MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమంత చేతిలో ఒక్క సినిమా లేదు, అయినా ఇండియాలో తనే నెంబర్‌ వన్‌.. వెనకబడ్డ రష్మిక, కాజల్‌, నయనతార

సమంత చేతిలో ఒక్క సినిమా లేదు, అయినా ఇండియాలో తనే నెంబర్‌ వన్‌.. వెనకబడ్డ రష్మిక, కాజల్‌, నయనతార

సమంత గతేడాది `ఖుషి` చిత్రంతో మెరిసింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. ఏడాదిగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత ఇప్పుడు ఇండియాలోనే టాప్‌గా నిలవడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Apr 21 2024, 09:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత.. గతేడాది సెప్టెంబర్‌లో `ఖుషి` సినిమాతో మెరిసింది. హిట్ అందుకుంది. ఆ వెంటనే ఆమె సినిమాలకు బ్రేక్‌ ప్రకటించింది. అప్పట్నుంచి సమంత సినిమాలకు దూరంగా ఉంది. వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకుంటుంది. అన్నీ టెన్షన్స్, బాధలను వదిలేసి రిలాక్స్ గా గడుపుతుంది. అడపాదడపా సోషల్‌ మీడియాలో తప్ప ఆమె బయట కనిపించింది చాలా అరుదు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

అప్పుడప్పుడు ప్రైవేట్‌ ఈవెంట్లలో మెరుస్తుంది సమంత. కానీ ఇతర హీరోయిన్లు రెండు మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. పాన్‌ ఇండియా చిత్రాలతో సంచలన విజయాలను నమోదు చేసుకున్నారు. కానీ క్రేజ్‌ విషయంలో సమంతతో పోల్చితే వెనకబడిపోయారు. తాజాగా ప్రముఖ సెలబ్రిటీ పోలింగ్‌ సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో సమంత మొదటి స్థానంలో నిలిచింది. మార్చి నెలలో ఇండియా వైడ్‌గా పాపులర్‌, క్రేజ్‌ని, అత్యంత అభిమానాన్ని పొందిన హీరోయిన్లలో సమంత నెంబర్‌ 1గా నిలవడం విశేషం. 

39

టాప్‌ 10 మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్స్ లో సమంత మొదటి స్థానాన్ని దక్కించుకోగా, రెండో స్థానంలో అలియా భట్‌ నిలిచింది. ఆమె రెండేళ్ల క్రితమే కూతురుకి జన్మనిచ్చింది. ఇటీవల తరచూ భర్త్ రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె ముంబయిలో సందడి చేసింది. పైగా ఆమె సినిమా ప్రమోషన్లలోనూ పాల్గొంటూ ఆకట్టుకుంది. ఇలా రెండో స్థానాన్ని దక్కించుకుంది. 

49

ఇక మూడో స్థానంలో దీపికా  పదుకొనె నిలవడం విశేషం. ఆమె గతేడాది బ్యాక్‌ టూ బ్యాక్‌ `పటాన్‌`, `జవాన్‌` చిత్రాలతో సంచలన విజయాలు అందుకుంది. ఇప్పుడు `కల్కి2898ఏడీ`లో నటిస్తుంది. ఈ మూవీ తరచూ చర్చనీయాంశం అవుతుంది. అయినా ఆమె మూడో స్థానానికే పరిమితం కావడం గమనార్హం. 
 

59

ఇక నాల్గో స్థానంలో కాజల్‌ నిలిచింది. కాజల్‌ గతేడాది `భగవంత్‌ కేసరి`లో మెరిసింది. పెళ్లై, కొడుక్కి జన్మనిచ్చిన తర్వాత ఆమె సెకండ్‌ ఇన్నింగ్స్ లో నటించిన తొలి చిత్రమది. ఆ తర్వాత ఆమెకి సంబంధించిన సందడే లేదు. కానీ నాల్గో స్థానంలో నిలవడం విశేషం. అయితే తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం వల్లే ఆమెకి అభిమానులు అంతగా ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. 
 

69

ఇక మన టాలీవుడ్‌ భామ రష్మిక మందన్నా గతేడాది `యానిమల్‌`తో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు `పుష్ప2`తో రాబోతుంది. దీనిపై దేశ వ్యాప్తంగా డిస్కషన్‌ జరుగుతుంది.సినిమా కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. అయిన రష్మిక ఈ లేటెస్ట్ సర్వేలో ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ప్రస్తుతం ఆమె `ది గర్ల్ ఫ్రెండ్‌`, `రెయిన్‌బో`, `కుబేర` చిత్రాల్లో నటిస్తుంది. 

79

మరోవైపు లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా తక్కువకే పడిపోయింది. ఆమె ఎనిమిదో స్థానానికే పరిమితమయ్యింది. ఆమెకి సంబంధించిన వివాదాలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. సోషల్‌ మీడియాలోనూ ఆమెకి విపరీతమైన క్రేజ్‌ ఉంది.సినిమాలతోనూ సందడి చేస్తుంది. అయినా ఆమెకి ఏడో స్థానం రావడం గమనార్హం. 
 

89
Trisha

Trisha

ఇక త్రిష ఎనిమిదో స్థానానికి పరిమితమయ్యింది. ఆమె ఓ వైపు సినిమాలతో, మరోవైపు కొన్ని వివాదాలతోనూ చర్చనీయాంశంగా మారింది. కానీ ఇండియన్‌ టాప్‌ 10 జాబితాలో ఎనిమిదో స్థానం దక్కించుకోవడం విశేషం. త్రిష ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో `విశ్వంభర` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రెండు, మలయాళంలో రెండు మూవీస్‌ చేస్తుంది. 

99

ఇక బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌ ఐదో స్థానంలో నిలవగా, కీర్తి సురేష్‌ తొమ్మిదో స్థానంలో, కృతి సనన్‌ పదో స్థానానికి పరిమితమయ్యింది. కీర్తిసురేష్‌కి తెలుగులో సినిమాలు లేవు. ఆమె తమిళంలో మూడు సినిమాలు, హిందీలో ఓ మూవీ చేస్తుంది. కత్రినా, కృతి సనన్‌ హిందీలో బిజీగా ఉన్నారు. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
త్రిష

Latest Videos
Recommended Stories
Recommended image1
Akhil Akkineni: అఖిల్ ని ఆయన భార్య జైనబ్ ఏమని పిలుస్తుందో తెలుసా ? భలే విచిత్రంగా ఉందే..
Recommended image2
అయోధ్యలో భూమి కోసం మిడ్ నైట్ అమితాబ్ ఫోన్, ధర చెప్పిన వెంటనే రూ.15 కోట్లు బదిలీ..ఏం ప్లాన్ వేశావయ్యా
Recommended image3
Naga Vamsi: ఆడపిల్ల శాడిజం చూపించడం వల్లే బ్లాక్ బస్టర్ అయింది.. ప్రపంచాన్ని ఊపేసిన మూవీపై నాగవంశీ రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved