Priyamani: లేటు వయసులో ప్రియమణి ఘాటు పోజులు... వన్నె తరగని పరువాలతో ప్రాణాలు తీస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్!
ప్రియమణికి వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతుంది. అమ్మడు వన్నె తరగని గ్లామర్ మైమరిపిస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
Priyamani
బెంగుళూరు భామ ప్రియమణి 2003లో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె డెబ్యూ మూవీ ఎవరే అతగాడు. నిర్మాత కే ఎస్ రామారావు కొడుకు వల్లభ హీరోగా నటించిన ఈ చిత్రం అంతగా ఆడలేదు.
Priyamani
తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రియమణి పెళ్ళైన కొత్తలో చిత్రంతో తెలుగులో మరలా రీఎంట్రీ ఇచ్చింది. 2007 ప్రియమణి కెరీర్లో మైలురాయిగా నిలిచింది. పరుత్తివీరన్ సినిమాతో ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది.
Priyamani
అదే ఏడాది రాజమౌళి యమదొంగ మూవీలో మెయిన్ లీడ్ ఛాన్స్ ఇచ్చాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సోషియో ఫాంటసీ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రియమణి నటన సినిమా విజయంలో కీలకమైంది.
Priyamani
ఎన్టీఆర్ తో హిట్ కొట్టినప్పటికీ ఆమెకు స్టార్స్ పక్కన ఛాన్స్ రాలేదు. నితిన్, కళ్యాణ్ రామ్, జగపతిబాబు వంటి టైర్ టు హీరోలు మాత్రమే ఆమె ఆఫర్స్ ఇచ్చారు. దీంతో ఆమె ఇతర పరిశ్రమల మీద ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ప్రియమణి హీరోయిన్ గా రిటైర్ అయ్యింది.
Priyamani
ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ఫుల్ గా సాగుతుంది. ఇండియాలో బిజీ యాక్ట్రెస్ లో ప్రియమణి ఒకరు. భాషా బేధం లేకుండా అన్ని పరిశ్రమల్లో ఆమె రాణిస్తుంది. అదే సమయంలో డిజిటల్ సిరీస్లలో సత్తా చాటుతుంది. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 విపరీతమైన ఆదరణ దక్కించుకున్నాయి.
Priyamani
ఈ మధ్య కాలంలో ప్రియమణి విరాట పర్వం, కస్టడీ వంటి తెలుగు చిత్రాల్లో సందడి చేసింది. ఎన్టీఆర్ భారీ బడ్జెట్ మూవీ దేవరలో ఆమె నటిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తుండగా... ఓ పాత్రకు ఆమె జంటగా కనిపిస్తారట. దీనిపై అధికారిక సమాచారం లేదు.
Priyamani
ప్రియమణి 2017లో ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వృత్తి రీత్యా అతడు అమెరికాలో ఉంటాడు. అరుదుగా ఈ జంట కలుస్తుంటారు. ఆ మధ్య విడిపోయారంటూ వార్తలు రాగా పరోక్షంగా ఖండించారు. ప్రియమణి బుల్లితెర షోలలో కూడా రాణిస్తుంది.
Priyamani
ప్రియమణికి వయసుతో పాటు గ్లామర్ కూడా పెరుగుతుంది. అమ్మడు వన్నె తరగని గ్లామర్ మైమరిపిస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ ట్రెండీ వేర్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.