఒక చిత్రం చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో చేస్తున్న మల్టీస్టారర్ వార్ 2 సెట్స్ పై ఉంది.
బాలీవుడ్ లో ఒకప్పుడు హీరోగా వెలుగొందిన సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్స్ సైతం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీలో సైఫ్ అలీఖాన్ రావణుడు పాత్ర చేశాడు. దేవరలో ఆయన ప్రధాన విలన్. దేవర చిత్రానికి రూ. 10 కోట్లు ఆయన ఛార్జ్ చేశాడట.
శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దేవర చిత్రంతో సౌత్ ఇండియాలో అడుగుపెట్టింది. జాన్వీ నటించిన అతిపెద్ద ప్రాజెక్ట్ దేవర అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ వంటి బడా స్టార్ సరసన ఆమె గతంలో నటించింది లేదు. ఇక దేవర మూవీకి గాను జాన్వీ కపూర్ రూ. 5 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుందట.
దేవర సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్ చిత్రానికి జాన్వీ కపూర్ సైన్ చేసింది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించనున్నాడు. ఆర్సీ 16 ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
ఫ్యామిలీ చిత్రాల హీరో శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన సంగతి తెలిసిందే. ఆయన దేవరలో ఓ కీలక పాత్ర చేశారు. శ్రీకాంత్ రూ. 50 లక్షలు తీసుకున్నారట. అలాగే మురళీ శర్మ రూ. 40 లక్షలు తీసుకున్నారట.
స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ సైతం ఓ కీలక పాత్రలో అలరించాడు. దేవర చిత్రానికి ప్రకాష్ రాజ్ రూ. 1.50 కోట్లు తీసుకున్నారట. ప్రకాష్ రాజ్ డిమాండ్ ఉన్న నటుడు. అందుకే ఆ రేంజ్ లో తీసుకున్నారు.
ఇక దర్శకుడు కొరటాల శివ రూ. 30 కోట్లు తీసుకున్నారట. ఆయన గత చిత్రం ఆచార్య నిరాశపరిచింది. దాంతో దేవర చిత్రాన్ని కసితో తీశారు. దేవర రెండు భాగాలుగా ఆయన తెరకెక్కిస్తున్నారు. దేవర ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.