MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ ఒక్కరు కాదు ఇద్దరు.. `దేవర`లో మరాఠి హీరోయిన్‌.. ఏ పాత్రకి అంటే?

ఎన్టీఆర్ ఒక్కరు కాదు ఇద్దరు.. `దేవర`లో మరాఠి హీరోయిన్‌.. ఏ పాత్రకి అంటే?

ఎన్టీఆర్‌ ప్రస్తుతం `దేవర` చిత్రంలో నటిస్తున్నారు. ఊరమాస్‌ కథాంశంతో కోస్టల్‌ ఏరియా నేపథ్యంలో సాగే చిత్రమిది. ఈ సినిమాలో మరో హీరోయిన్‌ ఉందట. కొత్త బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Feb 10 2024, 07:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

`ఆర్‌ఆర్‌ఆర్‌` తర్వాత ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `దేవర` మూవీ చేస్తున్నారు ఎన్టీఆర్‌. ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా జాన్వీ కపూర్‌ నటిస్తుంది. ఆమె పాత్రకి ప్రయారిటీ ఉంటుందని తెలుస్తుంది. అలాగే ఎన్టీఆర్‌ పాత్ర కూడా చాలా పవర్‌ పుల్‌గా ఉంటుంది. తన ఏరియాలో భయం అంటే తెలియని వారికి భయాన్ని పుట్టించే పాత్రలో తారక్‌ కనిపిస్తాడని తెలుస్తుంది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. తారక్‌కి జోడీగా ఇద్దరు ముద్దుగుమ్మలు కనిపిస్తారని అంటున్నారు. అయితే అక్కడే ఓ ట్విస్ట్ ఉందని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ ది డ్యూయెల్‌ రోల్‌ అని తెలుస్తుంది. చాలా కాలంగా ఈ వార్త వినిపిస్తుంది. `దేవర`లో తారక్‌ ద్విపాత్రాబినయం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. కానీ ఎవరూ కన్పమ్‌ చేయలేదు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఈ మూవీలో ఎన్టీఆర్‌ తండ్రి కొడుకులుగా కనిపించబోతున్నారట. 
 

36

కొడుకు ఎన్టీఆర్‌కి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ అని తెలుస్తుంది. ఇక తండ్రి ఎన్టీఆర్‌కి కూడా పెయిర్‌ ఉందట. ఆమెని లేటెస్ట్ గా ఫైనల్‌ చేశారట. మరాఠి నటిని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆమె పేరు శృతి మరాఠే. ఆమె మరాఠిలో పలు సినిమాలు చేసింది. ఇటీవల కాలంలో పాపులర్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో తండ్రి ఎన్టీఆర్‌ పాత్రకి జోడీగా ఆమె కనిపించనుందని తెలుస్తుంది. 
 

46
Devara

Devara

అయితే కథ పరంగా తండ్రి ఎన్టీఆర్‌ రోల్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటుందట. ఆయన ఓడరేవుని నిర్మిస్తాడట. తనే ఓడరేవు బేస్డ్ గా భారీ బిజినెస్‌ ప్రారంభిస్తాడట. కానీ ప్రత్యర్థులు కుట్రలు చేసి పెద్ద ఎన్టీఆర్‌ని చంపేస్తారని తెలుస్తుంది. తండ్రి ఓడరేవుని విలన్ల నుంచి తమ వశం చేసుకునేందుకు కొడుకు ఎన్టీఆర్‌ చేసే పోరాటమే ఈ మూవీ అని తెలుస్తుంది. తండ్రి పాత్ర మెయిన్‌గా ఉంటే ఆయన జోడీ కూడా అంతే మెయిన్‌గా ఉంటుంది.

56

అలా అయితే జాన్వీ కంటే మరాఠి నటి పాత్ర కీలకంగా ఉంటుందని చెప్పొచ్చు. కొరటాల శివ ఈ మూవీని యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. గత మూవీ `ఆచార్య` డిజప్పాయింట్‌ చేసిన నేపథ్యంలో చాలా కసిగా ఈమూవీని తీస్తున్నారని టీమ్‌ నుంచి తెలుస్తుంది. 

66

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఉగాది స్పెషల్‌గా ఏప్రిల్‌ 5న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడు వాయిదా వేస్తున్నారట. షూటింగ్‌, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కంప్లీట్‌ కాకపోవడంతో సినిమాని పోస్ట్ పోన్‌ చేస్తున్నారని తెలుస్తుంది. `పుష్ప2` వాయిదా పడితే ఆగస్ట్ లో, లేదంటే దసరాకి రంగంలోకి దించాలని భావిస్తున్నారు. మరి ఎప్పుడు వస్తుందో ఇప్పటికైతే సస్పెన్స్ గానే ఉంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ విలన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. కళ్యాణ్‌ రామ్‌, సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతుంది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
జాన్వీ కపూర్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- దీప, CEO పోటీ నుంచి తప్పుకుంటుందా?
Recommended image2
Jr NTR House: జూనియర్ ఎన్టీఆర్ ఇంద్రభవనం గురించి తెలుసా.. 25 కోట్లతో డ్రీమ్ హౌస్ నిర్మించుకున్న యంగ్ టైగర్
Recommended image3
Kurchi Thatha: తీవ్ర విషాదం, సోషల్ మీడియా సంచలనం కుర్చీ తాత మృతి.. కన్నీరు మున్నీరవుతున్న వైజాగ్ సత్య
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved