#DevaraVsOG:పవన్, ఎన్టీఆర్ మధ్య మరోసారి క్లాష్, గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ?
పాన్ ఇండియా సినిమా లుగా వస్తున్న ఓజీ, దేవర రెండు సినిమాల మీద దేనికదే కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి. విన్నర్ ఎవరనేదే ఉత్కంఠగా మారింది.
Devara and pawan OG
పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ఎన్టీఆర్ ‘దేవర’ , పవన్ కళ్యాణ్ ‘ఓజీ’రెండు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్ ని కూడా దక్కించుకున్నాయి.ఈ రెండు సినిమాలలో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. దేని క్రేజ్ దానిదే..దేనికదే ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. ఈ క్రమంలో ఈ రెండు కూడా కొద్ది రోజుల తేడాలో రిలీజ్ కు రెడీ అవ్వటం కూడా ఆసక్తికరమైన టాపిక్ గా మారింది. అందుకు కారణం..గతంలో ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకసారి పోటి పడ్డాయి. ఇప్పుడు మరోసారి అదే క్లాష్ రాబోతోంది.
2013లో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది రిలీజై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కొద్ది రోజుల గ్యాప్ లో ఎన్టీఆర్ నటించిన రామయ్యా వస్తావయ్యా చిత్రం రిలీజై పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ అప్పుడు విన్నర్ గా నిలిచారు. ఇప్పుడు మరోసారి చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత రెండువారాల తేడాలో తమ సినిమాల రిలీజ్ కు ప్లాన్ చేసుకున్నారు. దాంతో ఈ క్లాష్ ఎలా ఉండబోతోందనే విషయం మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోనూ పెద్ద విషయంగా మారింది.
ఓజీ చిత్రాన్ని పవన్ సూపర్ హిట్ అత్తారింటిదికి దారేదీ రిలీజ్ డేట్ అంటే సెప్టెంబర్ 27న రిలీజ్ కు పెట్టారు. ఆ సినిమా రిలీజైన రెండు వారాల తర్వాత ఎన్టీఆర్ దేవర చిత్రం అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతోంది. దాంతో అభిమానులంతా పదేళ్ల క్రితం ఆ సమయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అయితే ఈ సారి పవన్ సినిమాకు మాగ్జిమం పోటీ దేవర ఇస్తుందంటున్నారు.
ఎన్టీఆర్ చాలా కసిగా చేస్తున్న ప్రాజెక్టు దేవర. కొరటాల శివ కి కూడా ఆచార్య ప్లాప్ తో బ్యాడ్ నేమ్ వచ్చింది. దాన్ని తుడిచేసుకుని ఇక తనని తను ప్రూవ్ చేసుకోవాలంటే ఇదే మంచి అవకాశం అని కసిగా కొరటాల ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. దాంతో పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఓజీ’ సినిమా, ఎన్టీయార్ ‘దేవర’ సినిమా రెండు వారాల తేడా అయినా పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.
కొంతమందైతే ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తే ఏ సినిమా సత్తా ఏంటనేది తెలుస్తుంది అని సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ రెండింటి మధ్య క్లాషేస్ వచ్చినా రెండు సినిమాలు సక్సెస్ అయ్యే అవకాసం ఉందంటోంది ట్రేడ్. పాన్ ఇండియా సినిమా లుగా వస్తున్న ఓజీ,దేవర రెండు సినిమాల మీద దేనికదే కామన్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి.
డైరక్టర్ సుజిత్ కూడా ఇంతకుముందు ప్రభాస్ తో చేసిన సాహో సినిమా తెలుగులో ఓకే అనిపించుకున్నా బాలీవుడ్ లో బాగా సక్సెస్ అయింది. కాబట్టి తనకి కూడా అక్కడ మంచి మార్కెట్ ఉంది. డైరెక్టర్ పరంగా చూసుకున్న, హీరో పరంగా చూసుకున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఓజి , దేవర సినిమాలు వేటికవే పందెం కోళ్లలా ఉన్నాయి. అయితే ఆ అంచనాల వల్లే భారీ ఓపెనింగ్స్ వస్తాయి.
ఇక ‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుండి సోలో హీరో సినిమా రాలేదు. #RRR చిత్రం తో పాన్ వరల్డ్ రేంజ్ క్రేజ్ ని దక్కించుకున్న తర్వాత చేస్తున్న పాన్ ఇండియన్ చిత్రం కావడం తో ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, ఆడియన్స్ కూడా ఎంతో ఇంట్రస్ట్ గా ఎదురుచూస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అయితే రీ ఎంట్రీ తర్వాత ఆయన వరుసగా మూడు రీమేక్ సినిమాలు చేసాడు. ఈ టైమ్ లో రీమేక్ కాకుండా డైరెక్ట్ తెలుగు సినిమా చెయ్యాలని పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ కోరుకున్నారు. కానీ ఆయన ఏకంగా ‘ఓజీ’ లాంటి పాన్ ఇండియన్ చిత్రం చెయ్యడం తో వాళ్లలో ఎక్కడలేని ఉత్సాహం మళ్ళీ తిరిగి వచ్చింది. కాబట్టి రెండూ చిత్రాలు పోటాపోటీగా ఉన్నాయి. ఈ పోటీ లో ఈసారి ఎవరు గెలుస్తారో చూడాలి.
అయితే ఓపినింగ్స్ తెచ్చుకోవటం వరకూ స్టార్ హీరోలు చేయగలిగినా కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే బాగా ఆడతాయనేది ఇప్పటివరకు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూ వస్తున్నాయి. రీసెంట్ గా సంక్రాంతి సినిమాలా విషయం లో కూడా ఇది ప్రూవ్ అయింది. బరిలో ముగ్గురు స్టార్ హీరోలు ఉన్నా కూడా ఒక యంగ్ హీరో అయిన తేజ సజ్జా భారీ సక్సెస్ కొట్టాడు అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సినిమాలో కంటెంట్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అదే సక్సెస్. ఇక ఇప్పుడు ఓజీ, దేవర మధ్య పోటీ లో కూడా కంటెంట్ ఉన్న సినిమా మాత్రమే సక్సెస్ అవుతుంది.