- Home
- Entertainment
- బ్లాక్ అండ్ వైట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న నివేదా పేతురాజ్.. స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
బ్లాక్ అండ్ వైట్ అందాలతో మైండ్ బ్లాక్ చేస్తున్న నివేదా పేతురాజ్.. స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా..
తమిళ బ్యూటీ నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) తెలుగు, తమిళ సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. మరోవైపు లేటెస్ట్ ఫొటోషూట్లతోనూ సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకుంటోంది.

యంగ్ బ్యూటీ నివేదా పేతురాజ్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళంలో తన కేరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ ‘మెంటల్ మదిలో’ చిత్రంలో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి తమిళంతోపాటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ వస్తోంది.
ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో నివేదా పేతురాజ్ ఢిపరెంట్ అని చెప్పాలి. కేరీర్ పట్లగానీ, తన వ్యక్తిగతంగానైనా చాలా జాగ్రత్తగా అడుగులేస్తోంది. ముఖ్యంగా తను నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెడుతోందీ బ్యూటీ. తనకు ప్రాధ్యామున్న పాత్రల్లోనే నటించేందుకు ఒకే చెబుతోంది.
ముఖ్యంగా నివేదా తను నటించిన ఒక చిత్రానికి.. మరో చిత్రానికి సంబంధం లేకుండా కథలనూ ఎంచుకుంటోంది. విభిన్న పాత్రలను పోషిస్తూ తనకుంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంటోంది. గతంలో తమిళంలో ఎక్కువగా బిజీ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగు చిత్రాల్లోనే నటిస్తోంది.
మరోవైపు సోషల్ మీడియాలోనూ నివేదా తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. ఎప్పుడూ తన అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. వారిని ఖుషీ చేసేందుకు లేటెస్ట్ ఫొటోషూట్లతో మెస్మరైజ్ చేస్తోంది. గ్లామర్ పరంగానూ నివేదా అందరినీ ఆకట్టుకుంటోంది.
గతంలో గ్లామర్ షోలకు కొంతదూరంగా ఉండే ఈ హీరోయిన్ కొద్దిరోజులుగా ట్రెండీ అవుట్ ఫిట్ లు ధరిస్తూ మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. ఈ పిక్స్ లో స్టూల్ పై బ్లాక్ బాడీకాన్ డ్రెస్ ధరించిన నివేదా అందాల విందు చేసింది. స్టన్నింగ్ స్టిల్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
చివరిగా ‘పాగల్’ చిత్రంలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించిందీ బ్యూటీ. అంతకుముందు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన ‘రెడ్’ మూవీలో నటించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’లో నటించి మరింతగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ‘విరాట పర్వం’లో నటిస్తోంది.