- Home
- Entertainment
- మా సినిమాలకు హీరోయిన్లు కావలెను.. స్టార్ హీరోలకు కాంబినేషన్లు సెట్ చేసే పనిలో మేకర్స్...
మా సినిమాలకు హీరోయిన్లు కావలెను.. స్టార్ హీరోలకు కాంబినేషన్లు సెట్ చేసే పనిలో మేకర్స్...
కోవిడ్ తో సినిమాలకు గ్యాప్ వచ్చేసింది..ఇక టైమ్ వేస్ట్ చెయ్యకూడదని హీరోలు వరసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నారు. కాని ఇప్పుడు స్టార్ హీరోలకు పెద్ద సమస్య వచ్చి పడింది. సినిమా ఒకే అయినా హీరోయిన్లకోసం మాత్రం వెయిట్ చెయ్యకతప్పడం లేదు. ప్రస్తుతం స్టార్ హీరోలకు హీరోయిన్ల కరువు వచ్చిపడింది. ఇలా హీరోయిన్ల కోసం వెయిట్ చేస్తున్న హీరోలెవరో చూద్దాం.

ఉన్నది తక్కువ మంది హీరోయిన్లే కాబట్టి కాంబినేషన్స్ రిపీట్ కాకుండా హీరోయిన్లను సెట్ చెయ్యడం పెద్ద సమస్య అయిపోయింది మేకర్స్ కి. వరసగా సినిమాలు అనౌన్స్ చేస్తున్నారుహీరోలు . కొత్త సినిమాతో పాటు స్టార్ కాస్ట్ ని, స్పెషల్లీ హీరోయిన్ ని కూడా అనౌన్స్ చేస్తుంటే ..కొంతమంది మాత్రం ..ఇంకా హీరోయిన్ ని ఫిక్స్ చెయ్యకుండా వెతుక్కుంటున్నారు.
ప్రభాస్(Prabhas) వరసగా 5 సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆల్రెడీ 4 సినిమాల షూటింగ్ తో ఫుల్ బిజీగా కూడా ఉన్నారు. తన కెరీర్ లో 25 వ సినిమాగా చేస్తున్న సందీప్ వంగా స్పిరిట్ మూవీలో హీరోయిన్ ని మాత్రం ఇంకా అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నాడు ప్రభాస్(Prabhas). సందీప్ సినిమాతో నెక్ట్స్ ఏ హీరోయిన్ తో యంగ్ రెబట్ స్టార్ జత కడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) కి కూడా హీరోయిన్ సమస్య తప్పట్లేదు. ట్రిపుల్ఆర్ (RRR) తర్వాత అనౌన్స్ చేసిన రెండు సినిమాలకు హీరోయిన్లను ప్రకటించేదు మేకర్స్. ట్రిపుల్ ఆర్(RRR) అయిపోగానే ఎన్టీఆర్(NTR) కొరటాలతో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా , పూజా హెగ్డే, జాన్వీ కపూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. లాస్ట్ కి ఆలియా ఫిక్స్ అయినట్టు వార్తలొస్తున్నాయి. వార్తలు వస్తున్నాయి కాని టీమ్ అయితే మాత్రం అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు . అంతే కాదు అటు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ అనౌన్స్ చేసిన పాన్ ఇండియా సినిమాలో కడా హీరోయిన్ సెలక్ట్ అవ్వాల్సి ఉంది.
రామ్ చరణ్(Ram Charan) ఇప్పుడు ట్రిపుల్ ఆర్(RRR), ఆచార్య(Acharya) సినిమాల రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు శంకర్ సినిమా షూట్ ని కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా దొరికేసింది.. షూటింగ్ కూడా జరుగుతుంది. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో రామ్ చరణ్ అనౌన్స్ చేసిన సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలా ని ఆలోచనలో పడ్డారు టీమ్. కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ హీరో కూడా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. లైగర్ సినిమ కోసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పనిచేస్తుంది. కాని నెక్ట్స్ చేయబోయే సుకుమార్(Sukumar) తో అనౌన్స్ చేసిన సినిమాతో పాటు లేటెస్ట్ గా పూరీ తో పాటు శివనిర్వాణ సినిమాకు హీరోయిన్ గా ఎవరిని సెట్ చేయాలా అని తలపట్టుకున్నారట మేకర్స్. మరో వైపు పూరీ జగన్నాథ్ సినిమా జనగణమన లో కూడా హీరోయిన్ ఫిక్స్ చెయ్యాల్సి ఉంది.
కుర్ర హీరోలకైనా హీరోయిన్లను ఎలాగైనా సెట్ చేయొచ్చు కాని సీనియర్ హీరోలకైతే హీరోయిన్లు దొరకడం ఇంకా కష్టమైపోతోంది. చిరంజీవి(Chiranjeevi) మంచి దూకుడు మీద ఉన్నాడు ఇప్పటికే ఆయన కమిట్ అయిన 5 సినిమాల్లో ..బాబీ, వెంకీ కుడుముల సినిమాలకు హీరోయిన్లు దొరకలేదు. ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలకు ఎలాగు ఉన్నవాళ్లను సెట్ చేశారు. ఆ రెండు సినిమాలకు ఎవరిని హీరోయిన్ గా సెట్ చేయాలా అని డైరెక్టర్లు తెగ ఆలోచిస్తున్నారట.
అటు బాలయ్య బాబు(Balakrishna) అఖండాతో సూపర్ హిట్ కొట్టి మంచి జోష్ లో ఉన్నాడు. మలినేని గోపీచంద్ తో మూవీ చేస్తున్నాడు. ఈసినిమాలో శృతి హాసన్ మీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ఇప్పటి వరకూ బాగానే ఉంది. కాని నెక్ట్స్ అనిల్ రావిపూడితో, పూరీ జగన్నాథ్ తో ఉన్న సినిమాల కోసం ఎవరిని తీసుకోవాలి అనేది ప్రశ్నగా మారింది. ఇప్పటి నుంచే హీరోయిన్ ను సెట్ చేసే పనిలో ఉన్నారట మేకర్స్.
మరో వైపు పవర్ స్టారh కు కూడా హీరోయిన్ సెగ తగిలింది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇప్పటి వరకూ చేస్తున్న సినిమాలన్నింటికి ఎలాగొ హీరోయిన్లను సెట్ చేసుకున్నారు. కాని సురేందర్ రెడ్డి కాంబినేషన్లో పవర్ స్టార్ కమిట్ అయిన సినిమాకు హీరోయిన్ గా ఎవర్ని తీసుకోవాలా అని మేకర్స్ ఆలోచనలో పనడ్డారట. ఇలా స్టార్ హీరోలు వరుసగా సినిమాలు అయితే అనౌన్స్ చేస్తున్నారు కాని హీరోయిన్లను సెట్ చేయడమే పెద్ద పని గామారినట్టు తెలుస్తోంది. ఎంత పెద్దస్టార్ హీరో అయినా హీరోయిన్ల కోసం మాత్రం వెయిట్ చెయ్యక తప్పడం లేదు .