దేవర కలెక్షన్స్ : 'దేవర' తెలుగు వెర్షన్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ (ఏరియా వైజ్)
తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
Ntr, Devara, koratala shiva
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం దేవర ఊహకు అందని విధంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం రిలీజై నేటితో ఏడు రోజులు పూర్తి అవుతుంది. ఫస్ట్ వీక్ లో దేవర ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు మనం చూద్దాం..
Ntr, Devara, koratala shiva
దేవర 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్
తాజాగా దేవర రూ.350 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆరు రోజుల్లో ఈ మూవీకు రూ.396 కోట్లు వచ్చినట్లు వెల్లడిస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. గాంధీ జయంతి హాలిడే కావడంతో కలెక్షన్లు పెరిగాయి. కాగా కొన్ని సీన్లను యాడ్ చేసి దసరా నుంచి స్క్రీనింగ్ చేస్తారని టాక్.
6 రోజుల్లో సినిమా అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ ని దాటేసి దుమ్ము లేపింది. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో మాస్ రచ్చ చేసి అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.వర్కింగ్ డేస్ తో పోల్చితే ఆల్ మోస్ట్ డబుల్ మాస్ కలెక్షన్స్ ని అందుకుంది.
Ntr, Devara, koratala shiva
రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్‌ఆర్‌ఆర్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ నటించిన చిత్రం 'దేవర'. దాదాపు ఆరేళ్ల విరామం తరువాత ఆయన నటించిన సోలో చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో డివైడ్ టాక్‌ను తెచ్చుకున్నా దేవర కలెక్షన్స్ విషయంలో మాత్రం స్ట్రాంగ్‌గానే వుంది. తొలి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో కూడా మంచి ప్రారంభ వసూళ్లను సాధించడమే కాకుండా డే వన్ వసూళ్లల్లో రికార్డులను కూడా నెలకొల్పింది. అయితే దేవర ప్యాన్ ఇండియా సినిమా గా రిలీజైంది.
Ntr, Devara, koratala shiva
టోటల్ గా 7 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ (షేర్) ని గమనిస్తే….
👉Nizam: 41 Cr
👉Ceeded: 19.8 CR
👉UA: 13.04Cr
👉East: 6.8 Cr
👉West: 5.6Cr
👉Guntur: 9.2Cr
👉Krishna: 6.3Cr
👉Nellore: 4.2 Cr
👉AP-TG Total: ₹ 106.3 Cr
👉ROI (Approx) ₹ 16 Cr
👉Overseas ₹ 28.5 Cr
👉 Worldwide ₹ 150.8 Cr
దసరా రోజుల్లో దేవర దండయాత్ర
అక్టోబరు 2న గాంధి జయంతి పబ్లిక్ కావడంతో హాలీడే అడ్వాంటేజ్ వచ్చింది. అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్టోబరు 3నుండి దసరా సెలవులు కావడం కూడా కాస్త కలిసి వచ్చే అవకాశం ఉంది. దసరా చివరి రోజు దాకా దేవర కలెక్షన్ల సునామి కొనసాగుతుంది అని ట్రేడ్ అంచనా వేస్తోంది.
ఎన్టీయార్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ అత్యంత భారీ బడ్జెట్ నిర్మించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించారు. తారక్ నటన అనిరుధ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్ కు తీసుకు వెళ్లాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను దేవర దండయాత్ర సాగుతుంది. లాంగ్ రన్ లో దేవర ఏ మేరకు కలెక్షన్స్ రాబడతాడో చూడాలి.