- Home
- Entertainment
- ఓటీటీ లోకి రష్మిక మందన్న సినిమా, ది గర్ల్‌ఫ్రెండ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఓటీటీ లోకి రష్మిక మందన్న సినిమా, ది గర్ల్‌ఫ్రెండ్ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
The Girlfriend Movie OTT Release : రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా లైఫ్‌టైమ్ కలెక్షన్లు ఎంతో తెలుసా?

ది గర్ల్‌ఫ్రెండ్’
తక్కువ టైంలోనే పాన్ ఇండియా స్టార్ గా ఎదిగింది రష్మిక మందన్న, చేసింది తక్కువ సినిమాలే అయినా.. ‘నేషనల్ క్రష్’గా పేరు తెచ్చుకుంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లు సాధించిందంటే?
నెట్‌ఫ్లిక్స్ లో ది గర్ల్‌ఫ్రెండ్ ?
‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీలో విడుదల కానుంది. డిసెంబర్ 5 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని తాజాగా ప్రకటించారు. రష్మికతో పాటు దీక్షిత్ శెట్టి ఈ చిత్రంలో మరో కీలక పాత్రలో నటించారు. రష్మిక, దీక్షిత్ శెట్టి మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని సినిమాలో అందంగా చూపించారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌లో థియేటర్లలోకి వచ్చింది.
ది గర్ల్‌ఫ్రెండ్ వసూళ్లు
రష్మిక మందన్న నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా ఇండియాలో 17 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 29 కోట్లు రాబట్టింది. వసూళ్ల పరంగా పెద్దగా ప్రభావం చూపకపోయినా, ఈమూవీ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఈ సినిమా బడ్జెట్ రూ.42 కోట్లు అని సమాచారం. ఇందులో ఒక పాటను కోటి రూపాయల ఖర్చుతో తీశారు. కానీ ఆ పాట సినిమాలో లేదు.
ఓటీటీ స్పందనపై వెయిటింగ్
గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పించారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందించగా, హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేశారు. థియేటర్లలో ఫ్లాప్ అయిన ఈ సినిమా, ఓటీటీలో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నారు.

