- Home
- Entertainment
- Karthika Deepam: ఒక్క నిరుపమ్ కోసం ముగ్గురు ఆడాళ్ళ పోరాటం.. సీన్ లోకి బొమ్మలు గిసే గీత ఎంట్రీ!
Karthika Deepam: ఒక్క నిరుపమ్ కోసం ముగ్గురు ఆడాళ్ళ పోరాటం.. సీన్ లోకి బొమ్మలు గిసే గీత ఎంట్రీ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే శోభ.. నిరూపమ్ (Nirupam) జ్వాల హిమ (Hima) ల మధ్య ఏదో జరుగుతుంది వీళ్ళని గట్టిగా పట్టించుకోవాలి అని అనుకుంటుంది. మరోవైపు హిమ ఎందుకు బావ ఇవన్నీ చూసి కూడా నా మీద ప్రేమను పెంచుకుంటున్నావు అని అడుగుతుంది.
నిరుపమ్ (Nirupam) నీ మీద ప్రేమ ఎప్పటికీ చావదు హిమ (Hima) అని అంటాడు. ఇక హిమ నా ప్రేమను మీకు వేరే వాళ్ల రూపంలో అందించ బోతున్నాను దాన్ని నువ్వు స్వీకరించాలి బావ అంటుంది. ఇదంతా శోభ ఒక దగ్గర నుంచి గమనిస్తుంది. ఇక ఆ అమ్మాయి పేరు జ్వాలా అంటుంది.
నిరూపమ్ (Nirupam) ఏం మాట్లాడుతున్నావ్ అంటూ హిమ చిరాకు పడతాడు. ఇదంతా గమనిస్తున్న శోభ (Sobha) ఆ అవకాశం నాకు ఇవ్వచ్చు కదవే.. పోయి పోయి ఆటో దానికి ఎందుకు కట్ట పెడతావు అని మనసులో అనుకుంటుంది. జ్వాల కి కూడా నువ్వు అంటే ఇష్టం బావ అని అనగా నిరుపమ్ స్టన్ అవుతాడు.
ఇక నువ్వు జ్వాల (Jwala) నె పెళ్లి చేసుకోవాలి బావ అని.. హిమ (Hima) కళ్ళు తిరిగి కింద పడి పోతుంది. మరోవైపు ఆనందరావు కష్టాన్ని కార్తీక్ ఫోటో వైపు చూసుకుంటూ తనకి చెప్పుకున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఒకవైపు శోభ.. ఒక డాక్టర్ ని ఆటో దానికి ఇచ్చి హిమ ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది అని ఆలోచిస్తుంది.
ఇక ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఏదో లింక్ ఉంది అని శోభ ఆలోచిస్తుంది. ఇక సప్న సౌర్య చిన్నప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోయింది అని శోభ కు చెబుతుంది. దాంతో శోభ జ్వాల చేతి మీద ఉన్న హెచ్ అక్షరం హిమ కాదుకదా.. అని ఆలోచిస్తుంది. ఇక హిమ..జ్వాల తో ఇప్పుడు నీ ప్రేమ విషయం డాక్టర్ సాబ్ కి చెప్పవచ్చు అని ఆనందంగా ఉంటుంది.
ఇక ఆ మాటకు జ్వాల (Jwala) ఎంతో ఆనంద పడుతూ.. ఎలా చెప్పాలి అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇక హిమ (Hima) పోయిన జన్మలో మనిద్దరం అక్క చెల్లెళ్ళం ఏమో అనగా.. జ్వాల ఆపు అంటూ తన పై విరుచుకు పడుతుంది. మరోవైపు శోభ జ్వాల హిమలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అంటూ నానా రకాలుగా ఆలోచిస్తుంది.
ఇక తరువాయి భాగంలో జ్వాల (Jwala) నిరుపమ్ (Nirupam) కి ప్రపోజ్ చేయడానికి దగ్గరగా వస్తుంది. ఈ లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. దాంతో జ్వాల ఒక్కసారిగా ఆశ్చర్యపోయి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. తర్వాత హిమ ఎందుకు వెళ్లిపోయావు అని అడగగా.. నా శత్రువు హిమ ఫోన్ చేసింది అని జ్వాల అంటుంది.