- Home
- Entertainment
- Niharika Konidela: నా ఫోటో చూసి ఆ విషయం కనిపెట్టండి... కొంటె చూపులతో క్రేజీ ఫజిల్ విసిరిన నిహారిక!
Niharika Konidela: నా ఫోటో చూసి ఆ విషయం కనిపెట్టండి... కొంటె చూపులతో క్రేజీ ఫజిల్ విసిరిన నిహారిక!
మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన అభిమానుల కోసం వ్యక్తిగత, వృత్తి సంబంధమైన విషయాలు తెలియజేస్తూ ఉంటారు. నిహారిక ఫ్యాన్స్ ఆమె ఇంస్టాగ్రామ్ ఫాలో అవుతూ, ఆమె పోస్ట్స్ స్పందిస్తూ ఉంటారు.

Niharika Konidela
ఈ మధ్య కొన్నాళ్ళు నిహారిక (Niharika)ఇంస్టాగ్రామ్ అకౌంట్ యాక్టీవ్ లో లేదు. సడన్ గా నిహారిక ఇంస్టాగ్రామ్ ని వదిలేయడంతో ఆమె ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. చివరికి నాగబాబును కూడా నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ గురించి అడిగారు. దానికి ఆయన ఓ సెటైరికల్ సమాధానం చెప్పి తప్పించుకున్నారు.
Niharika konidela
అయితే నిహారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియో పై ఫైర్ అయిన అత్తమామలు మండిపడ్డారని, ఆ కారణంగానే నిహారిక ఇంస్టాగ్రామ్ డీఆక్టివేట్ చేశారని ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ... ప్రముఖంగా వినిపించింది. ఇలాంటి విమర్శలకు చెక్ పెడుతూ నిహారిక రీ ఎంట్రీ ఇచ్చారు.
కొద్దిరోజులుగా నిహారిక ఇంస్టాగ్రామ్ లో తిరిగి సందడి చేస్తున్నారు. భర్తతో పాటు తన విహారానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. నిహారిక జోర్డాన్ దేశం వెళ్లినట్లు తెలుస్తుండగా.. అక్కడి అందమైన ప్రదేశాల్లో ఫోటోలు దిగి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తున్నారు.
Niharika Konidela
తాజాగా ఆమె ఓ క్యూట్ ఫోటో షేర్ చేశారు. ఇక ఆ ఫొటోలో ఉన్న షేడ్స్ చూసి టైం ఎంతో చెప్పాలని ఓ కొంటె ప్రశ్న వేశారు. ఇక నిహారిక ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరు సమయం చెబుతుంటే మరికొందరు ఆమె బ్యూటీ పై కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం నిహారిక పోస్ట్ వైరల్ అవుతుంది.
కాగా నిహారిక మింక్ అండ్ పబ్ రైడ్ లో దొరికినప్పటి నుండి ఆమెను యాంటీ ఫ్యాన్స్ టార్గెట్ చేస్తున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ ఫోటోస్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇవేమీ పట్టించుకోని నిహారిక తన పంథాలో తాను వెళుతున్నారు.
నిహారికపై ఎన్ని విమర్శలు వచ్చినా కుటుంబ సభ్యులు అండగా ఉంటున్నారు. తండ్రి నాగబాబుతో పాటు తల్లి పద్మజ నిహారిక మంచి అమ్మాయని కితాబు ఇచ్చారు. అందుకే పెళ్లి తర్వాత కూడా ఆమె నటిగా కొనసాగడానికి అనుమతి ఇచ్చారు.