తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నితిన్ దంపతులు.. ముద్దుల కొడుకు ఫోటోలు వైరల్
యంగ్ హీరో నితిన్ తిరుమలలో సందడి చేశారు. తన భార్య షాలిని, ముద్దుల కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు.

Nithiin
యంగ్ హీరో నితిన్ తిరుమలలో సందడి చేశారు. తన భార్య షాలిని, ముద్దుల కొడుకు, ఇతర కుటుంబ సభ్యులతో తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నితిన్ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు ఈ ఏడాదే రిలీజ్ కానున్నాయి.
కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న నితిన్ మొక్కులు తీర్చుకున్నారు. గత ఏడాది నితిన్ తండ్రైన సంగతి తెలిసిందే. నితిన్ షాలిని లకు కొడుకు జన్మించాడు. గత ఏడాది సెప్టెంబర్ లో తనకి కొడుకు పుట్టిన విషయాన్ని నితిన్ అనౌన్స్ చేశారు. జస్ట్ ఫింగర్స్ మాత్రం చూపిస్తూ ఫోటో షేర్ చేశారు.
ఆ తర్వాత తన తనయుడికి సంబంధించిన ఎలాంటి దృశ్యాలు షేర్ చేయలేదు. తాజాగా తిరుమలలో నితిన్ కొడుకు ముఖాన్ని మీడియా ప్రతినిధులు క్యాప్చర్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూనియర్ నితిన్ క్యూట్ గా ఉన్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెట్టడం ప్రారంభించారు. నితిన్ నటించిన రాబిన్ హుడ్ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కావలసింది. పుష్ప 2 ప్రభావం కారణంగా ఆ చిత్రాన్ని మార్చి 28కి పోస్ట్ పోన్ చేశారు. వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమ్ముడు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ కావాల్సి ఉంది.