MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nivetha Thomas: రష్మిక, శ్రీలీల, ఇప్పుడు నివేదా థామస్‌.. ఏఐ ఫేక్‌ ఫోటోలకు బలి.. నటి స్ట్రాంగ్‌ వార్నింగ్

Nivetha Thomas: రష్మిక, శ్రీలీల, ఇప్పుడు నివేదా థామస్‌.. ఏఐ ఫేక్‌ ఫోటోలకు బలి.. నటి స్ట్రాంగ్‌ వార్నింగ్

ఏఐ టెక్నాలజీని ఉపయోగించి నివేదా థామస్‌ ఫోటోలను, వీడియోలను మిస్‌ యూజ్‌ చేసిన నేపథ్యంలో తాజాగా నటి స్పందించింది. స్ట్రాంగ్ వార్నింగ్‌ ఇచ్చింది. ఇకపై కటకటాలకే అని చెప్పింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 18 2025, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫేక్‌ వీడియోలపై స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన రష్మిక
Image Credit : Instagram/@rashmika_mandanna

ఫేక్‌ వీడియోలపై స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చిన రష్మిక

ఏఐ ఇప్పుడు అనేక రకాలుగా ఉపయోగపడటంతోపాటు అనేక అనర్థాలకు కారణమవుతుంది. ముఖ్యంగా ఇది సెలబ్రిటీలకు చాలా ఇబ్బందిగా మారింది. ఏఐ ఉపయోగించి ఫేక్‌ ఫోటోలు, వీడియోలను క్రియేట్‌ చేస్తున్నారు.  ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇది బాగా మిస్‌ యూజ్‌ అవుతుంది. చాలా అసభ్యకరంగా వారి ఫోటోలు, వీడియోలను మారుస్తున్నారు. అందుకే చాలా మంది స్టార్స్ తమ పేరు, ఫోటోలను మిస్‌ యూజ్‌ చేస్తే కఠిన చర్యలుంటాయని కోర్ట్ ద్వారా హెచ్చరిస్తున్నారు. అయితే గతంలో రష్మిక మందన్నా ఫేక్‌ వీడియో పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి యాక్షన్ తీసుకుంది. అలాగే చాలా మంది హీరోయిన్లు ఇలాంటి ఫేక్ ఫోటోల బారిన పడ్డారు. 

25
ఇటీవల శ్రీలీల సైతం ఏఐ బారిన పడింది
Image Credit : Sreeleela Instagram

ఇటీవల శ్రీలీల సైతం ఏఐ బారిన పడింది

ఇటీవల శ్రీలీలకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. దీంతో ఆమె గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చింది. ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిన ఫేక్‌ ఫోటోలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. `నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను. ఏఐ జనరేటెడ్‌ ఫేక్‌ కంటెంట్ని సపోర్ట్ చేయవద్దు. టెక్నాలజీని ఉపయోగించడం, దుర్వినియోగం చేయడానికి మధ్య చాలా తేడా ఉంది. టెక్నాలజీని అభివృద్ధి వైపు ఉపయోగించి జీవితాన్ని సరళీకరించాలి, దాన్ని భయంకరంగా మార్చవద్దు` అని శ్రీలీల వెల్లడించింది.

Related Articles

Related image1
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Related image2
హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
35
ఇప్పుడు ఏఐ ఫేక్‌ కంటెంట్‌ బారిన పడ్డ నివేదా థామస్‌
Image Credit : instagram/@i_nivethathomas

ఇప్పుడు ఏఐ ఫేక్‌ కంటెంట్‌ బారిన పడ్డ నివేదా థామస్‌

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి అనుభవమే మరో నటి నివేదా థామస్‌ కి ఎదురయ్యింది. తన ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. ఏఐతో తన ఫోటోలను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, తన అనుమతి లేకుండా ఇలాంటి కంటెంట్‌ సృష్టించడం తనని తీవ్రంగా కలిచివేసిందని వెల్లడించింది. ఇది తన వ్యక్తిగత గోప్యతపై జరిగిన దాడి అని నివేదా థామస్‌ ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే తన ఫోటోలను, వీడియోలను సోషల్‌ మీడియా ఖాతాల నుంచి తీసివేయాలని ఆదేశించింది. ఎవరైనా ఇలాంటి కంటెంట్‌ని గుర్తిస్తే, వాటిని ఎవరికీ షేర్‌ చేయవద్దని కోరింది.

45
చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరిక
Image Credit : instagram/@i_nivethathomas

చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరిక

అనవసరమైన వాటిని షేర్‌ చేసి ఇబ్బందుల్లో పడొద్దని వార్నింగ్‌ ఇచ్చింది. ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగానికి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని నివేదా అదిరిపోయేలా వార్నింగ్‌ ఇచ్చింది. పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఇక కటకటాలకే అని స్వీట్‌గా చెప్పింది నివేదా. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

55
ఒక్క ఫోటోతో ఇంటర్నెట్‌ షేక్‌
Image Credit : instagram/@i_nivethathomas

ఒక్క ఫోటోతో ఇంటర్నెట్‌ షేక్‌

నివేదా థామస్‌ `జెంటిల్‌మేన్‌`, `నిన్నుకోరి` వంటి చిత్రాలతో పాపులర్‌ అయ్యింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత `వకీల్‌ సాబ్‌`లోనూ మెరిసింది. ఇటీవల `35 చిన్న కథ కాదు` చిత్రంలో నటించి ప్రశంసలందుకుంది. ఇప్పుడు చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తున్న నివేదా థామస్‌. ఇటీవల  శారీలో దిగిన ఫోటోని పంచుకోగా, అది సోషల్‌ మీడియాని షేక్‌ చేసింది. నివేదా అందానికి అభిమానులు ఫిదా అవుతున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Triptii Dimri Movies: యానిమల్ బ్యూటీ చేతిలో 5 సినిమాలు.. రెండు నేరుగా ఓటీటీలోనే!
Recommended image2
Revathi Life Story: భర్తే గొడ్రాలని అన్నాడు.. విడాకుల తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన వెంకీ హీరోయిన్ కన్నీటి కథ
Recommended image3
'ఓం శాంతి శాంతి శాంతిః' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే ?
Related Stories
Recommended image1
Rajasekhar: డాడీ అని పిలిచిన అమ్మాయితోనే రొమాన్స్ చేసిన రాజశేఖర్‌.. కట్‌ చేస్తే ఇండస్ట్రీ దున్నేసింది
Recommended image2
హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved