- Home
- Entertainment
- Niharika Konidela: నిహారిక నువ్వు సింగిలా?... భర్తను ట్యాగ్ చేసి నెటిజెన్ కి దిమ్మతిరిగే సమాధానం!
Niharika Konidela: నిహారిక నువ్వు సింగిలా?... భర్తను ట్యాగ్ చేసి నెటిజెన్ కి దిమ్మతిరిగే సమాధానం!
niharika konidela mind blowing answer to a netizen మెగా డాటర్ నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తరచుగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చాట్స్ లో పాల్గొంటూ ఉంటారు. ఇటీవల నిహారిక ఇంస్టాగ్రామ్ లో నెటిజన్స్ తో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆమెకు వింత ప్రశ్నలు ఎదురయ్యాయి.

Niharika konidela
ఇక అభిమానుల్లో రకరకాల మనుషులు ఉంటారు. వారిలో కొందరు ఛాన్స్ దొరికింది కదా అని తుంటరి ప్రశ్నలతో తికమక పెట్టాలని చూస్తారు. కాగా ఓ అభిమాని నిహారికకు మీరు సింగిలా? అని అడిగారు. నిహారికకు పెళ్ళైన విషయం తెలిసి కూడా నిహారికను అతను ఎందుకు ఆ ప్రశ్న అడిగాడో అర్థం కాలేదు. నిహారిక మాత్రం త్వరగానే స్పందించింది.
Niharika Konidela
ఆ నెటిజెన్స్ తుంటరి ప్రశ్నకు అదే తీరులో సమాధానం చెప్పింది. తన భర్త వెంకట చైతన్యను ట్యాగ్ చేసిన నిహారిక... నేను సింగిలా? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఇండైరెక్ట్ గా నెటిజెన్ కి నేను సింగిల్ కాదు, ఈయనే నా భర్త అని సమాధానం చెప్పింది.
Niharika Konidela
మరో నెటిజన్ నిహారిక (Niharika Konidela) ఫోన్ నంబర్ కావాలని అడుగగా, ఇష్... అది చెప్పకూడదంటూ తప్పించుకుంది. సమయస్ఫూర్తితో కూడిన నిహారిక సమాధానాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కాగా నిహారిక కొంత కాలం ఇంస్టాగ్రామ్ కి దూరం అయ్యారు. ఆమె అకౌంట్ డీయాక్టీవ్ అయ్యింది. దీనితో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. తిరిగి నిహారిక ఇంస్టాగ్రామ్ అకౌంట్ యాక్టివ్ లోకి తెచ్చారు.
కాగా ఆ మధ్య నిహారిక వరుస వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా మింక్ అండ్ ఫుడింగ్ పబ్ రైడ్ లో నిహారికను అధికారులు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత ఆమె ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ వివాదంలో కుటుంబ సభ్యులు ఆమెకు సపోర్ట్ గా నిలిచారు.
సెకండ్ ఇన్నింగ్స్ లో నిహారిక నటిగా, నిర్మాతగా కొనసాగుతున్నారు. నిహారిక కొన్ని వెబ్ సిరీస్లు, చిత్రాల్లో నటిస్తున్నారు. తన సొంత బ్యానర్ లో కొన్ని ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ విషయంలో అత్తింటి వారు నిహారికకు మద్దతుగా నిలుస్తున్నారు.