MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం

Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం

రాజమౌళి సినిమాల్లో నటించిన హీరోలంతా మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. కానీ ఈ ముగ్గురి హీరోల కెరీర్ మాత్రం భిన్నంగా ఉంది. ఆ ముగ్గురు ఎవరు అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Dec 09 2025, 07:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ తప్పదా ?
Image Credit : Instagram/SS Rajamouli

రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ తప్పదా ?

దర్శక ధీరుడు రాజమౌళి పరాజయం లేకుండా దూసుకుపోతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత జక్కన్న గ్లోబల్ మార్కెట్ పై కన్నేశారు. పురాణాలు, టైం ట్రావెల్, గ్లోబ్ ట్రాటర్, సైన్స్ ఫిక్షన్ ఈ అంశాలని మిక్స్ చేసి మహేష్ బాబుతో 1500 కోట్ల భారీ బడ్జెట్ లో వారణాసి చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకి అయినా ఆ నెక్స్ట్ మూవీ ఫ్లాప్ కావాల్సిందే. ప్రభాస్,, ఎన్టీఆర్, రాంచరణ్, రవితేజ ఇలా రాజమౌళితో సినిమాలు చేసిన వారందరి పరిస్థితి ఇదే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు ప్రత్యేకం
Image Credit : Social Media X

రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు ప్రత్యేకం

ఎన్టీఆర్ ఒక్కడే ఆర్ఆర్ఆర్ తర్వాత దేవరతో దానిని బ్రేక్ చేశారు. దేవర మంచి హిట్ అయింది. అయితే స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి, యమదొంగ చిత్రాల తర్వాత మాత్రం తారక్ కి కూడా ఫ్లాపులు తప్పలేదు. ఇదిలా ఉండగా రాజమౌళితో సినిమాలు చేసిన హీరోల్లో ముగ్గురి కెరీర్ మాత్రం చాలా భిన్నంగా ఉంది. ఆ ముగ్గురు హీరోలు నితిన్, సునీల్, నాని. ఈ ముగ్గురు హీరోల కెరీర్ ఎందుకు భిన్నంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Related Articles

Related image1
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో
Related image2
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
35
నితిన్
Image Credit : X/@SVC_official

నితిన్

రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే చిత్రంలో నటించాడు. రాజమౌళి సినిమా తర్వాత ఫ్లాప్ పడుతుంది అని తెలుసు కానీ.. ఏకంగా కెరీర్ ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే పరిస్థితి వస్తుంది అని నితిన్ ని చూస్తే అర్థం అవుతుంది. సై తర్వాత నితిన్ కి వరుసగా 12 ఫ్లాపులు పడ్డాయి. ధైర్యం నుంచి మారో వరకు అన్నీ ఫ్లాపులే. నితిన్ కెరీర్ పూర్తిగా పతనం అవుతుంది అనే టైంలో ఇష్క్ తో కంబ్యాక్ ఇచ్చారు. ఆ తర్వాత నితిన్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఇచ్చారు. రాజమౌళి హీరోల్లో స్టార్ స్టేటస్ కి దూరంగా ఉన్న వారిలో నితిన్ ఒకరు. 

45
సునీల్
Image Credit : Youtube/ SriBalajiMovies

సునీల్

రాజమౌళితో సినిమా చేసి స్టార్ కాలేకపోయిన వారిలో సునీల్ కూడా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో సునీల్ మర్యాద రామన్న చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. మర్యాద రామన్న మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సునీల్ పూర్తి స్థాయిలో హీరోగా మారడానికి ప్రయత్నించాడు. కామెడీ రోల్స్ పక్కన పెట్టేశాడు. ఈ క్రమంలో కొన్ని హిట్స్ పడ్డాయి. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది సునీల్ హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవుతూ వచ్చాయి. దీనితో క్రమంగా సునీల్ ని హీరోగా పెట్టి సినిమా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీనితో సునీల్ తిరిగి క్యారెక్టర్ రోల్స్, కామెడీ పాత్రలు వేయాల్సి వచ్చింది. 

55
నాని
Image Credit : Instagram/@nameisnani

నాని

రాజమౌళి హీరోల్లో నాని కూడా ప్రత్యేకమే. రాజమౌళి దర్శకత్వంలో నాని పూర్తి స్థాయిలో నటించలేదు. ఈగ చిత్రంలో కేవలం 20 నిమిషాల రోల్ చేశారు అంతే. కానీ నాని వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. అయితే ఎన్టీఆర్, ప్రభాస్, రాంచరణ్ లాంటి హీరోల తరహాలో నానికి మాస్ ఇమేజ్ ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే నాని మాస్ చిత్రాలు చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం నాని తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ప్యారడైజ్ లో నటిస్తున్నాడు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
నాని (నటుడు)
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Recommended image2
Chiru-Pawan: చిరంజీవికి బాగా ఇష్టమైన పవన్ కళ్యాణ్ 4 సినిమాలు ఇవే..మెగాస్టార్ జోస్యం చెప్పిన మూవీ సూపర్ హిట్
Recommended image3
Irumudi Day 12 Collections: బాక్సాఫీసు వద్ద రవితేజ రేంజ్‌ ఏంటో చూపించిన ఇరుముడి.. హైయ్యెస్ట్ ప్రాఫిట్స్
Related Stories
Recommended image1
30 ఏళ్ళు మేకప్ మ్యాన్ గా పని చేసిన వ్యక్తితో అనుష్క సినిమా, గోవాకి పిలిచి మరీ వార్నింగ్ ఇచ్చిన అగ్ర హీరో
Recommended image2
Chiranjeevi: చిరంజీవితో నటించి సెలెబ్రిటీలని పెళ్లి చేసుకున్న హీరోయిన్లు వీళ్ళే..సుహాసిని నుంచి జ్యోతిక వరకు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved