Vikram: కమల్ హాసన్ 'విక్రమ్' తో నితిన్ కి ఎంత లాభమో తెలుసా.. జాక్ పాట్ తగిలింది
ఎక్కడ చూసినా కమల్ హాసన్ విక్రమ్ సినిమా సంచలనాల గురించే చెప్పుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది.

ఎక్కడ చూసినా కమల్ హాసన్ విక్రమ్ సినిమా సంచలనాల గురించే చెప్పుకుంటున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలయ్యింది. తమిళనాట ఈ చిత్రం రికార్డులు క్రియేట్ చేస్తోంది. 300 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది. తెలుగులో కూడా ఈ చిత్రం మంచి విజయం వైపు అడుగులు వేస్తోంది.
లోకేష్ కనకరాజ్ తన టేకింగ్ తో ఆడియన్స్ ని థ్రిల్ చేశాడు. దీనికి తోడు కమల్ నటన జత కావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలవుతున్నాయి. యాక్షన్ సన్నివేసాలు మాత్రమే కాదు.. ఎమోషనల్ గా కథని ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో లోకేష్ కనకరాజ్ దిట్ట.
విక్రమ్ మూవీని తెలుగులో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ పై ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. తెలుగులో ఈ చిత్రానికి 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కమల్ హాసన్ గత చిత్రాల రిజల్ట్స్ దృష్ట్యా తక్కువ మొత్తానికే తెలుగు హక్కులు సొంతం అయ్యాయి.
కానీ లోకేష్ కనకరాజ్ టేకింగ్ పై నమ్మకంతో నితిన్ తండ్రి రిస్క్ చేశారు. ఊహించినట్లుగానే కమల్ హాసన్ నటనని ఉపయోగించుకుంటూ లోకేష్ మరోసారి బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లోనే విక్రమ్ చిత్రం 14 కోట్ల షేర్ దాటేసింది. అంటే పెట్టుబడికి రెట్టింపు లాభం.
డబుల్ ప్రాఫిట్స్ తో తెలుగులో కూడా విక్రమ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విక్రమ్ మూవీ ప్రస్తుతం ఆడియన్స్ కి మాస్ మూవీస్ లో ఉన్న ఏకైక ఆప్షన్. దీనితో విక్రమ్ కోసం ఎగబడుతున్నారు. మరో వారం పైగానే విక్రమ్ ప్రభావం తెలుగు బాక్సాఫీస్ పై ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఈ లెక్కన నితిన్ కి విక్రమ్ రూపంలో జాక్ పాట్ తగిలిందనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం అని భాషలలో 300 కోట్ల గ్రాస్ ని అధికమించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో బాహుబలి రికార్డులని కూడా ఈ చిత్రం తిరగరాస్తోంది.