MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • సీఎం సీఎం అంటూ నినాదాలు, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. తారక్‌ని బ్రతిమాలుకున్న విజయశాంతి

సీఎం సీఎం అంటూ నినాదాలు, ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఇదే.. తారక్‌ని బ్రతిమాలుకున్న విజయశాంతి

Ntr-Vijayashanti: స్టార్‌ హీరోల సినిమాల ఈవెంట్లలో ఫ్యాన్స్ చేసే హడావుడి వేరే లెవల్‌లో ఉంటుంది. మిగిలిన వారి ప్రసంగాలను అడ్డుకునే స్థాయిలో ఉంటుంది. దీని కారణంగా మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇబ్బంది పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. కళ్యాణ్‌ హీరోగా నటించిన `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయశాంతిని మాట్లాడనివ్వకుండా చేశారు తారక్‌ ఫ్యాన్స్. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆమె అసహనానికి గురయ్యింది. దీనికి తారక్‌ రియాక్షన్‌ ఏంటంటే?  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 13 2025, 01:54 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
jr ntr, ntr, vijayashanti

jr ntr, ntr, vijayashanti

Ntr-Vijayashanti: ఎన్టీఆర్‌ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చారు. `దేవర` సమయంలో ఈవెంట్‌ నిర్వహించుకోవడానికి పర్మీషన్‌ రాలేదు. దీంతో ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టుకోలేకపోయారు. గ్రూప్‌ ఇంటర్వ్యూలతో మ్యానేజ్‌ చేశారు. ఆ తర్వాత మొన్న `మ్యాడ్‌ 2` ఈవెంట్‌లో సందడి చేశారు తారక్. చిన్న సినిమా కాబట్టి మామూలుగానే క్రౌడ్‌ వచ్చింది.

ఇక శనివారం రాత్రి జరిగిన కళ్యాణ్‌ రామ్‌ `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి తారక్‌ గెస్ట్ గా వచ్చారు. దీంతో భారీగా ఫ్యాన్స్ తరలి వచ్చారు. నందమూరి ఫ్యామిలీ హీరో ఈవెంట్‌ కావడంతో ఫ్యాన్స్ సందడి వేరే లెవల్‌లో కనిపించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
vijayashanti

vijayashanti

ఈవెంట్‌లో కళ్యాణ్‌ రామ్‌, విజయశాంతి ఉన్నప్పటికీ అందరి ఫోకస్‌ ఎన్టీఆర్‌పైనే ఉంది. తారక్‌ ఉన్నప్పుడు ఎవరు మాట్లాడినా ఫ్యాన్స్ వినరు. సాధారణంగా పెద్ద హీరోల విషయంలో ఇదే జరుగుతుంది. తమ అభిమాన హీరో వచ్చినప్పుడు మిగిలిన చిన్న చిన్న ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు మాట్లాడేది వాళ్లు పట్టించుకోరు.

మహేష్‌ బాబు, చిరంజీవి, పవన్‌, తారక్‌ ఇలా అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. తాజాగా `అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి` ఈవెంట్‌లో కూడా అదే జరిగింది. అయితే విజయశాంతి మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ గట్టిగా అరవడం చర్చనీయాంశం అయ్యింది. సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. విజయశాంతిని మాట్లాడనివ్వలేదు.
 

35
jr ntr, ntr, vijayashanti, kalyan ram

jr ntr, ntr, vijayashanti, kalyan ram

దీంతో ఎన్టీఆర్‌ సీరియస్‌ అయ్యాడు. ఇలా చేయోద్దని ఫ్యాన్స్ కి సైగలు చేశాడు, అయినా వినలేదు. దీంతో స్టేజ్‌ నుంచి వెళ్లిపోతా అని చెప్పాడు. అంతేకాదు వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో పక్కనే ఉన్న విజయశాంతి మొదట షాక్‌ అయ్యింది.

సీఎం సీఎం నినాదాలకు ఆమె ఆశ్చర్యపోయింది. కొంత అసహనానికి లోనయ్యింది. కానీ ఎన్టీఆర్‌ని వెళ్లిపోకుండా అడ్డుకుంది. ఆయన్ని బుజ్జగిస్తూ తన పక్కనే నిలబెట్టుకుంది. అయినా ఫ్యాన్స్‌ అరుపులు ఆగలేదు, ఎన్టీఆర్‌ మరోసారి వద్దు వద్దు అంటూ సైగలు చేశారు.

45
jr ntr, ntr, vijayashanti

jr ntr, ntr, vijayashanti

విజయశాంతి మాట్లాడటం స్టార్ట్ చేసింది. దీంతో కాస్త సైలైంట్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ, ఫ్యాన్స్ ఉత్సాహం ఎక్కువగా ఉంది. కంట్రోల్‌ చేయలేకపోతున్నాం. బాబు(ఎన్టీఆర్‌) మీ ఫ్యాన్స్ ఉత్సాహం భయంకరంగా ఉంది అంటూ ఆమె సెటైర్లు వేశారు. 

విజయశాంతి మాట్లాడేటప్పుడు ఇలా రెండు సార్లు జరిగింది. ఫైనల్‌గా వాళ్లు శాంతించారు. విజయశాంతి మాట్లాడింది. ఆమె సినిమాపై హైప్‌ ఇచ్చింది. క్లైమాక్స్ అదిరిపోతుందని, ఎడిటర్‌ నుంచి తమకు రిపోర్ట్ వచ్చిందని చెప్పింది. సినిమా బ్లాక్‌ బస్టర్‌ గ్యారండీ అని చెప్పింది. 

55
jr ntr, ntr, vijayashanti

jr ntr, ntr, vijayashanti

ఇక ఎన్టీఆర్‌ కళ్యాణ్‌ రామ్‌ల గురించి వీరిద్దరు రామ లక్ష్మణులు లాంటి వారని, షూటింగ్‌ సమయంలో తమ్ముడు తారక్‌ గురించి కళ్యాణ్‌ రామ్‌ ఎంతో గొప్పగా చెప్పాడని, ఈ ఈవెంట్‌కి వచ్చినప్పుడు అన్న గురించి తారక్‌ చాలా గొప్పగా చెప్పారని, వీరిద్దరిని చూస్తుంటే రామ లక్ష్మణులు గుర్తుకు వస్తున్నారని చెప్పింది విజయశాంతి. దీంతో ఫ్యాన్స్ అరుపులతో హోరెత్తించారు. 

read  more: Vishwambhara Story Leak: ఏడు లోకాలు, ఏడు గెటప్‌లు, సెకండాఫ్‌ మొత్తం అదే.. `విశ్వంభర` స్టోరీ లీక్

also read: అల్లు అర్జున్‌ రూపంపై అల్లు అరవింద్‌ సెటైర్లు, సొంత కొడుకు గురించే స్టార్‌ ప్రొడ్యూసర్ అంత చులకనగా మాట్లాడాడా?

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image2
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Recommended image3
CBFC: పవన్ కళ్యాణ్ హీరోయిన్ కి సెంట్రల్ సెన్సార్ బోర్డులో కీలక పదవి.. సభ్యులుగా ప్రీతీ జింటా, పంకజ్ త్రిపాఠి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved