- Home
- Entertainment
- NTR Remuneration: ఆర్ఆర్ఆర్ వర్కౌట్ అయ్యింది, రెమ్యూనరేషన్ పెంచేసిన ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఎంతంటే..?
NTR Remuneration: ఆర్ఆర్ఆర్ వర్కౌట్ అయ్యింది, రెమ్యూనరేషన్ పెంచేసిన ఎన్టీఆర్, కొరటాల సినిమాకు ఎంతంటే..?
అనుకున్నంతా అయ్యింది. ఆర్ఆర్ఆర్ వర్కౌట్ అయ్యిందంటే చాలు.. ఎన్టీఆర్ రేంజ్ మారిపోయినట్టే, పాన్ ఇడియా స్టార్ గా రెమ్యూనరేషన్ కూడా పెరిగినట్టే.. అంటూ టాక్ గట్టిగా నడిచింది. ఇక ఇప్పుడు అదే జరగబోతున్నట్టు సమాచారం. తారక్ తన రేటు అమాంతం పెంచేశాడట.
- FB
- TW
- Linkdin
Follow Us
)
దాదాపు నాలుగేళ్లు ఎన్టీఆర్ సినిమా థియేటర్ లో కనిపించలేదు. 2018 లో అరవింద సమేత తర్వాత దాదాపు నాలుగేళ్ళకు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆర్ఆర్ఆర్ తో పాటు..కరోనా వల్ల తారక్ టైమ అంతా తినేసింది. నాలుగేళ్లు తన సినిమా రాకున్నా సరే..ఒకేసారి పాన్ ఇండియా స్టార్ గా ట్రిపుల్ ఆర్ తో ప్రేక్షకులను పలకరించాడు ఎన్టీఆర్.
రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌చరణ్ తో స్క్రీన్ శేర్ చేసుకున్నాడు తారక్. మార్చి 25న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. కెజియఫ్2 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయినా కూడా ఇప్పటికి ట్రిపుల్ ఆర్ కలెక్షన్లు కొన్ని ఏరియాలలో స్టడీగానే ఉన్నాయి. నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ వెండతెరపై కనిపించడంతో నందమూరీ అభిమానులు దిల్ ఖుషీ అయ్యారు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆ నాలుగేళ్ళ గ్యాప్‌ను పూర్తిచేసేందుకు వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ మూవీ జూన్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
ఇక పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేసినట్టు తెలుస్తోంది. ఈ పెంపు కొరటాల శివ సినిమాతోనే మొదలెట్టాడట జూనియర్. తారక్ ఈ సినిమా కోసం దాదాపుగా 70రోజుల కాల్షీట్లు ఇచ్చాడట. ఈ 70 రోజుల కోసం ఎన్టీఆర్ దాదాపు 55కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ఇంతకు ముందు వరకూ ఎన్టీఆర్ సినిమాకు 30 కోట్ల వరకూ తీసుకున్నాడు. మహేష్ బాబు,పవన్ లాంటి హీరోలు ఇప్పటికే 50 కోట్ల మార్క్ ను దాటి... 70 కోట్లకు రీచ్ అవ్వగా.. పాన్ ఇండియా స్టార్ గా ఎన్టీఆర్ కూడా ముందు ముందు ఇంకా రేటు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. అంతేకాకుండా ట్రిపుల్ఆర్ ప్రమోషన్లలో జరిగిన ప్రెస్ మీట్‌లలో తారక్ అన్ని భాషల్లో మాట్లాడడంతో ప్రతి రాష్ట్రంలో ఈయనకు మంచి క్రేజ్ ఏర్పడింది.
ఈ క్రమంలో తారక్ తన రెమ్యునరేషన్ పెంచాడట. నిర్మాతలు కూడా ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇక కోరటాల సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆలీయాభట్ హీరోయిన్‌గా నటించాల్సి ఉండగా రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకున్నట్లు న్యూస్ వినిపించింది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.ఇక తారక్ ముందు ముందు సినిమాల సక్సెస్ ను బట్టి వంద కోట్ల హీరోగా అవతారం ఎత్తుతాడని ఫ్యాన్స్ సర్కిల్ లో సంబరాలు చేసుకుంటున్నారు.