- Home
- Entertainment
- కృష్ణంరాజు, చిరంజీవి `మనవూరి పాండవులు`తో పోటీపడి అడ్రస్ లేకుండా పోయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలివే
కృష్ణంరాజు, చిరంజీవి `మనవూరి పాండవులు`తో పోటీపడి అడ్రస్ లేకుండా పోయిన ఎన్టీఆర్, ఏఎన్నార్ సినిమాలివే
రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన `మనవూరి పాండవులు` మూవీతో పోటీ పడి ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్, ఏఎన్నార్ మూవీస్ చిత్తైపోయాయి. దాదాపు నాలుగు సినిమాలు అడ్రస్ లేకుండా పోయాయి.

కృష్ణంరాజు, చిరంజీవిలతో పోటీ పడ్డ ఎన్టీఆర్, ఏఎన్నార్
పెద్ద హీరోల సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సీనియర్లతో పోటీపడి జూనియర్లు హిట్ కొట్టినప్పుడు వచ్చే కిక్ వేరే అని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో ఒకప్పుడు తిరుగులేని స్టార్స్ గా రాణించిన ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు చుక్కలు చూపించారు రెబల్ స్టార్ కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి. అప్పటికీ చిరంజీవి ఎవరో ఇంకా ఇండస్ట్రీకి తెలియదు. కృష్ణంరాజు జూనియర్‌గా ఉన్నాడు. కానీ వీళ్లు నటించిన `మనవూరి పాండవులు` మూవీతో పోటీపడి ఎన్టీఆర్, ఏఎన్నార్ డిజాస్టర్లని ఫేస్ చేశారు.
బాక్సాఫీసు వద్ద దుమ్మురేపిన `మనవూరి పాండవులు` మూవీ
రెబల్ స్టార్ కృష్ణంరాజు అప్పటికే స్టార్ హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి ఇంకా ఒక్క మూవీ కూడా చేయలేదు. అలాంటి సమయంలో వీరిద్దరు కలిసి నటించిన చిత్రం `మనవూరి పాండవులు`. ఓ రకంగా ఇందులో చిరంజీవికి ఆఫర్ రావడానికి కృష్ణంరాజునే కారణం. తమ ప్రాంతం అబ్బాయినే కావడం, చిరంజీవి తాత కృష్ణంరాజుకి బాగా తెలియడంతో చిరులోని ఎనర్జీని, ఉత్సాహాన్ని, చురుకుదనాన్ని చూసి ఈ సినిమాలో తీసుకున్నారు కృష్ణంరాజు. ఇందులో మురళీ మోహన్, రావు గోపాలరావు, ప్రసాద్ బాబు వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. బాపు దర్శకత్వం వహించారు. ఊర్లల్లో ఉండే భూస్వామ్య వ్యవస్థకి వ్యతిరేకంగా ఐదుగురు కుర్రాళ్లతో కృష్ణంరాజు చేసిన పోరాటం నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. 1978 నవంబర్ 9న ఈ సినిమా విడుదలై భారీ విజయాన్ని సాధించింది. వంద రోజులకుపైగానే ఆడింది.
`మనవూరి పాండవులు`తోనే చిరంజీవికి గుర్తింపు
ఈ సినిమాతోనే చిరంజీవి పాపులర్ అయ్యారు. అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఆయనకు వరుసగా ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి. హీరోగా, సెకండ్ లీడ్‌గా, విలన్‌గా చేసుకుంటూ వచ్చారు. అనతి కాలంలోనే మంచి ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నారు. డాన్సులతో అదరగొట్టి అప్పట్లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అందుకే నెమ్మదిగా మేకర్స్ చిరంజీవి వైపు మొగ్గు చూపారు. ఆయన వరుసగా సినిమాలతో మెప్పించారు. `ఖైదీ`తో హిట్ అందుకుని ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. అలా `మనవూరి పాండవులు` మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. కానీ దీనికి పోటీగా వచ్చిన ఎన్టీఆర్, ఏఎన్నార్ చిత్రాలు డిజప్పాయింట్ చేశాయి.
లాయర్ విశ్వనాథ్ తో పరాజయం చవిచూసిన ఎన్టీఆర్
`మనవూరి పాండవులు`తో పోటీ పడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్ సినిమా ఉండటం విశేషం. ఆయన హీరోగా నటించిన `లాయర్ విశ్వనాథ్` మూవీ కూడా అదే సమయంలో వచ్చింది. ఇందులో జయసుధ హీరోయిన్‌గా నటించింది. ఎస్ డీ లాల్ దర్శకత్వం వహించగా, వైవీ రావు నిర్మించారు. 1978 నవంబర్ 17న ఈ చిత్రం విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. ఎన్టీఆర్ ఆ సమయంలో స్టార్‌గా కెరీర్ పీక్ లో ఉన్నా, ఈ మూవీ మాత్రం బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్ చేసింది. అప్పటికే థియేటర్లలో `మనవూరి పాండవులు` రన్ అవుతుండటంతో వారం గ్యాప్‌తో వచ్చినా కూడా ఈ సినిమాని పక్కన పెట్టారు ఆడియెన్స్. అలా కృష్ణంరాజు, చిరంజీవిల దెబ్బకి రామారావు మూవీ చిత్తైపోయింది.
డిజాస్టర్ ఫేస్ చేసిన మురళీ మోహన్
`మనవూరి పాండవులు` విడుదలైన మరుసటి రోజే చంద్రమోహన్ హీరోగా నటించిన `సీతాపతి సంసారం` విడుదలైంది. అప్పట్లో చంద్రమోహన్ పెద్ద హీరో. అంతటి ఇమేజ్ ఉన్న ఆయన నటించిన ఈ మూవీలో ప్రభ హీరోయిన్‌గా నటించింది. ఎంఎస్ కోటా రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కొమ్మినేని చక్రవర్తి సంగీతం అందించారు. ఇది నవంబర్ 10 1978లో విడుదలైంది. `మనవూరి పాండవులు` మూవీ దెబ్బకి ఫస్ట్ డే నుంచే అడ్రస్ లేకుండా పోయింది.
శ్రీరామ రక్ష మూవీతో డిజప్పాయింట్ అయిన ఏఎన్నార్
`మనవూరి పాండవులు`కి వారం ముందుగానే ఏఎన్నార్ వచ్చారు. ఆయన హీరోగా నటించిన `శ్రీరామ రక్ష` చిత్రం నవంబర్ 2న విడుదలైంది. ఇందులో నాగేశ్వరరావుకి జోడీగా వాణిశ్రీ, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఇందులో అక్కినేని ద్విపాత్రాభినయం చేయడం విశేషం. అప్పటికే పాపులర్ అయిన తాతినేని రామారావు ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇందులో జగ్గయ్య కీలక పాత్ర పోషించారు. క్లీన్ ఫ్యామిలీ మూవీగా వచ్చినా ఇది ఆడియెన్స్ ని మెప్పించలేదు. అయితే ప్రారంభంలో ఫర్వాలేదనిపించింది. కానీ నెక్ట్స్ వారమే `మనవూరి పాండవులు` రిలీజ్ కావడంతో ఇది డ్రాప్ అయ్యింది. మొత్తంగా డిజస్టార్‌గా మిగిలిపోయింది.
మురళీ మోహన్ సినిమాకి కూడా చుక్కలు
`మనవూరి పాండవులు`కి రెండు వారాల గ్యాప్‌తో మురళీ మోహన్ హీరోగా నటించిన `శభాష్ గోపి` మూవీ విడుదలైంది. మానికొండ మధుసూదనరావు దర్శకత్వం వహించారు. ఇందులో కవిత హీరోయిన్‌గా నటించగా, కాంచన కీలక పాత్ర పోషించాడు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు ఘట్టమనేని మంజుల బాల నటిగా నటించడం విశేషం. ఈ మూవీ నవంబర్ 24న విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా `మనవూరి పాండవులు`తో పోటీ పడ్డ దాదాపు నాలుగు సినిమాలు అడ్రస్ గల్లంతు కాగా, ఎన్టీఆర్, ఏఎన్నార్ మూవీస్ సైతం డిజాస్టర్లుగా నిలవడం గమనార్హం.

