`దేవర` మూవీ ఫస్ట్ రివ్యూ, హైలైట్స్ ఇవే, మైనస్ లు ఏంటంటే?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ `దేవర` కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ రిపోర్ట్ వచ్చింది. ఎలా ఉందో ఓ లుక్కేయండి.
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న `దేవర` చిత్రం రేపు ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో విజువల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. ఆమె తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం మరో విశేషం. ఆమెతోపాటు బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ సైతం `దేవర` మూవీతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. అనిరుథ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. బెస్ట్ టెక్నీషియన్లు ఈ సినిమాకి పనిచేశారు.
బిగ్ బాస్ తెలుగు 8 ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రెండు సార్లు వాయిదా పడ్డ `దేవర` ఎట్టకేలకు రేపు శుక్రవారం(సెప్టెంబర్ 27) ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో ఈ మూవీ రికార్డులు సృష్టిస్తుంది. నార్త్ అమెరికాలో దుమ్మురేపుతుంది. అక్కడ ఇది రెండున్నర మిలియన్స్ ని అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే సాధించిందట.
మరోవైపు ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా ఎనిమిదిన్నర లక్షల టికెట్లు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. ఇది సరికొత్త రికార్డుగానే చెప్పొచ్చు. సినిమాపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ నెగటివ్ టాక్ విస్తరించినా ఫస్ట్ డేకి క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవల్లో ఉంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సినిమాలో ఏం హైలైట్స్ గా ఉండబోతున్నాయనేది కామెంట్లు పెడుతున్నారు టీమ్. ఈ క్రమంలో సినిమాకి అదిరిపోయే పాజిటివ్ టాక్ వస్తోంది. సాధారణంగా ఓవర్సీస్ క్రిటిక్స్ గా చెలామణి అవుతూ, వివాదాస్పద పోస్ట్ లతో వార్తల్లో నిలిచే ఉమైర్ సందు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఆయన చాలా వరకు ఏ సినిమాకైనా, ముఖ్యంగా పెద్ద సినిమాలకు నెగటివ్ రివ్యూలు ఇస్తుంటారు. అందులో చాలా వరకు హిట్లు అయిన సందర్భాలున్నాయి. అలాగే ఆయన చెప్పింది కూడా నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో `దేవర` పై ఆయన పెట్టిన పోస్ట్ లు దుమ్మురేపుతున్నాయి.
ఇందులో ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు ఉమైర్ సందు. అసాధారణమైన నటనతో మెప్పించాడని, తన విశ్వరూపం చూపించాడని తెలిపారు. తారక్ నటన అద్భుతంగా ఉందని, సినిమాకి కావాల్సిన పవర్ ఇచ్చాడని తెలిపాడు. ఆయనకు పోటీగా సైఫ్ అలీ ఖాన్ మరో అద్భుతం అని, ఈ ఇద్దరి నటన నెక్ట్స్ లెవల్‌లో ఉంటాయని చెప్పారు.
ఎన్టీఆర్ ఈ మూవీతో సోలో హీరోగా అదిరిపోయే బ్యాంగ్‌తో రాబోతున్నారని చెప్పారు. సినిమాలో ఆయన లుక్ క్రేజీగా ఉంటుందన్నారు. తన మెస్మరైజింగ్ యాక్టింగ్‌తో అందరిని కట్టిపడేస్తాడని, అలాగే సైఫ్ అలీ ఖాన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టే అని, తెరపై ఆయన లుక్ కట్టిపడేస్తుందన్నారు. యాక్షన్ సీన్లలో దుమ్ములేపాడని చెప్పాడు.
అదే సమయంలో జాన్వీ కపూర్ పాత్ర సెట్ కాలేదని, ఇరికించినట్టుగా ఉంటుందన్నారు. సినిమా కథ పెద్దగా లేదని, మామూలు స్టోరీనే కానీ, ఎంగేజింగ్‌గా ఉందన్న తెలిపారు. స్క్రీన్ ప్లే రేసిగా ఉంటుందట. మ్యూజిక్ పెద్ద అసెట్ అని, బీజీఎం పగిలిపోయిందన్నాడు.
ఓవరాల్‌గా `దేవర` పైసా వసూల్ మూవీ అని, బిగ్ స్క్రీన్‌పై ఒక అద్బుతమైన ఫీలింగ్‌ని కలిగిస్తుందన్నారు. మరి ఆయన నిజంగానే సినిమా చూసి చెప్పాడా? లేక ఊహించుకుని కామెంట్ చేశాడా? అనేది తెలియాలి. కానీ ఇది చూసి తారక్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇది చాలు రెచ్చిపోవడానికి అంటున్నారు.
టీమ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు, సెన్సార్ రిపోర్ట్ ని బట్టి చూస్తే, సినిమాలో ఎన్టీఆర్ నటన, సైఫ్ అలీ ఖాన్‌తో ఫైట్ అదిరిపోతాయని, రెండు పాత్రల్లో తారక్ మంచి ట్రీట్ ఇచ్చాడని అంటున్నారు. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుందని, అలాగే షార్క్ ఫైట్ నెక్ట్స్ లెవల్ అని టాక్. వీఎఫ్‌ఎక్స్ కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయని, మరో కొత్త ప్రపంచలోకి తీసుకెళ్తాయని టాక్. ఇంటర్వెల్ బ్యాంగ్ పిచ్చెక్కిస్తే, క్లైమాక్స్ సస్పెన్స్ ని క్రియేట్ చేస్తూ, నెక్ట్ పార్ట్ పై క్యూరియాసిటీని కలిగిస్తుందట.
మరోవైపు సినిమాలో యాక్షన్ సీన్లు హైలైట్‌గా నిలుస్తాయని, ముఖ్యంగా సముద్రంలోని సీని నెక్ట్స్ లెవల్ అని టాక్. బీజీఎం బాగుందన్నారు. పాటలు ఇప్పటికే ఆకట్టుకున్నాయ. పాటల్లో జాన్వీ గ్లామర్ ఆకర్షించే అంశం. పాత్ర పరంగా ఆమెకి పెద్దగా స్కోప్ లేదని, పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదని తెలుస్తుంది. సెన్సార్ రిపోర్ట్ మేరకు ఈ మూవీకి యూ బై ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగే సినిమా నిడివి 177.58 నిమిషాలు(2.58గంటలు) ఉంటుందట
నెగటివ్ విషయాలకు వస్తే, సినిమా ట్రైలర్‌లోనే అసలు కథ చెప్పడం, దాన్ని బట్టి చూస్తే కథ కొత్తగా ఉండబోదని అంటున్నారు. అలాగే `ఆర్‌ఆర్‌ఆర్` తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా కావడంతో రాజమౌళి సెంటిమెంట్ దీనిపై ఉంటుందేమో అనే నెగటివిటీ వినిపిస్తుంది. అలాగే `ఆచార్య` తో కొరటాల పరాజయాన్ని చవిచూశాడు.
ఆ టెన్షన్ ఈ మూవీపై ఉంటుందని, మరోవైపు ఇది మరో `ఆంధ్రావాలా` లా ఉందని అంటున్నారు. తండ్రి కొడుకులుగా తారక్ చేసిన సినిమాలు ఆడలేదు. ఆ సెంటిమెంట్ కూడా దీనికి అన్వయిస్తున్నారు ట్రోలర్స్. ఈ నెగటివిటీని ఓవర్‌కమ్ చేస్తే, సినిమా పెద్ద రేంజ్ హిట్ కాబోతుందని చెప్పొచ్చు.
మరి ఫలితం ఎలా ఉంటుందో మరో ఒక్క రోజుతో తేలిపోనుంది. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్, యువ సుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని నిర్మించారు. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి పార్ట్ ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ మూవీ ఫలితాన్ని బట్టి రెండో పార్ట్ ఉండబోతుందని టాక్.