ఓకే ఏడాది మూడు ఫ్లాప్‌లు చవిచూసిన ఎన్టీఆర్ కోస్టార్, మామూలు దెబ్బ కాదు
హృతిక్ రోషన్ ఇప్పుడు 'వార్ 2' సినిమాతో వార్తల్లో ఉన్నారు. 2000లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన హృతిక్ ఆ ఏడాది మూడు సినిమాల్లో నటించారు, అవన్నీ హిట్టే. కానీ ఆ తర్వాత ఒక ఏడాది మూడు సినిమాలు చేసి, మూడూ ఫ్లాప్ అయ్యాయి.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఎన్టీఆర్ `వార్ 2` కో స్టార్‌కి ఆ ఏడాది కోలుకోలేని దెబ్బ
హృతిక్ రోషన్ ఇప్పుడు ఎన్టీఆర్‌కి కో స్టార్. వీరిద్దరు కలిసి `వార్ 2`లో నటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్ డేట్ రాబోతుంది. ఈ క్రమంలో హృతిక్ రోషన్ కెరీర్ కి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. హృతిక్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండో ఏడాది 2002లో మూడు సినిమాలు బాగా ఫ్లాప్ అయ్యాయి. రెండు సినిమాలు 10 కోట్లు కూడా వసూలు చేయలేకపోయాయి.
పది కోట్లు కూడా వసూలు చేయని 'ఆప్ ముఝే అచ్చే లగ్నే లగే'
2002లో హృతిక్ మొదటి సినిమా 'ఆప్ ముఝే అచ్చే లగ్నే లగే' ఏప్రిల్ 19న విడుదలైంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమీషా పటేల్ హీరోయిన్. ఈ సినిమా 9.59 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయ్యింది.
హృతిక్ కి ఒకే ఏడాది రెండో దెబ్బ
2002లో హృతిక్ రెండో సినిమా 'నా తుమ్ జానో నా హమ్' మే 10న విడుదలైంది. హృతిక్, ఈషా డియోల్ నటించిన ఈ ఫ్లాప్ సినిమాకి అర్జున్ సబ్లోక్ దర్శకుడు. ఈ సినిమా కేవలం 8.14 కోట్లు వసూలు చేసింది.
2002లో హృతిక్‌కి మూడో డిజాస్టర్
2002లో హృతిక్ మూడో సినిమా 'ముఝ్సే దోస్తీ కరోగే'. హృతిక్, రాణీ ముఖర్జీ, కరీనా కపూర్ నటించిన ఈ సినిమాకి కునాల్ కోహ్లీ దర్శకుడు. ఈ సినిమా 12.95 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ అయ్యింది.
మొదటి ఏడాది మూడు హిట్లు అందుకున్న హృతిక్
2002 కాకుండా, హృతిక్ తన మొదటి ఏడాది అంటే 2000లో మూడు సినిమాలు చేశారు. బ్లాక్ బస్టర్ 'కహో నా ప్యార్ హై', యావరేజ్ 'ఫిజా', 'మిషన్ కాశ్మీర్' ఇందులో ఉన్నాయి. ఈ మూడు సినిమాలు వరుసగా 44.28 కోట్లు, 14.67 కోట్లు, 22.99 కోట్లు వసూలు చేశాయి.