MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • రేణు దేశాయ్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కారణంగా కెరీర్లో బలైన హీరోయిన్స్ ఎందరో తెలుసా? లిస్ట్ పెద్దదే!

రేణు దేశాయ్ మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ కారణంగా కెరీర్లో బలైన హీరోయిన్స్ ఎందరో తెలుసా? లిస్ట్ పెద్దదే!

మొదటి సినిమా బద్రితో సూపర్ హిట్ కొట్టిన రేణు దేశాయ్ హీరో పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకుని స్టార్ అయ్యే ఛాన్స్ కోల్పోయింది. రేణు దేశాయ్ మాత్రమే కాదు ఆయనతో నటించిన చాలా మంది హీరోయిన్స్ కెరీర్ మటాష్ అయ్యింది..  

2 Min read
Author : Sambi Reddy
Published : Jul 21 2024, 07:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Pawan Kalyan

Pawan Kalyan


 పవన్ తో జతకట్టిన హీరోయిన్ కెరీర్ ఢమాల్ అనే సెంటిమెంట్ బలంగా ఉంది.  దాదాపు పది మందికి పైగా హీరోయిన్స్ కెరీర్ గంగలో కలిసిపోయింది. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ నుండి నికీషా పటేల్ వరకూ ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు...
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ, పవన్ కళ్యాణ్ 'ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి'  మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు. ఈ చిత్రం తర్వాత సుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా చిత్రాలు చేస్తుంది. 

312
Devayani

Devayani

పవన్ కళ్యాణ్-దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అందుకుంది. దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తుంది. 

412

తొలిప్రేమ టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా ఉంది. ఆ చిత్ర హీరోయిన్ కీర్తి రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. పరిశ్రమకు దూరమైన కీర్తి రెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు. 
 

512

తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా పరిస్థితి కూడా సేమ్, మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరీర్ లో ఎదగలేకపోయారు. ప్రీతి కూడా వివాహం చేసుకుంది. 
 

612

ఇక బద్రి సినిమాలో హీరోయిన్స్ గా నటించిన అమీషా పటేల్,రేణూ దేశాయ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని అధిగమించలేక పోయారు. రేణు దేశాయ్ ఆయన్నే పెళ్లి చేసుకొని కెరీర్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. అమీషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. బద్రి అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అట్టర్ ప్లాప్. బాలీవుడ్ లో కూడా ఆమె స్టార్ కాలేకపోయింది.

712

ఇక గుడుంబా శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జతకట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్. ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరీర్ కూడా గాల్లో కలిసిపోయింది.
 

812

బంగారం అంటూ బరిలో దిగిన మీరా చోప్రా పరిస్థితి అగమ్యగోచరమైంది. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బంగారం ప్లాప్ కావడంతో  మీరా కెరీర్ చతికిల పడింది. అప్పుడప్పుడు మీరా చోప్రా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది.

912

ఇక జల్సాలో జతకట్టిన ఇలియానా కెరీర్ అనూహ్యంగా ముగిసింది. బాలీవుడ్ లో ఎదగాలని ముంబై వెళ్లిన ఇలియానా... రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయ్యింది. బాయ్ ఫ్రెండ్ తో సహజీవనం చేసిన ఇలియానా అబ్బాయికి జన్మనిచ్చింది. 
 

1012
Nikesha Patel

Nikesha Patel

పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నికీషా పటేల్. పవన్ తో ఛాన్స్ కొట్టేశానని ఎగిరి గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది. ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆపై నికీషా పటేల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. మెల్లగా ఫేడ్ అవుటై ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోయింది.

1112
Sarah Jane Dias

Sarah Jane Dias

పంజా సినిమాలో పవన్ కి జంటగా కనిపించిన సారా జేన్ దియాస్, అంజలి లావణ్యల గురించి ఆ దేవుడికే తెలియాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్ కెరీర్లో సక్సెస్ కాలేకపోయారు. 

1212

అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు. కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయ్యింది. అను ఇమ్మానియేల్ మాత్రం బలైంది. ఆమెకు కనీస అవకాశాలు లేవు. దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది. ఇలా పదికి పైగా హీరోయిన్స్ పవన్ తో నటించి పరిశ్రమ నుండి వెళ్లిపోయారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved