నితిన్ కాపురంలో కుంపటి పెట్టబోతున్న దర్శకుడు.. స్టోరీ లీక్ ?
వక్కంతం వంశీ చిత్రం తర్వాత నితిన్.. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

యంగ్ హీరో నితిన్ కి ఈ ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాస్ చిత్రంతో హిట్ కొట్టాలన్న కసితో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే చిత్రంలో నటించాడు. డెబ్యూ డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తున్నాడు.
నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో నితిన్ స్మగ్లర్ పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రకి తగ్గట్లుగా నితిన్ రఫ్ లుక్ లో కనిపించబోతున్నాడట. ఇటీవల కృష్ణ గారి భౌతిక కాయానికి నివాళులు అర్పించడానికి వెళ్ళినప్పుడు నితిన్ గుబురు గడ్డంతో షాకింగ్ లుక్ లో కనిపించాడు.
నితిన్ గడ్డం లుక్ వక్కంతం వంశీ చిత్రం కోసమే అని అంటున్నారు. నితిన్ కంప్లీట్ లుక్ అభిమానులు బిగ్ సర్ప్రైజ్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వక్కంతం వంశీ చిత్రం తర్వాత నితిన్.. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వెంకీ కుడుముల మెగాస్టార్ చిరంజీవితో మూవీ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అనుకోని కారణాల వల్ల అది కుదర్లేదు.
దీనితో వెంకీ కుడుములు నితిన్ హీరోగా మరో మూవీ చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో భీష్మ చిత్రం వచ్చింది. భీష్మ మూవీ సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వెంకీ కుడుముల నితిన్ కోసం ఒక ఆసక్తిరమైన స్టోరీ లైన్ రెడీ చేశారట. భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్న కుర్రాడి కష్టాలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో ఫన్నీగా చూపించబోతున్నారట.
డివోర్స్ జరిగిన భర్తగా నితిన్ నవ్వులు పూయించేందుకు రెడీ అవుతున్నాడు. భీష్మ చిత్రంలో నితిన్ కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఈ చిత్రంలో కూడా వెంకీ కుడుములు అదే ఫార్ములా అప్లై చేయబోతున్నట్లు తెలుస్తోంది.
వెంకీ కుడుముల, నితిన్ కలసి మరోసారి మ్యాజిక్ చేస్తారేమో చూడాలి. ఏది ఏమైనా నితిన్ కి అర్జెంట్ గా ఓ హిట్ అవసరం. ప్రస్తుతం వక్కంతం వంశీ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మారేడు మిల్లి అడవుల్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.