MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor Controversy: డబ్బుల కోసమే ఇలా రెచ్చగొడుతున్నారు, ఇండస్ట్రీ మొత్తం అదే పని.. నిత్యా మీనన్ ఫైర్

Janhvi Kapoor Controversy: డబ్బుల కోసమే ఇలా రెచ్చగొడుతున్నారు, ఇండస్ట్రీ మొత్తం అదే పని.. నిత్యా మీనన్ ఫైర్

Janhvi Kapoor Controversy: రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన  'పెద్ది' సినిమాలో హీరోయిన్‌ను అసభ్యంగా చూపించారనే వివాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా మరో హీరోయిన్‌ నిత్యా మీనన్‌ స్పందించింది. ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 08 2026, 03:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జాన్వీ కపూర్‌ వివాదంపై నిత్యా మీనన్‌
Image Credit : Instagram

జాన్వీ కపూర్‌ వివాదంపై నిత్యా మీనన్‌

భారతీయ సినిమాల్లో హీరోయిన్లను గ్లామర్ పేరుతో అసభ్యకరంగా చూపించడం (Hyper-sexualization) ఎప్పటినుంచో జరుగుతున్నదే. హీరోయిన్‌ అంటే గ్లామర్‌ అనే నానుడి పడిపోయింది. ఒకప్పుడు దీనిపై వాదనలు వినిపించినా, ఇప్పుడు కామన్‌ అయిపోయింది. అందరు అలవాటు పడిపోయారు. కానీ ఇప్పుడు రామ్ చరణ్, జాన్వీ కపూర్  'పెద్ది' సినిమాతో ఈ వివాదం మళ్లీ రాజుకుంది. ఈ సినిమాలో జాన్వీ పాత్రను ఓ వస్తువులా చూపించారని విమర్శలు వస్తున్నాయి.  ఇది పెద్ద రచ్చ అవుతుంది. తాజాగా దీనిపై నిత్య మీనన్‌ స్పందించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండస్ట్రీ మొత్తం ఈ సమస్య ఉంది
Image Credit : Asianet News

ఇండస్ట్రీ మొత్తం ఈ సమస్య ఉంది

'వెరైటీ ఇండియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ ఈ విషయంపై మాట్లాడారు. హీరోయిన్లను కేవలం గ్లామర్ డాల్స్‌గా చూపించడం ఒక్క సౌత్ సినిమాల్లోనే కాదు, మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉందని ఆమె స్పష్టం చేశారు. `సినిమాలను మరీ కమర్షియల్ (Commercialization) చేయడమే దీనికి కారణం. బాక్సాఫీస్ దగ్గర డబ్బుల కోసం, ప్రేక్షకులను రెచ్చగొట్టడానికి ఇలాంటి సీన్స్ పెడుతున్నారు` అని నిత్యా అన్నారు.

35
స్టార్‌ డమ్‌ కంటే నాకు విలువలే ముఖ్యం -నిత్యా మీనన్‌
Image Credit : Instagram

స్టార్‌ డమ్‌ కంటే నాకు విలువలే ముఖ్యం -నిత్యా మీనన్‌

ఇలాంటి సీన్స్ విషయంలో హీరోయిన్లు నిస్సహాయులేం కాదని నిత్యా అభిప్రాయపడ్డారు. 'నటీనటులకు సొంతంగా కొన్ని హద్దులు (Boundaries) ఉండాలి. అలాంటి సీన్స్‌లో నటించడం ఇష్టం లేకపోతే ధైర్యంగా నో చెప్పాలి. కమర్షియల్ సినిమాలు ముందు ఒప్పుకుని ఆ తర్వాత ఇలాంటివి చేయనంటే ఎవరూ పట్టించుకోరు. కొన్ని గ్లామర్ రోల్స్ ఒప్పుకోనందుకు నేను చాలా సినిమాలు వదులుకున్నా. స్టార్‌డమ్ కన్నా నా విలువలే నాకు ముఖ్యం' అని నిత్యా తేల్చిచెప్పారు.

45
పెద్దిలో జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు
Image Credit : Instagram

పెద్దిలో జాన్వీ కపూర్‌ పాత్రపై విమర్శలు

బుచ్చి బాబు సాన డైరెక్ట్ చేస్తున్న 'పెద్ది' సినిమాలో హీరో రామ్ చరణ్ పాత్రకు బలమైన సామాజిక-రాజకీయ నేపథ్యం ఇచ్చారు. కానీ హీరోయిన్ అచ్చియమ్మ (జాన్వీ కపూర్) పాత్రను కేవలం గ్లామర్ షోకే పరిమితం చేశారని విమర్శకులు అంటున్నారు. హీరోయిన్ అనుమతి లేకుండా టచ్ చేయడం, కరెంట్ పోయినప్పుడు బలవంతంగా ముద్దు పెట్టుకోవడాన్ని చూపించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన తర్వాత హీరోయిన్ ఏడుస్తుంటే, ఆమె తండ్రి రాజకీయ భవిష్యత్తు కోసం మర్చిపోమని చెప్పే సీన్ తీవ్ర విమర్శలకు దారితీసింది.

55
విమర్శలకు దిగొచ్చిన దర్శకుడు బుచ్చిబాబు
Image Credit : T-Series Malayalam

విమర్శలకు దిగొచ్చిన దర్శకుడు బుచ్చిబాబు

వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం, పోస్ట్-ప్రొడక్షన్ టైంలో జాన్వీ కపూర్ కూడా ఈ సీన్స్ పట్ల అభ్యంతరం చెప్పారట. కానీ బాక్సాఫీస్ లాభాల కోసం డైరెక్టర్ ఆమె మాట వినలేదని అంటున్నారు. వివాదం పెద్దది కావడంతో, జాన్వీ కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌కు సపోర్ట్ తెలిపారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో డైరెక్టర్ బుచ్చి బాబు  బహిరంగంగా క్షమాపణ చెప్పారు. సినిమాలో ఆయా సన్నివేశాలను కట్‌ చేశారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: బిగ్ బాస్ నుంచి బయటకొచ్చి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు కృష్ణుడు.. మరో రచ్చ
Recommended image2
Medha Meka: శ్రీకాంత్‌ కూతురు మేద ఏం చదువుతుందో తెలుసా? ఎవరికీ తెలియని టాలెంట్‌.. రహస్యాలు రివీల్
Recommended image3
Epic First Semester 11 Days Collection: డిజాస్టర్‌ దిశగా ఎపిక్‌ మూవీ, 11 రోజుల కలెక్షన్లు.. మరీ ఇంతనా?
Related Stories
Recommended image1
Bigg Boss Telugu 10: బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి అదిరిపోయే అప్‌ డేట్‌, కంటెస్టెంట్లు వీరేనా.. సరికొత్త ట్విస్ట్ తో
Recommended image2
Upasana Networth: సినిమాలకు సంబంధం లేకుండా వేల కోట్లకు అధిపతిగా ఎదిగిన ఉపాసన.. ఆమె ఆస్తులెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved