- Home
- Entertainment
- Niharika Konidela: నిహారిక కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. స్టోరీ కూడా చెప్పేశారు, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్
Niharika Konidela: నిహారిక కొత్త సినిమా టైటిల్ ఫిక్స్.. స్టోరీ కూడా చెప్పేశారు, మరో బ్లాక్ బస్టర్ లోడింగ్
నిహారిక కొణిదెల నిర్మాణంలో ‘పాకెట్ రాకెట్స్’ సినిమా తెరకెక్కుతోంది. గ్యాంబ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌లో త్రినాథ్ వర్మ, శ్రియా కొంతం, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిహారిక కొత్త సినిమా
నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’. ఈ సినిమాకు రుద్ర అత్రి దర్శకత్వం వహించనున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ మూవీలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్ళు ఫేమ్) , నిర్మల్ (డెబ్యూ) హీరోలుగా… శ్రియా కొంతం (శుభం ఫేమ్) హీరోయిన్‌గా నటిస్తున్నారు. జేడీ చక్రవర్తి ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. గ్యాబ్లింగ్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ని, కాన్సెప్ట్ పోస్టర్‌ని బుధవారం నాడు రివీల్ చేశారు.
కథాంశం ఇదే
విదేశాల్లో చదువుకోవాలని అనుకునే ఓ కుర్రాడు, ఆ కలను సాకారం చేసుకునేందుకు గ్యాబ్లింగ్‌లోకి దిగడం, ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలో ఎదురైన పరిస్థితుల్ని ‘పాకెట్ రాకెట్స్’లో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతోన్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో టీజర్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.
చిత్ర యూనిట్ వివరాలు
ఈ చిత్రానికి ఎదురోలు రాజు కెమెరామెన్‌గా, అన్వల్ అలీ ఎడిటర్‌గా వర్క్ చేయనున్నారు. ఈ మూవీకి గ్యానీ సంగీతాన్ని అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు.
ఈ సినిమాలో త్రినాథ్ వర్మ (కమిటీ కుర్రోళ్లు ఫేమ్), శ్రియా కొంతం (శుభం ఫేమ్), నిర్మల్ (డెబ్యూ హీరో), జేడీ చక్రవర్తి, శ్రీనివాస్ అవసరాల, శ్రీనివాస్ వడ్లమాని, కిరిటీ దామరాజు తదితరులు నటిస్తున్నారు.
బ్యానర్లు : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్
నిర్మాతలు: పద్మజ కొణిదెల, రాహుల్ రాఘవేంద్ర, రాహుల్ నిమ్మకూరి
దర్శకుడు :రుద్ర అత్రి
కెమెరామెన్ :ఎదురోలు రాజు
మ్యూజిక్ :గ్యానీ
ఎడిటర్ : అన్వర్ అలీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమేష్ మన్యం
ప్రొడక్షన్ డిజైనర్ :విష్ణు వర్దన్ పుల్లా
యాక్షన్ కొరియోగ్రఫీ :రాజేష్ లంకా
కొరియెగ్రాఫర్ : జేడీ మాస్టర్





