బెనిఫిట్ షోలకు బ్రేక్? : 'గేమ్ ఛేంజర్'కు షాక్ ?
తెలంగాణలో బెనిఫిట్ షోల రద్దుతో సినీ పరిశ్రమలో కలకలం రేగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడంతో, సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలైన గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ లాంటి చిత్రాలపై ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం సినీ పరిశ్రమను ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.
ram Charan, Game Changer ,#director shankar, #game changer, #Ram Charan
మన తెలుగులో ఓ పెద్ద సినిమా రిలీజ్ అవుతోంది అంటే బెనిఫిట్ షోలు ఎన్నింటికి మొదలు అనే వార్తలు మీడియాలో మొదలు అవుతున్నాయి. అంతలా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు ప్రభావం చూపెడుతున్నాయి. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే స్టార్ హీరోలతో చిత్రాలు తీయడం, సినిమా టాక్ ఎలా ఉన్నా ఆ చిత్రంపై ఉన్న క్రేజ్‌ను, అభిమానుల బలహీనతలను క్యాష్ చేసుకోవటం. టిక్కెట్లను ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఓకే చేయించుకోవటం జరుగుతోంది.
ఈ పరిణామాలు సామాన్య ప్రేక్షకుడు గమనిస్తూనే ఉన్నాడు. అతనికి బాధతో పాటు ఇదో మాఫియాలాగా తయారైందని భయం వేస్తోంది. అయితే స్వయంగా ప్రభుత్వాలు బెనిపిట్ షోలకు, టిక్కెట్ రేట్ల పెంపుకు సై అన్నాయి కాబట్టి ఎవరూ పల్లెత్తి మాట మాట్లాడటం లేదు. అయితే ఇప్పుడు బెనిఫిట్ షోలు రద్దు అనేది ఓ వర్గానికి ఆనందపరిచే అంశంగా మారింది. కానీ సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి చూస్తే మాత్రం బాధాకరమే అంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో తెలుగు సినిమా ఇండస్ట్రీ భేటీ లో చాలా అంశాలు ప్రస్తావన కు వచ్చాయి. అయితే తెలుగు నిర్మాతలను బాధించిన అంశం మాత్రం బెనిఫిట్ షోలు రద్దు అనేదే. హైదరాబాద్ సిటీలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో.. 2024, డిసెంబర్ 26వ తేదీన జరిగిన సమావేశంలో.. సీఎం రేవంత్ రెడ్డి కొన్ని సంచలన విషయాలపై మరోసారి స్పష్టత ఇచ్చారు.
ఇక నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని.. మీరు కూడా దానికి ఫిక్స్ అయిపోవాలని.. ఇక నుంచి ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని ఖరాఖండిగా తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
పెద్ద సినిమాలకు కీలకంగా నిలిచే బెనిఫిట్ షోలపై.. సినీ ఇండస్ట్రీ నుంచి హాజరైన పెద్దలందరికీ ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ (Assembly)లో చెప్పిన దానికే తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోవడం వల్లే ప్రభుత్వం విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని అన్నారు.
ఇక నుంచి రాష్ట్రంలో బెనిఫిట్, ప్రీమియర్ షోలు ఉండవని తేల్చేశారు. అదేవిధంగా స్పెషల్‌గా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు ఉండదని స్పష్టం చేశారు. అదేవిధంగా పార్టిసిపేట్, ప్రమోట్, ఇన్వెస్ట్ విధానాన్ని ప్రతిపాదించారు. తెలంగాణ రైజింగ్ (Telangana Rising)లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Film Industry) సోషల్ రెస్పాన్స్‌బిలిటీతో ఉండలన్నారు.
అయితే ఈ బెనిఫిట్ షో రద్దు ఎఫెక్ట్ ఎవరిమీద పడబోతోంది అంటే మొదటగా దిల్ రాజు సినిమా మీద. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తమిళ ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో దిల్ రాజు రూపొందించిన ఆ సినిమా జనవరి 10వ తేదీన విడుదల కానుంది.
ఇప్పటికే ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తూ ఆడియన్స్ లో మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్.పుష్ప-2 సినిమాకు అందినట్లే తెలంగాణలో అన్ని అనుమతులు గేమ్ ఛేంజర్ కు దక్కుతాయని అంతా లెక్కలు వేశారు. స్పెషల్,బెనిఫిట్ షోస్ పడతాయని కూడా ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. కానీ ఇప్పుడు ముఖ్య మంత్రి ప్రకటనతో ఏం జరగనుందోనని అర్దం కావటం లేదు. భారీగానే కలెక్షన్స్ లెక్కలు బెనిఫిట్ షోలు లేకపోవటం వల్ల తేడా వస్తాయంటున్నారు.
అలాగే సంక్రాంతికి రాబోతున్న మరో పెద్ద సినిమా బాలయ్య డాకూ మహారాజ్ కు సైతం ఈ బెనిఫిట్ షోల రద్దు ఇంపాక్ట్ పడనుంది. మొదటిగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది ఈ సినిమాలకే. గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ సినిమాలు రెండింటిపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇద్దరి హీరోలకు ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగా ఉంది. ఖచ్చితంగా మంచి రేటుకు బెనిఫిట్ షోలు టిక్కెట్లు అమ్ముడయ్యేవి అనేది నిజం.
ఇక ఒకప్పుడు ఎంత పెద్ద హీరో చిత్రం విడుదలైనా కూడా మొదటి రోజు మొదటి షో నుంచే మహిళా ప్రేక్షకులతో పాటు అందరూ థియేటర్లకు వచ్చేవారు. వారి ద్వారా సినిమా బాగుంటే మౌత్‌టాక్ వచ్చి అది సినిమా లాంగ్‌రన్‌కి ఉపయోగపడేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకులు ఓ పెద్దస్టార్ చిత్రం విడుదలైన వారం తర్వాత గానీ, టాక్ బాగుంటే కానీ తమ ఫ్యామిలీలతో వచ్చి చూసే పరిస్థితులు లేవు. పోలీసులు, కలెక్టర్లు.. ఇతర అధికారులు కూడా మాట్లాడటం లేదు కారణం ప్రభుత్వాలే ఫర్మిషన్స్ ఇవ్వటమే అనేది ఓ వర్గం వాదన.