ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాదు, హిందీలో రామ్ నెంబర్ వన్, ఇదిగో ప్రూఫ్
బాలీవుడ్ లో మన తెలుగు హీరోల హవా నడుస్తుంది. అయితే డిజిటల్‌లో మాత్రం రామ్ పోతినేని దూసుకుపోతున్నారు. బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లను వెనక్కి నెట్టి నెంబర్ 1లో నిలిచారు.
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఇండియన్ సినిమాల్లోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది. బాలీవుడ్‌లోనూ మన హవా నడుస్తుంది. `బాహుబలి` తో ప్రారంభమైన ఈ హవా ఇప్పుడు `పుష్ప 2` వరకు కొనసాగుతుంది. బాలీవుడ్ సినిమాల జోరు తగ్గి తెలుగు సినిమాలకు ప్రయారిటీ పెరుగుతుంది. టాలీవుడ్ మూవీస్ హిందీలో భారీ కలెక్షన్లని సాధిస్తూ దుమ్మురేపుతున్నాయి. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేస్తున్నాయి. అక్కడి స్టార్స్ కి పెద్ద ఝలక్ ఇస్తున్నాయి.
థియేట్రికల్‌గానే డిజిటల్ పరంగా, ఓటీటీ పరంగానూ తెలుగు హీరోల హవా నడుస్తుంది. అక్కడి మార్కెట్‌పై మన హీరోలు పోటిపడుతుండటం విశేషం. అయితే థియేట్రికల్‌గా ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్ వంటి స్టార్స్ పోటీ పడుతున్నా, డిజిటల్‌లో మాత్రం యంగ్ హీరోల హవా నడుస్తుంది.
ఇందులో రామ్ ముందు వరుసలో ఉన్నారు. బిగ్ పాన్ ఇండియా స్టార్స్ ని వెనక్కి నెట్టి ఆయన నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. మరి ఆ సంగతులేంటో చూద్దాం.
హిందీలో మన తెలుగు సినిమాలను డబ్ చేసి యూట్యూబ్‌లలో, ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ మన సినిమాకు విశేషంగా ఆదరణ దక్కుతుంది. రవితేజ, రామ్, ఎన్టీఆర్, బన్నీ, సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా యాక్షన్ సినిమాలకు విశేష ఆదరణ దక్కుతుంది.
ఇందులో రామ్ పోతినేని మొదటి స్థానంలో నిలిచారు. ఆయన నటించిన `నేను శైలజ` మూవీ ఇప్పటి వరకు అత్యధిక వ్యూస్ పొందిన తెలుగు డబ్బింగ్ మూవీగా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 630 మిలియన్స్ వ్యూస్‌ని సాధించడం విశేషం.
రెండో స్థానంలో అల్లు అర్జున్ నటించిన `సరైనోడు` ఉంది. ఇది 483 మిలియన్ వ్యూస్‌తో సెకండ్ తెలుగు మూవీగా నిలిచింది. 415 మిలియన్ వ్యూస్‌తో విజయ్ దేవరకొండ నటించిన `డియర్ కామ్రేడ్` మూడో స్థానంలో ఉంది. 353 మిలియన్ వ్యూస్‌తో అఖిల్ `మిస్టర్ మజ్ను` నాల్గో స్థానంలో ఉంది. 309 మిలియన్ వ్యూస్ తో రామ్ నటించిన `ఉన్నది ఒక్కటే జిందగీ` ఐదో స్థానంలో ఉంది.
264 మిలియన్ వ్యూస్‌తో ఎన్టీఆర్ `బృందావనం` ఆరో స్థానంలో, 175 మిలియన్ వ్యూస్‌తో బన్నీ `రేసుగుర్రం` ఏడో స్థానంలో, 174 మిలియన్ వ్యూస్‌తో రామ్ చరణ్ `మగధీర` ఎనిమిదో స్థానంలో, 147 మిలియన్ వ్యూస్‌తో రవితేజ `అమర్ అక్బర్ ఆంటోనీ` తొమ్మిదో స్థానంలో, 146మిలియన్ వ్యూస్‌తో బన్నీ `ఇద్దరమ్మాయిలతో` పదో స్థానంలో నిలిచాయి.
ఈ రకంగా ఇప్పుడు హిందీ మార్కెట్‌లో రామ్ పోతినేని నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఆయన నటించిన `నేను శైలజ` అక్కడ `ది సూపర్ ఖిలాడీ 3`గా డబ్ అయ్యింది. తెలుగులో ఈ మూవీలో రామ్ కి జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించారు. 2016లో విడుదలైన ఈ మూవీ పెద్ద విజయం సాధించింది. రామ్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది.
ఇప్పుడు మరో బిగ్ బ్రేక్ కోసం చూస్తున్నారు రామ్. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు పి దర్శకత్వంలో `సాగర్` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ప్రారంభమైంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. మంచి కూల్ ఫ్యామిలీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.
read more: హీరోయిన్ విషయంలో బాలకృష్ణ, రవితేజ కొట్టుకున్నారా? చిరంజీవి బర్త్ డే పార్టీలో ఏం జరిగింది?
also read: కోరికలు గుర్రాలైతే.. మంచు మనోజ్‌తో గొడవ వేళ మోహన్‌బాబు పోస్ట్ సంచలనం