MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్ , ఏఎన్నార్ మధ్య నిజంగానే గొడ‌వలు ఉండేవా? చంద్రమోహన్ క్లారిటీ

ఎన్టీఆర్ , ఏఎన్నార్ మధ్య నిజంగానే గొడ‌వలు ఉండేవా? చంద్రమోహన్ క్లారిటీ

NTR vs ANR: సీనియర్ నటులు ఎన్టీఆర్ - ఏఎన్నార్ తెరపై ఎప్పుడూ సంహితంగా కనిపించినా, వారి మధ్య విబేధాలు ఉన్నాయని అప్పట్లో టాక్. ఎన్టీఆర్ – ఏఎన్నార్ మధ్య అనుబంధం, ఆనాటి సినీ పరిస్థితులపై సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏమన్నారంటే?

2 Min read
Rajesh K
Published : Sep 08 2025, 02:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెరపై స్నేహం.. వెనకల విభేదాలు!
Image Credit : our own

తెరపై స్నేహం.. వెనకల విభేదాలు!

NTR vs ANR: తెలుగు సినీ చరిత్రలో నందమూరి తారకరామారావు ( NTR), అక్కినేని నాగేశ్వరరావు ( ANR) లకు ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సినిమాకు వీరిద్దర్ని రెండు కళ్లుగా అభివర్ణిస్తారు. ఎన్టీఆర్ తన పౌరాణిక పాత్రల్లో అమోఘమైన నటనతో చెరగని ముద్ర వేసుకోగా, ఏఎన్నార్ ప్రేమకథా చిత్రాల్లో తనకెవరూ సాటిలేరని నిరూపించుకున్నారు. అభిమాన వర్గాల్లో ఇద్దరూ విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్నప్పటికీ, వీరి మధ్య ఎప్పుడూ ఒక ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. తరచూ ఒకేసారి సినిమాలను రిలీజ్ చేసుకోవడం, కలెక్షన్లలో రికార్డులు తిరగరాయడం వంటి ఘటనలు అప్పట్లో తరచూ జరిగేవి.

26
ఎన్టీఆర్–ఏఎన్నార్ అసలు రహస్యం.
Image Credit : our own

ఎన్టీఆర్–ఏఎన్నార్ అసలు రహస్యం.

ఇంతటి స్టార్‌హీరోలు కలిసి నటించడం అరుదే అయినా, ఎన్టీఆర్ – ఏఎన్నార్ లు కలిసి 15 సినిమాల్లో నటించారు. అయితే.. ఎన్టీఆర్ – ఏఎన్నార్. తెరపై ఎప్పుడూ సంహితంగా కనిపించినా, వారి మధ్య లోతైన విబేధాలు ఉన్నాయని అప్పటి పరిస్థితులపై అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఆ కాలానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను సీనియర్ నటుడు చంద్రమోహన్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

Related Articles

Related image1
NTR-Krishna: ఎన్టీఆర్‌ సూపర్‌ హిట్‌ మూవీని ఫ్రీమేక్‌ చేసి చావు దెబ్బతిన్న సూపర్‌ స్టార్‌ కృష్ణ
Related image2
ANR: అమ్మాయిలా నడుస్తున్నాడు హీరో అవుతాడా? అక్కినేని ఎదుర్కొన్న అవమానాలు.. లావుగా కనబడేందుకు బాడీకి ప్యాడ్స్‌
36
సంహితంగా కనిపించినా.. లోపల విబేధాలే!
Image Credit : Social Media

సంహితంగా కనిపించినా.. లోపల విబేధాలే!

సీనియర్ నటుడు చంద్రమోహన్ మాటల్లో "ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇద్దరూ బయటకు చాలా సాన్నిహిత్యంగా కనిపించేవారు. కానీ నిజానికి వారి మధ్య విబేధాలు ఉండేవి. అప్పట్లో ఏ నటుడు అయినా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తే, అతనికి ఏఎన్నార్ సినిమాల్లో నటించే అవకాశం కోల్పోవాల్సి వచ్చేది. అలాగే ఏఎన్నార్ సినిమాల్లో నటిస్తే, ఎన్టీఆర్ సినిమాల్లో ఛాన్స్ రావడం కష్టమయ్యేది. అంటే, ఆ స్థాయిలో వారి మధ్య సినీ రాజకీయాలు నడిచేవి." అని తెలిపారు.

46
నిర్మాణ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్ల విభజన
Image Credit : Asianet News

నిర్మాణ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్ల విభజన

చంద్రమోహన్ మాట్లాడుతూ – "ఆ కాలంలోనే నిర్మాతలు, నిర్మాణ సంస్థలు కూడా ఇద్దరి మధ్యే విడిపోయేవారు. ఉదాహరణకు నవయుగ మూవీ క్రియేషన్ ఎన్టీఆర్ సినిమాలు చేయదు. అదే విధంగా విజయ మూవీ క్రియేషన్ నాగేశ్వరరావుతో సినిమాలు తీయడానికి ముందుకు రాలేదు. వారి మధ్య ఆంతరంగిక విభేదాలు ఉండటంతో, నిర్మాణ సంస్థలకూ ఒక రేఖ గీసినట్టే ఉండేది." అని వ్యాఖ్యానించారు. ఇక డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కూడా అలాగే ఉండేదని చంద్రమోహన్ గుర్తు చేశారు. "ఎన్టీఆర్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే వారే గాని, ఏఎన్నార్ సినిమాలను తాకరని. అలాగే ఏఎన్నార్ సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసే వారు ఎన్టీఆర్ సినిమాలను తాకరని పరిస్థితి ఉండేది. అంటే, అభిమాన వర్గాలు మాత్రమే కాదు, నిర్మాతల దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకు ఆ విభేదాలు స్పష్టంగా కనిపించేవి." అని అన్నారు.

56
విబేధాలకు దారి తీసిన సంఘటన ఇదేనా?
Image Credit : our own

విబేధాలకు దారి తీసిన సంఘటన ఇదేనా?

ఎన్టీఆర్ – ఏఎన్నార్ లు సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఒక దశలో మాత్రం వారి మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు సినీ వర్గాలు చెబుతుంటాయి. ఆ విభేధాలకు కారణమైన సంఘటన గురించి పాత తరం సినీ ప్రముఖులు చెప్పిన ఆసక్తికర కథనం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఒకసారి తన సినిమాలో కృష్ణుడి పాత్ర వేసుకోవాలని ఎన్టీఆర్, ఏఎన్నార్‌ను కోరారట. అయితే దీనికి ఏఎన్నార్ సున్నితంగా స్పందిస్తూ “ఆ ఒక్క మాట మాత్రం అడగకండి మహానుభావా” అంటూ నేరుగా తిరస్కరించారట.

66
ముఖ్యమంత్రితో రాయభారం
Image Credit : our own

ముఖ్యమంత్రితో రాయభారం

ఇంతటితో ఎన్టీఆర్ ఆగకుండా అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ద్వారా కూడా ఏఎన్నార్‌ను ఒప్పించే ప్రయత్నం చేశారట. కానీ ఏఎన్నార్ మాత్రం తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదట. ఈ సంఘటన తర్వాతే ఇద్దరి మధ్య మనస్పర్థలు మరింత లోతుగా మారాయని అంటారు. దీని ఫలితంగా, ఎన్టీఆర్ – ఏఎన్నార్ ఇద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలు ఇకపై చేయకూడదని నిర్ణయానికి వచ్చారట. తెరపై అద్భుతమైన జంటగా మెప్పించినా, ఈ సంఘటన తర్వాత వారి మార్గాలు వేర్వేరుగా సాగిపోయాయని టాక్. తెరపై మల్టీస్టారర్ సినిమాలతో మంత్ర ముగ్ధుల్ని చేసినా ఎన్టీఆర్ – ఏఎన్నార్ మధ్య విబేధాలు అప్పటి సినీ రంగంలో ఒక ఓపెన్ సీక్రెట్ అని చంద్రమోహన్ మాటల్లో స్పష్టమవుతోంది.

About the Author

RK
Rajesh K
రాజేశ్ కారంపూరి: ఆరు సంవత్సరాలుగా ప్రముఖ ప్రింట్, డిజిటల్, వెబ్ మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రధానంగా పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, సినిమా, స్పోర్ట్స్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియానెట్‌ తెలుగులో ఫ్రీలాన్సర్ గా పని చేస్తున్నారు.
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved