- Home
- Entertainment
- RRR Movie-NTR: ఎన్టీఆర్ క్రేజ్.. తెలంగాణా ఇంటర్ క్వశ్చన్ పేపర్ లో కొమురం భీమ్ పాత్రపై ప్రశ్న!
RRR Movie-NTR: ఎన్టీఆర్ క్రేజ్.. తెలంగాణా ఇంటర్ క్వశ్చన్ పేపర్ లో కొమురం భీమ్ పాత్రపై ప్రశ్న!
సినిమా ఎంత ప్రభావంతమైన మాధ్యమమో చెప్పడానికి ఇదే నిదర్శనం. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీపై ఏకంగా ఇంటర్ మీడియట్ ఎగ్జామ్ పేపర్ లో ప్రశ్నగా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

RRR Movie - NTR
ఎన్టీఆర్, రామ్ చరణ్ (Ram Charan)హీరోలుగా దర్శకుడు రాజమౌళి (Rajamouli) తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 వసూళ్లు దాటేసిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. హిందీలో సైతం రూ. 200 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ నమోదు చేసింది.
RRR Movie - NTR
ఆర్ ఆర్ ఆర్ మూవీ (RRR Movie)చారిత్రక వీరులుగా ఉన్న కొమరం భీమ్, అల్లూరి సీతారామారావు పాత్రల ఆధారంగా ఫిక్షన్ జోడించి రాజమౌళి తెరకెక్కించారు. ఈ మూవీలో కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ చేశారు. గోండు జాతి వీరుడిగా ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.
RRR Movie - NTR
ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్ మూవీలోని ఎన్టీఆర్ (NTR) కొమరం భీమ్ పాత్ర గురించి ఇంటర్మీడియట్ ప్రశ్నా పత్రంలో అడగడం ఆసక్తికరంగా మారింది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పేపర్ లో 12 మార్కుల ప్రశ్నగా ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయాలంటూ అధికారులు పొందుపరిచారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ చూసిన మీరు.. కొమరం భీమ్ పాత్ర చేసిన ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేయాలి. ఓ ప్రముఖ ఛానల్ యాంకర్ గా ఊహించుకొని, ఎన్టీఆర్ ని ఇంటర్వ్యూ చేసే అవకాశం వస్తే ఎలా చేస్తారని అడిగారు.
RRR Movie - NTR
ఇక ఆ ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడగాలో కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు. మూవీ స్వభావం, దర్శకుడితో ఎన్టీఆర్ కి ఉన్న అనుబంధం, ఆడియన్స్ పై ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రభావం, ఇతర నటుల ప్రభావం.. వంటి అంశాలు ఎన్టీఆర్ ని అడిగే ప్రశ్నలలో ఉండాలని ప్రశ్నలో పొందుపరిచారు. ఓ అధికారిక విద్యాకోర్సుకు సంబంధించిన ప్రశ్నాపత్రంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ, ఎన్టీఆర్, ఆయన చేసిన కొమరం భీమ్ పాత్ర గురించి చోటు చేసుకోవడం విశేషంగా మారింది.
RRR Movie - NTR
రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. నవాబులపై సాయుధ పోరాటం చేసిన తెలంగాణా వీరుడు కొమురం భీమ్ పై ఇంటర్మీడియట్ బోర్డు వారు ఈ విధంగా అభిమానం చాటుకొని ఉండవచ్చు. అదే సమయంలో కొమురం భీమ్, అల్లూరి చరిత్రను వక్రీకరించారంటూ కొన్ని ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.