మెగా అభిమానులకు నిహారిక తీపి కబురు.. నెట్టింట వైరల్ అవుతున్నన్యూస్.!
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) మరోసారి వార్తల్లో నిలిచింది. రెండేండ్ల కింద నిహారిక పెళ్లి ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె మెగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పినట్టు తెలుస్తోంది. నెట్టింట ఆ న్యూస్ వైరల్ అవుతోంది.

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) కూతురు తెలుగు ఆడియెన్స్ కు స్టార్ కిడ్ గా, హీరోయిన్ గా పరిచయమే. పలు చిత్రాల్లోనూ హీరోయిన్, కీలక పాత్రల్లో నటించి తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుందీ బ్యూటీ. చివరిగా పెద్దనాన్న, మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా నర్సింహారెడ్డి’ చిత్రంలో నటించింది.
ఇటీవల డ్రగ్స్ సేవించిన విషయంలో నిహారిక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయం సద్దుమణగడంతో నిహారిక ఊపిరి పీల్చుకుంది. తాజాగా మరోసారి నిహారిక పేరు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. తను తల్లికాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
2020 డిసెంబర్ 9న ఉదయపూర్‌లోని ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది. హిందూ సంప్రదాయ పద్ధతుల్లో మెగా పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ టీవీ, సినిమాలకు కాస్తా దూరంగానే ఉంటోంది. భర్తతో కలిసి మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
అయితే, ఇప్పటికే నిహారిక నుంచి గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్న మెగా అభిమానులకు.. తాజాగా తీపి కబురు అందింది. నిహారిక ప్రెగ్నెంట్ అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఈ విషయాన్ని నిహారికనే స్వయంగా వెల్లడించిందని తెలుస్తోంది.
నిహారిక తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఇటీవల తన క్లోజ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నట్టు సమాచారం. ‘మా లైఫ్ లోకి మరొకరు.. ఇకపై మేం ముగ్గురం’ అంటూ నిహారిక వెల్లడించడం.. తన ప్రెగ్నెన్సీని సూచిస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
విషయం తెలిసిన నాగబాబు, నిహారిక తల్లి కూడా సంతోషంగా ఫీలయ్యారంట. పుట్టింటి నుంచి సారె కూడా పంపించారని తెలుస్తోంది. అయితే నిహారిక మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. దీంతో మెగా వారసుడిపై వస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజమేని మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.