- Home
- Entertainment
- Mahesh Babu: అది వల్గర్ సినిమా అంటున్నారు, అసలు మహేష్ బాబు త్రివిక్రమ్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలుసా ?
Mahesh Babu: అది వల్గర్ సినిమా అంటున్నారు, అసలు మహేష్ బాబు త్రివిక్రమ్ కి ఎందుకు ఛాన్స్ ఇచ్చారో తెలుసా ?
మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసిన తొలి చిత్రం అతడు. ఆ మూవీ కల్ట్ సినిమాగా నిలిచిపోయింది. అసలు త్రివిక్రమ్ కి తాను ఛాన్స్ ఎందుకు ఇచ్చాను అనే విషయాన్ని మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వారణాసి మూవీతో గ్లోబల్ ఇమేజ్ పై ద్రుష్టి పెట్టారు. మహేష్ బాబు సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా రాజకుమారుడు మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజకుమారుడు సూపర్ హిట్ అయింది. మురారితో నటుడిగా మహేష్ కి మంచి మార్కులు పడ్డాయి. ఒక్కడు సినిమా మాత్రం మహేష్ ని మాస్ హీరోగా మార్చేసింది.
నాని మూవీ విషయంలో జరిగిన తప్పు
ఆ తర్వాత మహేష్ చేసిన నిజం, నాని లాంటి సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అర్జున్ సినిమా టైంలో మహేష్ బాబు తన చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్ కి ముందు మహేష్ బాబు నటించిన నాని మూవీ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బ తినింది. దీని గురించి మహేష్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాని పరాజయానికి కారణం ఏంటి అని అడగగా.. నా ఇమేజ్ ని అంచనా వేసుకోకుండా చేసిన సినిమా అది. అదే పెద్ద తప్పయింది.
తమిళంలో సూపర్ హిట్
తమిళంలో అది సూపర్ హిట్ మూవీ. డైరెక్టర్ ఎస్ జె సూర్య తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ కష్టపడ్డారు. కానీ ఇక్కడ ఆ సినిమా నా ఇమేజ్ కి సరిపోలేదు. తమిళంలో ఎస్ జె సూర్యనే నటించారు కాబట్టి ఆడియన్స్ అక్కడ ఇమేజ్ చూడలేదు.
వల్గర్ మూవీ అన్నారు కదా..
నాని సినిమా వల్గర్ మూవీ అంటూ విమర్శలు ఎందుకు వచ్చాయి అని ప్రశ్నించగా మహేష్ బాబు సమాధానం ఇచ్చారు. అది నాటీ స్క్రిప్ట్. ఆ సినిమాకి అలాంటి సన్నివేశాలు ఉండాల్సిందే. దేని లెక్కలు దానికి ఉంటాయి అని మహేష్ బాబు అన్నారు. అర్జున్ తర్వాత రచయిత త్రివిక్రమ్ తో అతడు అనే సినిమా చేస్తున్నారు. ఆయన తెరకెక్కించిన నువ్వే నువ్వే బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ కాలేదు. అలాంటి దర్శకుడికి ఎందుకు అవకాశం ఇచ్చారు అని ప్రశ్నించగా మహేష్ సమాధానం ఇచ్చారు.
అతడు మూవీ
నువ్వే నువ్వే చాలా మంచి సినిమా. కానీ అంచనాలు కారణంగా సరైన సక్సెస్ కనిపించలేదు. ఒక రకంగా మా అతడు సినిమాకి అదే మంచిది అని మహేష్ బాబు అన్నారు. అప్పట్లో మహేష్ బాబు తన సినిమాల గురించి చెప్పిన సంగతులు ఇవి. అతడు మూవీ రిలీజై మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. కానీ భారీ బడ్జెట్ కారణంగా పూర్తి స్థాయిలో రికవరీ సాధించలేదు. కానీ కల్ట్ సినిమాగా నిలిచిపోయింది.





