ఎన్టీఆర్ మాటలు వక్రీకరిస్తూ విష ప్రచారం, ఎవరి పని ఇది
దేవర ఇప్పుడు కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. దసరా శెలవులను ఈ సినిమా సద్వినియోగం చేసుకుని రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది.
NTR, SS Rajamouli, Devara
సోషల్ మీడియా వచ్చాక భావ వ్యక్తీకరణ ఎక్కువైందనేది నిజం. అది కొంత ప్లస్ అయితే సెలబ్రెటీల విషయంలో మైనస్ గా మారుతోంది. కావాలని విషం చిమ్మటం, తమకు నచ్చని హీరోలను ఉద్దేశించి టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయటం ఎక్కువైంది. అయితే ఫ్యాన్ వార్స్ అనేవి సహజమే కాబట్టి పట్టించుకోరు. కానీ ప్రతీ చిన్న విషయాన్ని వక్రీకరించి విషం చిమ్మితే ఎలా అనేది కొందరు సినిమా అభిమానులు ప్రశ్న. తాజాగా ఎన్టీఆర్ ఓ ఇంటర్వూలో అన్న చిన్న కామెంట్స్ ని పట్టుకుని కొందరు పనిగట్టుకుని ఆయనపై విషయం చిమ్మే పోగ్రాం పెట్టుకున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ ఏమన్నారు..అసలేం జరిగింది.
NTR, SS Rajamouli, Devara
వాస్తవానికి దేవర రిలీజ్ ముందు.. తర్వాత ఎన్టీఆర్ ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ‘దేవర’ సినిమా చేసాడు ఎన్టీఆర్. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రమోషన్ మెటీరియల్ తో అంచనాలు నెక్ట్స్ లెవిల్ లో ఉన్నాయి. ఇన్నేళ్లుగా ఉన్న రాజమౌళి సెంటిమెంట్ ని ఈ సారి మేము బ్రేక్ చేస్తాం అంటూ ఎన్టీఆర్ ఫాన్స్ స్ట్రాంగ్ గా చెప్పారు.
అయితే అదే సమయంలో ఈ రాజమౌళి ప్లాఫ్ సెంటిమెంట్ అభిమానులను ఓ మూల ఎక్కడో భయానికి గురి చేస్తూనే ఉంది. దానికి తోడు రిలీజ్ రోజు డివైడ్ టాక్ రావటంతో అదే నిజమే అంటూ కొన్ని వర్గాలు మీడియా వాళ్లు ప్రచారం మొదలెట్టేసారు. అయితే ఇప్పుడు కలెక్షన్స్ దుమ్ము రేపుతున్నాయి. దసరా శెలవులను ఈ సినిమా సద్వినియోగం చేసుకుని రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. ఈ నేపధ్యంలో రాజమౌళి సెంటిమెంట్ ఏమైందంటున్నారు విశ్లేషకులు.ఇదే విషయమై ఎన్టీఆర్ సైతం స్పందించారు.
రీసెంట్ గా ఎన్టీఆర్ – కొరటాల శివ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ పై స్పందించాడు. ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మనం కరెక్ట్ గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ సినిమా పోయిందని రాజమౌళి మీదకి తోసేసాం.
అంతే కానీ మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న టాక్ ఇది. అయినా ఈ Myth Breaker అనేది కొంచం బాగానే ఉంది వినడానికి అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మనకి సినిమాలు తీయడం చేతకాక అలా అన్నారు అని ఎన్టీఆర్ అనడంతో టాలీవుడ్ లో కూడా ఈ కామెంట్స్ చర్చగా మారాయి. అయితే ఇప్పుడు ఎన్టీఆర్...ఏ డైరక్టర్స్ ని ఉద్దేసించి అన్నట్లు అనే డిస్కషన్ కు తెర తీసినట్లైంది.
రాజమౌళి తో సినిమా చేసిన డైరక్టర్స్ నెక్ట్స్ సినిమాలు లిస్ట్ పెడుతు..వీళ్లంతా చాతకాని వాళ్లా అంటూ కావాలనే ఎన్టీఆర్ ని కొందరు బద్నామ్ చేయటానికి ప్రయత్నం చేయటం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. సోషల్ మీడియాలో ఇలాంటి విష ప్రచారాలు ఈ మధ్యన మరీ ఎక్కువ అయ్యాయి. దేవర రిలీజ్ కు ముందు నుంచి సినిమా డిజాస్టర్ అని ప్రచారం మొదలెట్టారు. రిలీజ్ తర్వాత కూడా తేడా టాక్ అన్నారు. చివరకు రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయ్యాక సైలెంట్ అయ్యారు.
Junior NTRs Devara
ఇక రాజమౌళి కొడుకు కార్తికేయ అయితే ఎన్టీఆర్ ఈ సెంటిమెంట్‌ని బ్రేక్ చేసేశాడని ట్వీట్ వేశాడు. '23 ఏళ్ల క్రితం ఎవరితోనైతే ఈ సెంటిమెంట్ మొదలైందో మళ్లీ అతడే దీన్ని బ్రేక్ చేశాడు. అతడిని చూస్తూ పెరిగాను. ఇప్పుడు తెలుగు సినిమాలో అతడు చేస్తున్న అద్భుతాల్ని కళ్లారా చూస్తున్నాను. అస్సలు మాటలు రావట్లేదు. అభిమానులకు ఒకటే చెబుతున్నా. 'దేవర' రూపంలో మనందరికీ సెలబ్రేట్ చేసుకునే అతిపెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. ఇక నుంచి సినిమానే మాట్లాడుతుంది. ఆల్ హైల్ ద టైగర్' అని రాసుకొచ్చాడు.
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. స్టేజిపై ఆయన్ను ఘనంగా సన్మానించిన చిరంజీవి... ఆ తర్వాత రాజమౌళి గురించి మాట్లాడారు. RRR లాంటి గొప్ప సినిమాలో రామ్ చరణ్ ను ఓ భాగం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పిన చిరంజీవి అందుకు ప్రతిఫలంగా రాజమౌళి చుట్టూ ఉన్న ఓ మిత్ ను బ్రేక్ చేస్తామంటూ ప్రకటించారు.
ఆ మిత్ మరేదో కాదు రాజమౌళితో సినిమా తీస్తే నెక్ట్స్ సినిమాలో ఆ హీరోకి ఫ్లాప్ తప్పదని. అలా అప్పట్లో ముందు చిరంజీవే ఈ టాపిక్ ను పాయింట్ అవుట్ చేసి మాట్లాడిన తర్వాత... విడుదలైన 'ఆచార్య' డిజాస్టర్ టాక్ తెచ్చుకుని షాక్ ఇచ్చింది. నిజంగానే ఆ మిత్ లేదా సెంటిమెంట్ వెంటాడుతుందేమో అనిపించింది. అయితే ఇప్పుడు ఆ మిత్ టాపిక్ దేవర సమయంలో మరోసారి వైరల్ అయ్యింది.
Junior NTRs Devara
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఆ విషయం సక్సెస్ మీట్ లో ఆయనలో కనపడే ఆనందం, ఉద్వేగం తో తెలిసిపోయింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఈ సోలో మూవీ.. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా ఆశ్చర్యకరంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల కురుపిస్తోంది. ఆ కలెక్షన్స్ ఎన్టీఆర్ కు కొత్తేమీ కాదు. అయితే దేవర నుంచి ఆయన బాగా ఎక్సపెక్ట్ చేసారు. ఆర్.ఆర్.ఆర్ వంటి సక్సెస్ తర్వాత తన సోలో మూవీ కావటంతో ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు. అదే ఇప్పుడు నిజమై ఆనందం కలిగిస్తోంది.