MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Nithiin New film: వరుస పరాజయాలతో రూట్ మార్చిన నితిన్‌, కొత్త సినిమా షురూ.. స్పెషల్‌ ఏంటంటే?

Nithiin New film: వరుస పరాజయాలతో రూట్ మార్చిన నితిన్‌, కొత్త సినిమా షురూ.. స్పెషల్‌ ఏంటంటే?

నితిన్‌ కొత్త సినిమా ప్రారంభమైంది. అయితే వరుస పరాజయాల కారణంగా ఆయన రూట్‌ మార్చారు. సక్సెస్‌ కొట్టాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారని ఈ కొత్త ప్రయత్నం తెలియజేస్తుంది. అదేంటంటే? 

1 Min read
Author : Aithagoni Raju
Published : May 07 2026, 07:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రూట్‌ మార్చిన నితిన్‌
Image Credit : Asianet News

రూట్‌ మార్చిన నితిన్‌

నితిన్‌ ఒకప్పుడు స్టార్‌ హీరోగా ఎదిగాడు. వరుస హిట్లతో మంచి స్టార్‌డమ్‌ సొంతం చేసుకున్నారు. వరుసగా లవ్‌ స్టోరీస్‌ చేసి యూత్‌కి, అమ్మాయిలకు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి విజయాలు రాలేదు. క్రమంగా ఆయన కెరీర్‌ తలక్రిందులవుతుంది. ఒక్క హిట్‌ వస్తే, నాలుగైదు పరాజయాలు వరిస్తున్నాయి. అయినా హీరోగా నిలబడ్డాడు. రాణిస్తున్నాడు. అయితే ఇన్నాళ్ల అనుభవాలతో ఇప్పుడు నితిన్‌ రూట్‌ మార్చాడు. సరికొత్త పంథాతో ముందుకు సాగుతున్నాడు. తాజాగా బుధవారం తన కొత్త సినిమాని స్టార్ట్ చేశాడు. సితార బ్యానర్‌లో ఈ చిత్రం చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కొత్త సినిమా స్పెషల్‌ ఏంటంటే?
Image Credit : Asianet News

కొత్త సినిమా స్పెషల్‌ ఏంటంటే?

ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్  సమర్పిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్‌ ఏంటంటే దీనికి నారి సిరిసవాడ, సోమశేఖర్‌ టి అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తుండగా, వీరిద్దరు కొత్త వారు కావడం విశేషం. అనుభవమున్న వారితో చేదు అనుభవాలు చవిచూసిన నితిన్‌ ఇప్పుడు రూట్‌ మార్చి కొత్తవాళ్లతో చేస్తున్నారు. పైగా దర్శకత్వ ద్వయంతో ఆయన మూవీ చేస్తుండటం విశేషం. దీనికి సురేష్‌ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, `మిరాయ్‌` ఫేమ్‌ రితిక నాయక్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

33
షూటింగ్‌ అప్‌ డేట్‌
Image Credit : Asianet News

షూటింగ్‌ అప్‌ డేట్‌

నితిన్‌ కొత్త చిత్రం బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దీనికి సినిమాటోగ్రాఫర్‌గా అనిత్ మదాడి, కళా దర్శకుడిగా జానీ షేక్ వ్యవహరిస్తున్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక బృందం తమ నైపుణ్యంతో దృశ్యపరంగా ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారని, ఈ సినిమా చిత్రీకరణ మే రెండో వారం నుండి ప్రారంభం కానుందని,  షూటింగ్‌కి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నద్ధమవుతున్నామని, మిగిలిన వివరాలు మున్ముందు వెల్లడించనున్నట్టు టీమ్‌ తెలిపింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Varshini: ఆమెని సుధీర్ మీదికి తోమడానికి పంపుతున్నాడు.. వర్షిణి, షాలిని మధ్య మంటలు.. నరేష్ కూడా తగ్గేదేలే
Recommended image2
Samantha: ఘనంగా సమంత సీమంతం..సంప్రదాయాలంటే నాకు ఎప్పుడూ గౌరవమే, బలమైన శక్తి దాగుంది
Recommended image3
Daali Dhananjay: కొడుక్కి వెరైటీ పేరు పెట్టిన పుష్ప విలన్.. ఆ పేరుకు పెద్ద కథే ఉంది!
Related Stories
Recommended image1
Raaka Movie: `పుష్ప`తో `రాకా`కి క్రేజీ లింక్‌.. అల్లు అర్జున్‌ ప్లాన్‌ తెలిస్తే మతిపోవాల్సిందే
Recommended image2
నల్లగా ఉందని రెండు నెలలు పసుపు రాశారు.. కట్‌ చేస్తే ఇండస్ట్రీని దున్నేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved