- Home
- Entertainment
- అమర కావ్యం 3 రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీసుని షేక్ చేస్తోన్న ధనుష్ మూవీ, ఎంత వచ్చాయంటే?
అమర కావ్యం 3 రోజుల కలెక్షన్లు.. బాక్సాఫీసుని షేక్ చేస్తోన్న ధనుష్ మూవీ, ఎంత వచ్చాయంటే?
Amara Kavyam Collections: ధనుష్, కృతి సనన్ నటించిన 'తేరే ఇష్క్ మే'(అమర కావ్యం) సినిమా విడుదలై 3 రోజులైంది. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల కలెక్షన్లు తెలుసుకుందాం.

బాక్సాఫీసు వద్ద `అమర కావ్యం` రచ్చ
ధనుష్, కృతి సనన్ కలిసి నటించిన 'తేరే ఇష్క్ మే'(అమర కావ్యం) సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలోనూ దీన్ని విడుదల చేశారు. ధనుష్ బాలీవుడ్ లో నటించిన చిత్రమిది కావడం విశేషం. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతుంది.
`అమర కావ్యం` మూడో రోజు కలెక్షన్లు
తాజాగా ఈ సినిమా బాక్సాఫీసు కలెక్షన్లు బయటకు వచ్చాయి. డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ సినిమా 'అమర కావ్యం` మూడో రోజు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. sacnilk.com ప్రకారం, ఈ సినిమా మూడో రోజు రూ.18.75 కోట్ల బిజినెస్ చేసింది.
`అమర కావ్యం` మూడు రోజుల కలెక్షన్లు
ధనుష్, కృతి సనన్ మొదటిసారి జోడీ కట్టిన ఈ సినిమా మొదటి రోజు రూ.16 కోట్లతో ఖాతా తెరిచింది. రెండో రోజు శనివారం రూ.17 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు రూ.18.75కోట్లు రాబట్టడం విశేషం. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.51.75 కోట్ల కలెక్షన్లని రాబట్టింది.
తేరే ఇష్క మే` థియేటర్ ఆక్యుపెన్సీ
'తేరే ఇష్క్ మే' సినిమా ఆక్యుపెన్సీ చూస్తే, మార్నింగ్ షోలకు 14.32%, మధ్యాహ్నం 38.60%, సాయంత్రం షోలకు 45.63% ఉంది. బాక్సాఫీస్ వద్ద సినిమాకు మంచి స్పందన వస్తోంది. అయితే ఈ చిత్రం క్రమంగా పుంజుకోవడం విశేషం. సాధారణంగా ఏ సినిమా అయినా మొదటి రోజు ఎక్కువ కలెక్షన్లని రాబడుతుంది, ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి. కానీ ఇది రివర్స్ లో రోజు రోజుకి పెరగడం విశేషం. దీంతో సినిమా సక్సెస్‌కిది నిదర్శమని చెప్పొచ్చు.
`రాంఝానా`కి సీక్వెల్?
`అమర కావ్యం` ఒక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా సినిమాగా వచ్చింది. దీనికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. హిమాన్షు శర్మ, నీరజ్ యాదవ్ స్క్రీన్‌ప్లే రాశారు. ఇది 'రాంఝానా' (2013)కి స్పిరిచ్యువల్ సీక్వెల్ అని నెటిజన్లు అంటున్నారు. ఏదేమైనా ఆ సినిమా అంతగా ఆడలేదు, కానీ ఇది మాత్రం బాక్సాఫీసు వద్ద గర్జించడం విశేషం.
`అమర కావ్యం` కాస్టింగ్ డిటెయిల్స్
`అమర కావ్యం`లో ధనుష్, కృతి సనన్ మొదటిసారి తెరపై రొమాన్స్ చేయగా, వీరితో పాటు ప్రకాష్ రాజ్, తోట రాయ్ చౌదరి, ప్రియాన్షు, రవి కిషన్, చిత్తరంజన్ త్రిపాఠి, జయ భట్టాచార్య, వినీత్ కుమార్ సింగ్, మహమ్మద్ జీషన్ అయ్యుబ్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాని రూ.85 కోట్ల బడ్జెట్‌తో తీశారు. ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ, భూషణ్ కుమార్, కిషన్ కుమార్ నిర్మాతలు. దీన్ని కలర్ యెల్లో ప్రొడక్షన్స్, టి-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు.

