MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Vishwambhara Story Leak: ఏడు లోకాలు, ఏడు గెటప్‌లు, సెకండాఫ్‌ మొత్తం అదే.. `విశ్వంభర` స్టోరీ లీక్

Vishwambhara Story Leak: ఏడు లోకాలు, ఏడు గెటప్‌లు, సెకండాఫ్‌ మొత్తం అదే.. `విశ్వంభర` స్టోరీ లీక్

Vishwambhara Story: మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం `విశ్వంభర` సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ మూవీ ముగింపు దశలో ఉంది. అయితే ఎప్పుడు రిలీజ్‌ అనే సస్పెన్స్ నెలకొంది. జూన్‌లో రాబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. కానీ టీమ్‌ నుంచి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. అదే సమయంలో మూవీ కథ గురించి వివిధ రకాల వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ లీక్‌ అయ్యిందని, కథ ఇదే అని అంటున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు వశిష్ట తండ్రి అసలు కథ బయటపెట్టాడు. మరి ఆ కథేంటో చూద్దాం. 
 

Aithagoni Raju | Published : Apr 13 2025, 12:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Vishwambhara

Vishwambhara

Vishwambhara Story: చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న మూవీ `విశ్వంభర`. త్రిష హీరోయిన్‌గా `బింబిసార` ఫేమ్‌ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిస్తున్నారు. `జగదేక వీరుడు అతిలోక సుందరి` తర్వాత ఆ జోనర్‌లో రూపొందుతున్న మూవీ ఇది.

అయితే ఇందులో ఫాంటసీ ఎలిమెంట్లు ఎక్కువగా ఉంటాయని తెలుస్తుంది. మరి కథ ఏంటనేది రకరకాలుగా వినిపిస్తుంది. విడుదలైన టీజర్‌లో భూలోకంతోపాటు దేవతలోకంలోని సన్నివేశాలను చూపించారు. ఆంజనేయుడి ఎలిమెంట్లు, శివుడి ఎలిమెంట్లు కూడా ఉంటాయని తెలుస్తుంది. 
 

26
Vishwambhara film update

Vishwambhara film update

ఇదిలా ఉంటే తాజాగా మూవీ స్టోరీని లీక్‌ చేశారు దర్శకుడు వశిష్ట తండ్రి, నిర్మాత సత్యనారాయణరెడ్డి. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ `విశ్వంభర` అప్‌ డేట్‌ ఇచ్చారు. సినిమా ఫస్టాఫ్‌ మొత్తం చిరంజీవి స్టయిల్‌ లో ఉంటుందట.

`ఘరానా మొగుడు`, `రౌడీ అల్లుడు` స్టయిల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందట. ఆ సమయంలో వింటేజ్‌ చిరంజీవిని చూడొచ్చు అట. ఇంటర్వెల్‌ కి ఫాంటసీ ఎలిమెంట్లు వస్తాయట. ఆ తర్వాత నుంచి సినిమా వేరే లోకాల్లోకి వెళ్తుందని, మూడు గంటలు సినిమా ఉంటే గంటన్నరకుపైగా సీజీ ఉంటుందని తెలిపారు. 

 

36
Vishwambhara

Vishwambhara

ఏడు లోకాల్లో కథ నడుస్తుందట. ఏడు గెటప్‌లు ఉంటాయట, కొత్త పాత్రలు వస్తాయి. కొత్త ప్రపంచం వస్తుంది. అక్కడే సీజీ వర్క్ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అసలు కథ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ నుంచి స్టార్ట్ అవుతుందని, దీనికి సంబంధించిన ఏనిమిది భారీ సెట్స్ వేశారట. అవి ఏడు లోకాలకు సంబంధించిన సెట్స్ అని వెల్లడించారు.

ఆయా సన్నివేశాలకు సంబంధించిన వర్క్ సీజీ ప్రధానంగా ఉంటుందని చెప్పారు. గతంలో మూడు నాలుగు కంపెనీలకు సీజీ వర్క్ ఇచ్చారు, టీజర్‌ రిలీజ్‌ చేసినప్పుడు విమర్శలు వచ్చాయి. దీంతో పకడ్బందీగా సీజీ వచ్చాకనే రిలీజ్‌ డేట్‌ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. ఈ నెల చివరి వరకు సీజీ వర్క్ ఫైనల్‌ ఔట్‌పుట్‌ వస్తుందన్నారు. 

46
Vishwambhara Teaser

Vishwambhara Teaser

సీజీ విషయంలో టీమ్‌ సంతృప్తి అయితేనే రిలీజ్‌ డేటే ఇస్తారని, లేదంటే మరికొంత కాలం వెయిట్‌ చేయక తప్పదన్నారు. అయితే ఇప్పటికే సినిమా షూటింగ్‌ మొత్తం పూర్తయ్యిందట. స్పెషల్‌ సాంగ్‌ ఒక్కటి బ్యాలెన్స్ ఉందని, అది సీజీ వర్క్ కంప్లీట్‌ అయ్యాక తీయాలని అనుకుంటున్నారు.

దాన్ని పెండింగ్‌లో పెట్టారు. ఇప్పుడు టీమ్‌ మొత్తం సీజీ పైనే ఫోకస్‌ పెట్టారు. ఆ విషయంలో రాజీ పడే ఉద్దేశ్యం లేదన్నారు నిర్మాత సత్యనారాయణ రెడ్డి. సినిమాపై భారీ హైప్‌ని పెంచారు. 
 

56
Vishwambhara

Vishwambhara

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం మేరకు సినిమా స్టోరీ ఏంటనేది చూస్తే, ఒక రాక్షసుడు చిన్న పిల్లలను, దేవ కన్యలను ఎత్తుకుపోతుంటాడు. ఈ క్రమంలో ఒక దేవ కన్య భూమి మీదకు వస్తుంది. ఆమెకి చిరంజీవితో పరిచయం అవుతుంది.

ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ సమయంలోనే ఆ రాక్షసుడు భూమి మీదకు వచ్చి ఆ దేవ కన్యని, అలాగే చిరంజీవికి చెందిన చిన్న పిల్లాడిని ఎత్తుకుని పోతాడట.

66
చిరంజీవి

చిరంజీవి

వాళ్లని కాపాడేందుకు చిరంజీవి ఆ రాక్షసుడితో చేసే పోరాటమే ఈ మూవీ అని తెలుస్తుంది. మరోవైపు ఏడు లోకాలకు సంబంధించి ఆరుగురు రాక్షసులతో చిరంజీవి తలపడతాడని, ఆయా సన్నివేశాలు అదిరిపోయేలా ఉంటాయని, గూస్‌ బంమ్స్ తెప్పిస్తాయని తెలుస్తుంది.

విజువల్‌ పరంగానూ అద్భుతంగా ఉండబోతుందట. అదే `విశ్వంభర`కి మెయిన్‌ హైలైట్‌ అని తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.  ఈ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది. 

read  more: హీరో సుమనే మెగాస్టార్‌, చిరంజీవితో పోటీపై స్టార్‌ యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్

also read: అల్లు అర్జున్‌ రూపంపై అల్లు అరవింద్‌ సెటైర్లు, సొంత కొడుకు గురించే స్టార్‌ ప్రొడ్యూసర్ అంత చులకనగా మాట్లాడాడా?

Aithagoni Raju
About the Author
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు. Read More...
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
త్రిష
 
Recommended Stories
Top Stories