నా భర్తతో ఆ నటి అక్రమ సంబంధం.. ఆమెతో పాటు నీతో కూడా అంటూ అసభ్యంగా..
నిషా రావల్ తాజాగా కంగనా రనౌత్ హోస్ట్ గా చేస్తున్న లాక్ అప్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో నిషా తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు షేర్ చేసుకున్నారు.

చిత్ర పరిశ్రమలో లవ్ అఫైర్స్ గురించి తరచుగా వార్తలు వింటుంటాం. నటీ నటుల మధ్య ప్రేమ చిగురించడం సహజం. కొన్ని రిలేషన్ షిప్స్ పెళ్లి వరకు వెళుతుంటాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోతుంటాయి. కానీ పెళ్లి తర్వాత విడిపోవాల్సి వస్తే తీవ్రమైన మానసిక వేదన మిగులుతుంది. ప్రస్తుతం అలాంటి మానసిక వేదనని బుల్లితెర నటి నిషా రావల్ అనుభవిస్తున్నారు.
నిషా రావల్ తాజాగా కంగనా రనౌత్ హోస్ట్ గా చేస్తున్న లాక్ అప్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో నిషా తన పర్సనల్ లైఫ్ గురించి అనేక విషయాలు షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన భర్తతో విడాకులు తీసుకుని విడిపోవడం గురించి మాట్లాడుతూ కన్నీటిపర్యంతం అయ్యారు.
గత ఏడాది నా లైఫ్ లో కన్నీరు మిగిల్చే సంఘటనలు జరిగాయి. నా భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం బయట పడింది. తన మాజీ భర్త కరణ్, నటి పాయల్ రోహత్గీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఒక రోజు ఆమెతో కరణ్ ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుతుంటే గమనించా. వెంటనే కరణ్ ని నిలదీసి అడిగా అని నిషా రావల్ తెలిపింది.
దీనితో కరణ్ కొంచెం కూడా సిగ్గు, పశ్చాతాపం లేకుండా అవును నేను ఆమెని ప్రేమిస్తున్నాను.. 6 నెలల నుంచి అంతో సీక్రెట్ రిలేషన్ లో ఉన్నా. అలాగే నువ్వంటే కూడా నాకు ఇష్టమే' అని చెప్పాడు. దీనితో నాకు అతడిపై భరించలేనంతగా కోపం వచ్చింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.
నా హృదయం ముక్కలైంది. అలాగే నన్ను కరణ్ ఫిజికల్ గా కూడా గాయపరిచాడు. ఆ గాయాలతో మీడియా ముందుకు వచ్చి నా బాధని వివరిస్తే.. దారుణంగా ట్రోల్ చేశారు. శరీరంపై కెచప్ రాసుకుని నాటకాలు ఆడుతోంది అంటూ హేళన చేశారు అని నిషా రావల్ కన్నీరు మున్నీరైంది.
ఇక లాభం లేక కరణ్ నుంచి విడిపోవడాలని డిసైడ్ అయి విడాకులు తీసుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఈ వివాదంలో కరణ్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం బెయిల్ పై కరణ్ విడుదల అయ్యాడు.