నీహారిక 'కమిటీ కుర్రాళ్లు' ఓపినింగ్స్ , చిన్న సినిమాల్లో పెద్ద రికార్డే
మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకున్న సినిమా ఇది.
రూరల్ కామెడీ డ్రాగా రూపొందిన కమిటీ కుర్రాళ్లు మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. పదకొండు మంది హీరోలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తూ మెగా డాటర్ హారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన తొలి మూవీ కమిటీ కుర్రాళ్లు. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, సాయికుమార్ కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ప్రజెంటర్‌గా వ్యవహరించిన ఈ మూవీకి పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు.
ప్రొడ్యూసర్‌గా తొలి మూవీతోనే నిహారిక విజయాన్ని అందుకుందా? అంటే అందుకుందనే చెప్పాలి. కమిటీ కుర్రాళ్లు ప్రేక్షకులను యావరేజ్ గా మెప్పించారు. సినిమా పేరుకు చిన్న సినిమానే అయినా కూడా మొదటి రోజు ఒక పక్క మురారి మూవీ రీ రిలీజ్ హంగామా ఉన్నా కూడా ఈ సినిమా..కి మంచి ఓపినింగ్స్ వచ్చాయి.
భాక్సాఫీస్ దగ్గర మంచి టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో మంచి బుకింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్న ఇదే అని చెప్పాలి. సినిమా ఆల్ మోస్ట్ 16 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. అలాగే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకున్న సినిమా ఇది.
వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి.
80, 90 దశకం నాటి కథలకు ఇప్పుడు మాంచి డిమాండ్ ఉంది. విలేజ్ నేపథ్యంలో హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, కథనంతో ఆకట్టుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. దీనిని అర్థం చేసుకున్న దర్శకుడు యదు వంశీ 'కమిటీ కుర్రోళ్ళు' చిత్రాన్ని ప్లాన్ చేసుకుని చక్కగా ప్రజెంట్ చేశాడు. మొబైల్ ఫోన్లు లేని కాలంలో స్నేహితుల మధ్య జరిగే సంభాషణలు.. పల్లెటూరు వాతావరణం లాంటి అంశాలని చూపిస్తూ మంచి కథని అందించడంలో మార్కులు కొట్టేశారు.
జాతరలో కుర్రాళ్ళు చేసే అల్లరి నవ్విస్తుంది. అదే విధంగా స్నేహం కోసం వీళ్ళు ఎంతదూరమైనా వెళతారు అనే సన్నివేశాలని కూడా దర్శకుడు హృదయాన్ని హత్తుకునేలా చూపించారు. అప్పట్లో పల్లెటూర్లలో కల్మషం లేని మనుషులే కనిపిస్తారు. కానీ కులాల పేరుతో జరిగిన రాజకీయ సంఘటనలని చాలా సార్లు విన్నాం. అదే తరహాలో స్నేహితుల మధ్య చిచ్చు రగిల్చే అంశాలు ఉత్కంఠ భరింతంగా ఉంటాయి.
కమిటీ కుర్రాళ్లు అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరి కథ. పల్లెటూళ్లలో కల్మషం లేని మనుషులు, వారి స్నేహాలు... అక్కడి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది దర్శకుడు యదు వంశీ నాచురల్‌గా ఈ సినిమాలో చూపించారు. ఓ సినిమాలా కాకుండా ఓ పల్లె వాతావరణాన్ని కళ్ల ముందు తీసుకొచ్చి ఓ నోస్టాల్జిక్ ఫీలింగ్‌ను కలిగించాడు.