MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మెగా డాటర్‌ నిహారికపై భర్త కంప్లైంట్‌.. ఫోటో షేర్‌ చేసి అసలు సీక్రెట్‌ రివీల్‌.. నెట్టింట వైరల్‌

మెగా డాటర్‌ నిహారికపై భర్త కంప్లైంట్‌.. ఫోటో షేర్‌ చేసి అసలు సీక్రెట్‌ రివీల్‌.. నెట్టింట వైరల్‌

మెగా డాటర్‌ నిహారిక గతేడాది చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతో అన్యోన్నంగా సాగే ఈ జంట ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందుకు కారణంగా నిహారికపై భర్త చైతన్య  జొన్నలగడ్డ కంప్లైంట్‌ చేశారు. అసలేం జరిగిందంటే..

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 04 2021, 06:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగా డాటర్‌ నిహారిక స్టార్‌ కిడ్‌గా ఎదిగింది. మెగా ఫ్యామిలీ కూతురు కావడంతో ఆ లగ్జరీలకు కొదవ లేదని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి కంప్లైంట్స్ లేవు. కానీ ఫస్ట్ టైమ్‌ భార్త చైతన్య జొన్నలగడ్డ ఓ  కంప్లైంట్‌ చేశాడు. అది కూడా నిహారిక చేసే పనులను, పర్సనల్‌ విషయాలను వెల్లడించారు. దీంతో అందరిని ఆశ్చర్యపరిచారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

చైతన్య జొన్నలగడ్డతో వివాహం తర్వాత నిహారిక కొణిదెల తన వైవాహిక జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతోంది. తరచూ టూర్లు వెళ్తూ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది. మరోవైపు ఆమె ఇప్పుడు `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` సినిమా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంటోంది. ఆ ఆనందంలో తన భర్త చైతన్య జొన్నలగడ్డతో కలిసి ఫారెన్ టూర్‌కు వెళ్లింది నిహారిక.

38

జనరల్‌గా సోషల్‌ మీడియాలో నిహారిక చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించీగానీ, వ్యక్తిగత విషయాలనుగానీ ఎప్పటికప్పుడు పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతుంది. నిహారిక మాదిరిగానే చైతన్య కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటాడు. చైతన్య కూడా ఫారెన్ టూర్ ఫొటోలు షేర్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే నిహారిక ఫోన్ చూస్తూ కూర్చున్న ఓ పిక్‌ను పోస్ట్ చేశాడు. అంతేకాదు, `నిహారిక ఎప్పుడూ ఫోన్‌లోనే ఉంటుంది` అంటూ కంప్లైంట్ చేశాడు. ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

48

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అందులో ఎక్కువ శాతం హీరోలే ఉండగా.. అమ్మాయిలు వచ్చింది మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా కాంపౌండ్ హీరోయిన్‌గా పరిచయమైంది నిహారిక కొణిదెల. అద్భుతమైన టాలెంట్లతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుందామె.

58

తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును అందుకుంది. మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగా ఎంట్రీ ఇవ్వడానికి ముందే ప్రముఖ చానెల్‌లో ప్రసారం అయిన `ఢీ` అనే డ్యాన్స్ షోకు యాంకర్‌గా పని చేసింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిల్మ్‌లలోనూ నటించింది. ఈ క్రమంలోనే `పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్` అనే బ్యానర్ స్థాపించిన ఆమె.. `ముద్దపప్పు ఆవకాయ్`, `నాన్న కూచీ` అనే వెబ్ సిరీస్‌లను నిర్మించి, నటించి పేరు తెచ్చుకుంది.

68

కెరీర్ ఆరంభంలో యాంకర్‌గా, ఆ తర్వాత షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌లలో సత్తా చాటిన నిహారిక.. హీరోయిన్‌గా మాత్రం సక్సెస్‌ను అందుకోలేకపోయింది. ఈ క్రమంలోనే నాగశౌర్య నటించిన `ఒక మనసు` అనే సినిమాతో హీరోయిన్‌గానూ పరిచయమైంది. తర్వాత `హ్యాపీ వెడ్డింగ్`, `సూర్యకాంతం` వంటి చిత్రాల్లోనూ లీడ్ రోల్ చేసింది. కానీ అవన్నీ పరాజయం చెందడంతో నటిగా నిహారిక సక్సెస్‌ కాలేదని చెప్పొచ్చు.

78

కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతోన్న సమయంలో గత ఏడాది నిహారికకు చైతన్య జొన్నలగడ్డతో వివాహం జరిగింది. తన కుమార్తెకు డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని భావించిన నాగబాబు.. అందుకు అనుగుణంగానే ఆసియాలోనే రెండో అతిపెద్ద ప్యాలెస్ అయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఉదయ్‌విలాస్‌లో వీళ్ల పెళ్లి జరిపించారు. దీనికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరైంది. 

88

వివాహం తర్వాత కూడా తన కెరీర్‌ను ఆపకూడదని డిసైడ్ అయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే తన సొంత బ్యానర్‌పై వెబ్ సిరీస్‌లు చేయాలని ప్లాన్ చేసింది. అలాగే, నటిగానూ బిజీగా మారబోతుంది. ఇలా పెళ్లైనా కెరీర్‌ సాగిస్తూ ఆమె ఆదర్శంగా ఉంటోంది.  తన సొంత బ్యానర్ `పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్`పై ఇటీవలే `ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ` అనే వెబ్ సిరీస్‌ను నిర్మించింది. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా నటించిన దీనిని మహేశ్ ఉప్పాల తెరకెక్కించారు. జీ5లో ఇది స్ట్రీమింగ్ అయింది. దీనికి మంచి స్పందన వచ్చింది. 

also read: Purna: చీరలో సింగారం సిగ్గుతో వయ్యారం... బోల్డ్ బ్యూటీ పూర్ణ నయా లుక్ అదిరింది!

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Crazy Kalyanam Release Date: రెండు వారాల ముందే అనుపమా పరమేశ్వరన్‌ `క్రేజీ కల్యాణం`.. రిలీజ్‌ డేట్‌ ఇదే
Recommended image2
Kajal Aggarwal Mysore Palace: మైసూర్ ప్యాలెస్‌లో కాజల్ సందడి.. అది చూసి చందమామ సర్‌ప్రైజ్‌
Recommended image3
Top 5 Flop Movies: రజనీ, సూర్య, అజిత్‌, విక్రమ్‌.. ఓవర్ హైప్ ఇచ్చి అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved