MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్

రవి మోహన్ కి ఊహించని షాక్, ప్రతి నెలా రూ.40 లక్షలు భరణం ఇవ్వాలంటూ ఆర్తి డిమాండ్

విడాకుల విషయంలో రవి మోహన్ కి కౌంటర్ గా ఆర్తి సంచలన పిటిషన్ దాఖలు చేసింది. భారీ మొత్తంలో భరణం డిమాండ్ చేస్తూ తన పిటిషన్ ని ఆర్తి కోర్టుకు సమర్పించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 21 2025, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జయం చిత్రంతో ఎంట్రీ
Image Credit : stockphoto

జయం చిత్రంతో ఎంట్రీ

జయం సినిమాతో పరిచయమైన రవి, దానినే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. వరుసగా ఎం.కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి, తని ఒరువన్ లాంటి ఎన్నో హిట్ చిత్రాల్లో రవి మోహన్ నటించారు. చాలాకాలం స్నేహితురాలైన ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. గత ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా తన భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్లు ప్రకటించారు.   

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వెనక్కి తగ్గని రవి మోహన్
Image Credit : our own

వెనక్కి తగ్గని రవి మోహన్

ఈ వార్త అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ నేపథ్యంలో తన పేరుని రవి మోహన్‌గా మార్చుకున్నారు. ఆర్తి నుండి విడిపోతున్నట్లు ప్రకటించిన రవి మోహన్, విడాకులు కోరుతూ కుటుంబ న్యాయస్థానంలో కేసు వేశారు. ఇరువైపులా రాజీ కుదిర్చేందుకు న్యాయస్థానం కౌన్సెలింగ్ నిర్వహించింది. అయినా రవి మోహన్ విడాకుల విషయంలో వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో ఇరువైపులా ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తూ ప్రకటనలు విడుదల చేసుకుంటూ వచ్చారు.

35
కోర్టులో విడాకుల కేసు
Image Credit : Google

కోర్టులో విడాకుల కేసు

భార్యతో రాజీ కుదుర్చుకునేందుకు రవి మోహన్ సిద్ధంగా లేరు. రవి మోహన్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ, తమ వివాహాన్ని కొనసాగించేందుకు తనకు ఎలాంటి ఆసక్తి లేదని తెలిపారు. అలాగే భార్య ఆర్తితో తిరిగి కలవాలన్న ఆమె అభ్యర్థనను తిరస్కరించాలని కోర్టును కోరారు. రవి మోహన్ తరఫు న్యాయవాదులు కూడా విడాకులు మంజూరు చేయాలన్న అభ్యర్థనతో సంబంధిత పిటిషన్‌ను కోర్టుకు సమర్పించారు. రవి మోహన్ పిటిషన్ కి పోటీగా ఆర్తి మరో సంచలన పిటిషన్ దాఖలు చేసింది. 

45
భరణం కోసం ఆర్తి సంచలన పిటిషన్
Image Credit : our own

భరణం కోసం ఆర్తి సంచలన పిటిషన్

ఆర్తి తన పిటిషన్‌లో రవి మోహన్ ప్రతినెలా రూ. 40 లక్షల భరణం ఇవ్వాలని కోర్టును కోరారు. దీనితో ఆర్తి పిటిషన్ పై సర్వత్రా చర్చ మొదలైంది. కోర్టు ఇరు పక్షాల పిటిషన్లను పరిశీలించి, దీనిపై వారి రెస్పాన్స్ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 12కి వాయిదా వేసింది.

55
కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్
Image Credit : our own

కెనీషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్

గాయని కెనీషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్‌కి ఉన్న పరిచయం వల్లే తన వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లిందనే వార్తలు వచ్చాయి. ఇద్దరూ కొన్ని రోజుల క్రితం ఒక పెళ్లిలో కలిసి కనిపించడం సంచలనం సృష్టించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chakkora Movie Review: చకోర మూవీ రివ్యూ.. సరికొత్త ప్రేమ కథలోని సందేశం ఎలా ఉందంటే?
Recommended image2
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image3
Rajamouli: మాట తప్పిన అల్లు అరవింద్.. కోపంతో రగిలిపోయిన రాజమౌళి! ఏం చేశాడంటే?
Related Stories
Recommended image1
RRR, రంగస్థలం చిత్రాలకి ఏమాత్రం తగ్గదు.. రామ్ చరణ్ తో మూవీపై సొంతూరిలో సుకుమార్ కామెంట్స్
Recommended image2
అలాంటి కథలతో చిరంజీవి విసిగిపోయారు, మునుపెన్నడూ చూడని మెగాస్టార్ ని చూస్తారు.. రచయిత కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved