- Home
- Entertainment
- బావ కోసమే పుట్టారు... ఎన్టీఆర్, ఎన్నార్ తో పాటు సొంత మరదళ్ళను భార్యలుగా చేసుకున్న స్టార్స్ వీరే!
బావ కోసమే పుట్టారు... ఎన్టీఆర్, ఎన్నార్ తో పాటు సొంత మరదళ్ళను భార్యలుగా చేసుకున్న స్టార్స్ వీరే!
ఈ రోజుల్లో అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే వింత. ఇక మరదళ్ళను చేసుకోవడం అనే మాటే లేదు. కానీ టాలీవుడ్ టాప్ స్టార్స్ కొందరు మరదళ్ళతో ఏడడుగులు వేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తో పాటు సొంత మరదళ్ళను భార్యలుగా తెచ్చుకున్న హీరోలు ఎవరో చూద్దాం..
NTR
నందమూరి తారక రామారావు పరిశ్రమకు రాకముందే వివాహం చేసుకున్నారు. సొంత మరదలు బసవతారకంతో 1948లో ఆయనకు వివాహం జరిగింది. భార్యను సొంతూరిలో ఉంచి, చెన్నై వచ్చి సినిమాలు ప్రయత్నాలు చేసి ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు.
NTR
అక్కినేని నాగేశ్వరరావు 1949లో మరదలు అన్నపూర్ణను వివాహం చేసుకున్నారు. అప్పటికి నాగేశ్వరరావు హీరోగా కొంత గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో గొప్ప గొప్ప సంబంధాలు వచ్చాయట. కానీ ఆయన మరదలినే మనువాడారు.
NTR
ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత స్టార్ గా వెలుగొందిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1961లో ఇందిరా దేవిని కృష్ణ వివాహం చేసుకున్నారు. ఇందిరాదేవి కృష్ణకు మరదలు అని సమాచారం.
NTR
మోహన్ బాబు సొంత మరదలు విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమెకు మంచు లక్ష్మి, విష్ణు సంతానం. విద్యాదేవి మరణించడంతో ఆమె చెల్లెలు నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి మనోజ్ సంతానం.
NTR
డైలాగ్ కింగ్ సాయి సుకుమార్ నట వారసుడు ఆది సాయి కుమార్ 2014లో మేనమామ కూతురు అరుణను వివాహం చేసుకున్నాడు. ఆది సాయి కుమార్ సక్సెస్ కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
NTR
స్టార్ బ్రదర్స్ సూర్య-కార్తీలకు తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కార్తీ 2011లో మరదలు రజిని చిన్న స్వామిని వివాహం చేసుకున్నాడు.