MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఫ్రెండ్స్ తో అర్థరాత్రి నిహారిక భర్త చైతన్య మందు, చిందు.. అపార్ట్ మెంట్‌ వాసులతో గొడవకి కారణమిదేనా?

ఫ్రెండ్స్ తో అర్థరాత్రి నిహారిక భర్త చైతన్య మందు, చిందు.. అపార్ట్ మెంట్‌ వాసులతో గొడవకి కారణమిదేనా?

మెగా డాటర్‌ నిహారిక ఇంట్లో గొడవ రోడ్డున పడింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అవుతుంది. నిహారిక భర్త చైతన్య చేసే న్యూసెన్స్ పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లింది. ఈ న్యూస్‌ తెలుగు రాష్ట్రాల్లో హల్‌చల్‌ చేస్తుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Aug 05 2021, 02:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక వివాహం గతేడాది డిసెంబర్‌లో గుంటూరుకి చెందిన ఐటీ ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య జొన్నలగడ్డతో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ ఉదయ్ విలాస్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో మెగా కుటుంబంతో పాటు సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. 

27

నిహారిక పెళ్లికి ముందు పలు సినిమాలతో పాటు బుల్లితెరపై యాంకర్‌గానూ మెరిసింది. తాను నటించిన సినిమాలన్నీ ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయింది. పెళ్లి తర్వాత కూడా వెబ్‌ సిరీస్‌లు నిర్మించే పనిలో ఉంది. ప్రస్తుతం ఈ పనులు జరుగుతున్నాయి. 
 

37

తాజాగా నిహారిక- చైతన్య నివసిస్తున్న అపార్ట్ మెంట్‌ గొడవ దుమారం రేపుతుంది. చైతన్య అర్థరాత్రి రోజూ చేస్తున్న న్యూసెన్స్ కారణంగా అపార్ట్ మెంట్ వాసులు బంజరాహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. దీంతో చైతన్య సైతం అపార్ట్ మెంట్‌ వాసులపై ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టాయి.

47

అయితే నిహారిక, చైతన్య ప్రముఖుల ఫ్యామిలీకి చెందిన వాళ్లు కావడంతో ఇష్యూ పెద్దది కాకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఇరు వర్గాలను పిలిపించి మాట్లాడారు. వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చినట్టు వార్తలొస్తున్నాయి. దీంతో ఈ సమస్య క్లోజ్‌ అయ్యిందని తెలుస్తుంది. 
 

57

అయితే చైతన్య చేసే న్యూసెన్స్ ఏంటి? అపార్ట్ మెంట్‌ వాసులతో ఆయనకు గొడవేంటి? అర్థరాత్రి సమయంలో చేసే రచ్చేంటనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని, సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. 

67

ప్రతి రోజు నిహారిక భర్త చైతన్య తన ఫ్లాట్‌కి యువకులను తీసుకొచ్చుకుని అర్థరాత్రి వరకు మద్యం సేవించి నానా హంగామా చేస్తుంటారట. వీరి గోల మరీ మితిమీరిపోయిందని, దాన్ని భరించలేక ఇన్నాళ్లు ఓపిక పట్టిన అపార్ట్ మెంట్‌ వాసులు ఆయనతో వాగ్వాదానికి కూడా దిగారట. ఈ గొడవ తీవ్ర స్థాయిలో జరిగిందని, దీంతో అపార్ట్ మెంట్‌ వాసులు చైతన్యపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. 
 

77

మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. కానీ నిహారిక భర్త చైతన్య ఇలా ఫ్రెండ్స్ తో రాత్రి సమయంలో డ్రింక్‌ తీసుకుంటూ ఇలా రచ్చ చేస్తున్నారనే విషయం మాత్రం వివాదాస్పదంగా మారింది. వారి ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేస్తుంది. దీనిపై నిహారిక ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ సమస్య ఇంతటితో క్లోజ్‌ అవుతుందా? మున్ముందు మళ్లీ రిపీట్‌ అవుతుందా? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishal : సైకిల్‌పై వచ్చి ఓటేసిన విశాల్.. రాజకీయం , ప్రజాసేవ పై హాట్ కామెంట్స్
Recommended image2
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image3
Bhanu Chander: సాయం కోసం ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. ఎలా స్పందిస్తారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved