- Home
- Entertainment
- ఆంధ్రలో నిహారిక ఓటు గోవిందా, ఏం జరిగిందంటే.. కొత్త ఇల్లు తీసుకుంటా, షాకింగ్ పొలిటికల్ కామెంట్స్
ఆంధ్రలో నిహారిక ఓటు గోవిందా, ఏం జరిగిందంటే.. కొత్త ఇల్లు తీసుకుంటా, షాకింగ్ పొలిటికల్ కామెంట్స్
మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు.

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది.
తన పర్సనల్ లైఫ్ విషయాలతో నిహారిక తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మాజీ భర్త చైతన్య నుంచి నిహారిక విడాకులు తీసుకుంది. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. అప్పటికి నుంచి నిహారిక సోషల్ మీడియాలో నెగిటివిటి ఎదుర్కొంటోంది. సెలెబ్రిటీ లైఫ్ అన్నాక అభిమానులు వచ్చి ఆటోగ్రాఫ్ లు తీసుకోవడం ఎంత సహజమో.. విమర్శలు చేయడం కూడా అంతే సహజం.
కానీ పర్సనల్ లైఫ్ గురించి కామెంట్స్ చేసే తప్పుడు శృతిమించకుండా ఉండాలి. ఒకరు విమర్శలు చేసినంత మాత్రాన మనం చనిపోము కదా.. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని నాన్న చెప్పే మాటలే తనకి కొండంత ధైర్యం ఇస్తానని నిహారిక పేర్కొంది. మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు మీడియా ముందుకు వచ్చినా రాజకీయాలకి సంబందించిన ప్రశ్నలు ఎదురవుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా పాలిటిక్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. నాగబాబు కూడా పవన్ వెంటే నడుస్తున్నారు. తాజాగా జనసేన పార్టీ గురించి నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాబాయ్ పొలిటికల్ యాక్టివిటీ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. ఈసారి పక్కాగా జనసేన పార్టీ విజయం సాధించాలి. ఆ మేరకు నేను ప్రార్థిస్తున్నా. నా ఓటు కూడా ఆంధ్రాలోనే ఉంది. కానీ నా ఓటుని రద్దు చేశారు. కారణాలు తెలియదు. ఆంధ్రాలో మేము ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాం. నాన్న పోటీ చేయడం కంఫర్మ్ అయితే అక్కడే ఇల్లు తీసుకుంటాం.
ఒక వేళ పోటీ చేయకున్నా ఎక్కడో చోట ఇల్లు తీసుకోవాలి అని నిహారిక తెలిపింది. నాన్న పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల 2 వారాల కొకసారి ఇంటికి వస్తున్నారు. కొన్ని సార్లు 5 నిముషాలు ఉండి వెళ్లిపోతున్నారు. ఆయనకు మాతో మాట్లాడే టైం కూడా ఉండడం లేదు. నేను బలవంతంగా మాట్లాడిస్తే మాట్లాడుతున్నారు.
పార్టీ విషయాలు గురించి అడిగితే.. బాబాయ్ చాలా కష్టపడుతున్నారమ్మా అని అన్నారు. తన పార్టీ లీడర్ లా కాకుండా నాన్న ఒక అన్నయ్య లాగా బాబాయ్ గురించి ఆలోచిస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరో గా ఉన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి కష్టపడడం ఎందుకు ? రాజకీయాలు ఎందుకు ? అనే చర్చ మీ ఫ్యామిలిలో వచ్చిందా అని ప్రశ్నించగా నిహారిక సమాధానం ఇచ్చింది. చిన్న దాన్ని అయినా నాకు తెలిసినంత వరకు చెబుతా.. కళ్యాణ్ బాబాయ్ ఇప్పుడే కాదు ముందు నుంచి ప్రజల మనిషి. సినిమాల్లో ఉన్నప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వారు ఎవరూ నష్టపోకూడదు .. ఎదగాలి అని ఆలోచించే మనస్తత్వం.. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం సరైనదే అని తెలిపింది.
కళ్యాణ్ బాబాయ్ సినిమాలు కూడానా చేయాలి. ఎందుకంటే ఆయన చెప్పినట్లు ఆయనకి ఇంకేమి ఆస్తులు లేవు.. సినిమాల్లో నటించిన డబ్బుతోనే పార్టీ నడపాలి.. అలాగే కుటుంబాన్ని చూసుకోవాలి అని నిహారిక తెలిపింది.