ఆర్ ఆర్ ఆర్ మూవీలో మరో హీరో నటించాడని మీకు తెలుసా? ఆ హీరో సీన్స్ రాజమౌళి ఎందుకు లేపేశాడంటే?
ఆర్ ఆర్ ఆర్ మూవీలో మరో హీరో నటించాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ హీరోకి అన్యాయం చేసిన రాజమౌళి సీన్స్ లేపేశాడట.
ఆర్ ఆర్ ఆర్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ రాజమౌళి తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జపాన్ లో ఈ చిత్రం రికార్డు స్థాయిలో ఆదరణ రాబట్టింది. అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా అరుదైన ఘనత అందుకుంది.
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ ఆర్ ఆర్ సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకున్న ఆర్ ఆర్ ఆర్ ఏకంగా ఆస్కార్ కొల్లగొట్టింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ సినిమా వేదికపై చాటింది.
ఆర్ ఆర్ ఆర్ తో ఎన్టీఆర్, చరణ్ లకు గ్లోబల్ ఫేమ్ దక్కింది. ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకుని పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. దర్శకుడు రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ ఎనలేని కీర్తి గడించారు. కాగా ఆర్ ఆర్ ఆర్ మూవీలో మరో హీరో కూడా నటించాడన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ హీరో ఎవరో కాదు సత్యదేవ్. ఈ తెలుగు నటుడు ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఓ కీలక రోల్ చేశాడట. అయితే సత్యదేవ్ పాత్రను రాజమౌళి ఎడిటింగ్ లో మొత్తంగా లేపేశాడట. సత్యదేవ్ నటించిన లేటెస్ట్ మూవీ జీబ్రా. ఈ మూవీ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. జీబ్రా మూవీ నవంబర్ 22న విడుదల కానుంది.
ఈ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సత్యదేవ్ ఈ విషయం వెల్లడించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీలో నేను నటించాను. 16 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాను. కానీ నా సన్నివేశాలు కథలో ఫిట్ కావని తీసేశారు. సినిమా యూనిట్ పై ఉన్న గౌరవంతో నేను ఈ విషయం బయటకు చెప్పలేదని సత్యదేవ్ అన్నారు. టాలెంట్ ఉన్న నటుడు సత్యదేవ్ మంచి అవకాశం కోల్పోయాడని ఆయన ఫ్యాన్స్ బాధపడుతున్నారు.
గ్లోబల్ రీచ్ సాధించిన ఆర్ ఆర్ ఆర్ మూవీలో సత్యదేవ్ పాత్ర ఉంచి ఉంటే ఆయన కెరీర్ కి ప్లస్ అయ్యేదని వాపోతున్నారు. సత్యదేవ్ కి రావాల్సినంత గుర్తింపు రాలేదనే చెప్పాలి. సోలో హీరోగా ఆయనకు విజయాలు దక్కడం లేదు. దాంతో ప్రేక్షకుల్లోకి ఆయన వెళ్లలేకపోతున్నాడు. మరి జీబ్రా మూవీతో ఫేట్ మారుతుందేమో చూడాలి. జీబ్రా చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ మరో ప్రధాన రోల్ చేశాడు. ప్రియా భవాని శంకర్, అమృత అయ్యంగార్ హీరోయిన్స్ గా నటించారు.