MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ అభిమాని చేసిన పనికి షాక్ అయ్యాను... నాలో మార్పుకు కారణం అదే : నివేదా పేతురాజ్

ఆ అభిమాని చేసిన పనికి షాక్ అయ్యాను... నాలో మార్పుకు కారణం అదే : నివేదా పేతురాజ్

హీరోయిన్ అంటే గ్లామర్ క్యారెక్టర్లు మాత్రమే గుర్తుకు వచ్చే ఈరోజుల్లో.. డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సాధించిన హీరోయిన్ నివేదా పేతురాజ్. వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తన కెరీర్ గురించి చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం,

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 17 2022, 08:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తమిళనాడులో పుట్టి.. దుబాయ్ లో పెరిగిన అచ్చతెలుగమ్మాయి నివేదా పేతురాజ్.  ఆమె తాత తెలుగువారు, తండ్రి కూడా తెలుగు బాగా మాట్లాడతారట, ఏదైనా కొత్తగా చేయాలి అనుకునే నివేదా.. దుబాయ్ లో ఉన్నప్పుడు మోడల్ గా లైఫ్ స్టార్ట్ చేసి.. హీరోయిన్ గా ఛాన్స్ లు కొట్టేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

టాలీవుడ్ లో మెంటల్ మదిలో సినిమాతో స్టార్ట్ అయిన ఆమె జర్నీ..చిత్రలహరి, రెడ్, పాగల్, లాంటి సినిమాలతో దూసుకుపోతోంది, ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళ్ లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటీ. 

37

హీరోయిన్ అవ్వడం కాదు.. నటి అవ్వడం గర్వంగా ఉంది అన్నారు నివేదా. ఇలాంటి సినిమాలు చేయకపోతే లైఫ్ ఉండదేమో అని భయపడుతుంటారు.. తనకు అలాంటి భయం లేదు అంటోంది. హీరోయిన్ గా మాత్రమే చేయాలి.. ఫలానా స్టార్లతోనే చేయాలి అని బోర్డర్ పెట్టుకోలేదంటోంది నివేదా. అంతే కాదు అవకాశాలు లేకపోతే ఏదైనా ఉద్యోగం చేసుకునే సత్తా తనకు ఉందంటోంది స్టార్ బ్యూటీ. 

47

నటీనటులకు ఉన్న ఒక అదృష్టం అభిమానులు అంటోంది నివేదా. పాండిచ్చేరిలో ఓ షూటింగ్ లో ఉన్నప్పుడుఓ అభిమాని వచ్చి తన చేయి చూపించాడట.. తన పేరును పచ్చ బొట్టు వేయించుకున్న అభిమానాన్ని చూసి షాక్ అయ్యాను అంటోంది నివేదా పేతురాజ్. ఇంత అభిమానాన్ని నటులు మాత్రమే చూడగలుగుతారు అంటోంది. 

57

నటనలో తను ఆరాధించేది విజయ్ సేతుపతి, ఎందుకంటే.. ఆయన ఏజ్ తో సంబంధం లేకుండా ఏ పాత్రకైన రెడీ అయిపోతారు. హీరోగా చేస్తూనే.. విలన్ గా, హీరోయిన్ ఫాదర్ గా కూడా చేశారు..అలా ఇమేజ్ కు పొంతన లేకుండా విజయ్ సేతుపుతిలా ఉండాలి అనిపిస్తుందతి అని అంటోంది నివేదా పేతురాజ్. 

67

ఎంత పని వత్తిడి ఉన్నా.. ఒక్క కాఫీతో స్విచ్చ్ ఆన్ అయిపోతుంటాను అంటోంది నివేదా.. అదే కాఫీతో రికాల్స్ మూడ్ లోకి వెళ్లిపోతానంటోంది, అంతే కాదు జీవితంలో ఒత్తిడి జయించాలంటే.. మెడిటేషన్ ఒక్కటే మార్గం అంటోందతి నివేదా. 

77

ప్రయాణాలంటే నివేదాకు చాలా ఇష్టం. విమానా ప్రయాణాలను ఆస్వాదిస్తుంది, అంతే కాదు బోర్డింగ్ పాస్ లు కూడా దాచుకుంటుందట, వాటిని ఫ్రమ్ చేయించాలని చూస్తోందట. ఇక ఇంత కూల్ గా కనిపించే ఈ బ్యూటీ.. బుద్దిజంకు ఆకర్షితురాలైయ్యిందట. దానితో పాటు మార్షల్ ఆర్ట్స్ లో కూడా నేర్చేసుకుంది నివేదా పేతురాజ్. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pushpa 3: పుష్ప 3 రిలీజ్ డేట్ ఫిక్స్ ? జగపతి బాబు ఇచ్చిన మాస్ అప్‌డేట్!
Recommended image2
TV Actresses: తెలుగు టీవీ సీరియల్స్ లో టాప్ 10 గ్లామరస్ బ్యూటీలు.. వీళ్ళ అందం ముందు హీరోయిన్లు కూడా బలాదూర్
Recommended image3
Tejasswi Prakash: కరణ్, తేజస్విల 7.63 కోట్ల లగ్జరీ హౌస్.. సీక్రెట్ బాత్రూమ్ డిజైన్ గురించి తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved