- Home
- Entertainment
- NTR-Charan: ఆ సర్వే ప్రకారం ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ చరణ్, ఎన్టీఆర్ లో ఎవరికి దక్కిందంటే!
NTR-Charan: ఆ సర్వే ప్రకారం ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ చరణ్, ఎన్టీఆర్ లో ఎవరికి దక్కిందంటే!
ఆర్ ఆర్ ఆర్ విడుదల తర్వాత నందమూరి, మెగా అభిమానుల మధ్య చాలా పెద్ద రచ్చ జరిగింది. సోషల్ మీడియాలో వార్ నడిచింది. మూవీలో ఎవరి పాత్రకు అధిక ప్రాధాన్యత ఉందనే విషయంపై వివాదం రాజుకుంది. ఫైనల్ గా రామ్ చరణ్ దే పై చేయని మెగా ఫ్యాన్స్ నిర్ధారించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఢిపెన్సులో పడ్డారు.

దానికి కారణం లేకపోలేదు పైకి గాంభీర్యం ప్రదర్శించినప్పటికీ వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. దర్శకుడు రాజమౌళి (Rajamouli) అల్లూరి పాత్రకు ఇచ్చినంత ప్రాధాన్యత, ఎలివేషన్ భీమ్ పాత్రకు ఇవ్వలేదని గట్టిగా నమ్మారు. చరణ్ పాత్రకు ఫ్లాష్ బ్యాక్ ఉండడం, క్లైమాక్స్ ఫైట్ లో అల్లూరి గెటప్ లో రామ్ చరణ్ ఓ రేంజ్ లో పోరాడడం ఎన్టీఆర్ అభిమానుల అసహనానికి కారణమయ్యాయి.
ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ (NTR) ఫ్యాన్స్ నుండి రాజమౌళి బెదిరింపు కాల్స్, సందేశాలు అందుకున్నట్లుగా వార్తలొచ్చాయి. రాజమౌళి మాత్రం దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. కొందరు ఫ్యాన్స్ ఓపెన్ గా సోషల్ మీడియాలో రాజమౌళిని తిట్టారు. మరికొందరు రాజమౌళిని సమర్ధించారు.
కాగా ఇద్దరు హీరోల్లో ఆర్ ఆర్ ఆర్ క్రెడిట్ ఎన్టీఆర్ కంటే ఎక్కువగా చరణ్ కైవసం చేసుకున్నాడన్న మాట వినిపించింది. బాలీవుడ్ మీడియా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేయగా చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే క్షేత్ర స్థాయిలో అది నిజం కాదని తేలింది. సర్వేల ప్రకారం రామ్ చరణ్ (Ram Charan) కంటే ఎన్టీఆర్ ఇమేజ్ బాగా పెరిగింది.
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ వెల్లడించిన సర్వే ఫలితాల్లో ఎన్టీఆర్ దూసుకుపోగా చరణ్ మాత్రం వెనుకబడ్డాడు. గతంతో పోల్చితే చరణ్ తన ర్యాంక్ మెరుగుపరుచుకున్నాడు. అయితే ఎన్టీఆర్ తో పోటీ పడలేకపోయారు. మరోవైపు ఎన్టీఆర్ స్థానిక, జాతీయ రెండు ర్యాంకింగ్స్ లో సత్తా చాటాడు.
ఏప్రిల్ 22 వరకు ఆర్మాక్స్ సంస్థ తెలుగులో పాప్యులర్ స్టార్స్ లిస్ట్ ప్రకటించగా.. ఎన్టీఆర్ ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. గతంలో ఎన్టీఆర్ ర్యాంక్ 4-5 స్థానాల్లో ఉంది. ఇక 6-7 ర్యాంకింగ్స్ లో ఉన్న రామ్ చరణ్ 4వ స్థానం దక్కించుకొని టాప్ 5 లోకి వచ్చాడు.
ఇక జాతీయ స్థాయిలో పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో ఎన్టీఆర్ 2వ ర్యాంక్ రాబట్టి షాక్ ఇచ్చాడు. ఈ లిస్ట్ లో బాలీవుడ్ నుండి ఒక్క అక్షయ్ కుమార్ కి మాత్రమే చోటు దక్కింది. అక్షయ్ 5వ ర్యాంక్ రాబట్టారు. అనూహ్యంగా తలపతి విజయ్ మొదటి ర్యాంక్ రాబట్టడం జరిగింది. టాప్ ఫైవ్ లో విజయ్, ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, అక్షయ్ కుమార్ వరుసగా ఉన్నారు.
కాగా రామ్ చరణ్ కి టాప్ 5 లో చోటు దక్కలేదు. పాప్యులర్ పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో చరణ్ కి కేవలం 7వ స్థానం దక్కింది. ఆర్ ఆర్ ఆర్ లో నటించిన ఎన్టీఆర్ 2, చరణ్ కి 7వ ర్యాంక్ దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ విడుదల కానీ పక్షంలో ఈ ఇద్దరు హీరోలకు టాప్ టెన్ లో చోటు దక్కడం అనుమానమే. వాళ్ళ ర్యాంకింగ్ వెనుక ఆర్ ఆర్ ఆర్ మూవీ ఉంది.
కాబట్టి వాస్తవంలో ఆర్ ఆర్ ఆర్ మూవీ(RRR Movie) క్రెడిట్ ఇద్దరు హీరోలకు దక్కినా... ఎన్టీఆర్ ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్నాడనిపిస్తుంది. అందుకే సినిమా జనాలు ఎన్టీఆర్ కి అగ్రస్థానం ఇచ్చారు. తమ పాన్ ఇండియా కెరీర్ కి ఆర్ ఆర్ ఆర్ పునాదిగా భావించిన ఎన్టీఆర్, చరణ్ లకు ఆ దిశగా ప్రయోజనం చేకూరినట్లే అనుకోవాలి. ఇక వాళ్ళ ఎదుగుదల చిత్రాల ఎంపిక, వాటి విజయాలపై ఆధారపడి ఉంటుంది.