- Home
- Entertainment
- Nidhhi Agerwal: సెట్‌లో ప్రభాస్ ఉండేది ఇలానే.. డార్లింగ్ గురించి `ది రాజా సాబ్` హీరోయిన్ ఏం చెప్పిందంటే
Nidhhi Agerwal: సెట్‌లో ప్రభాస్ ఉండేది ఇలానే.. డార్లింగ్ గురించి `ది రాజా సాబ్` హీరోయిన్ ఏం చెప్పిందంటే
ప్రభాస్ హీరోగా వచ్చిన `ది రాజా సాబ్` చిత్రంలో నిధి అగర్వాల్ ఓ హీరోయిన్‌గా చేసింది. మారుతి రూపొందించిన ఈ మూవీ ఫలితంపై, ప్రభాస్‌తో వర్క్ చేయడంపై నిధి అగర్వాల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది.

ది రాజా సాబ్ లో నిధి అగర్వాల్ రచ్చ
ప్రభాస్ ఈ సంక్రాంతికి `ది రాజా సాబ్`తో అలరిస్తున్నారు. ఆయన కెరీర్‌లో మొదటి సారి హర్రర్ సినిమా చేశారు. సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్లు ఇందులో సర్‌ప్రైజింగ్ ఫ్యాక్టర్స్ గా చెప్పొచ్చు. ఈ నెల 9న విడుదలైన ఈ మూవీకి ప్రారంభంలో నెగటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తర్వాత కొన్ని సీన్లు లేపేసి, మరికొన్ని సీన్లు యాడ్ చేయడంతో టాక్ బెటర్‌గా ఉంది. వసూళ్లు కూడా హోల్డ్ చేస్తున్నాయట. ఇదిలా ఉంటే ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహించగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. తాజాగా సినిమా ఫలితంపై, ప్రభాస్ గురించి నిధి అగర్వాల్ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ప్రభాస్ తాన బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని ఎప్పుడూ అనుకోరు
నిధి అగర్వాల్ `ది రాజా సాబ్` చిత్రంలో బెస్సీ పాత్రలో నటించింది. క్రిస్టియన్ అమ్మాయిగా ఏంజెల్ తరహా పాత్రలో ఆమె కనిపిస్తుంది. ప్రభాస్, నిధి మధ్య వచ్చే సీన్లు హిలేరియస్‌గా ఉంటాయి. ఆమె పాత్ర బాగా ఆకట్టుకున్న నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేస్తోంది నిధి అగర్వాల్. బుధవారం నిధి మీడియాతో జూమ్ మీట్‌లో ముచ్చటించింది. ఇందులో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రభాస్ గారితో వర్క్ చేయడం ప్లెజర్ గా ఫీలయ్యా. ఆయన తానొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ అనేది ఎప్పుడూ అనుకోరు. మా అందరితో సరదాగా కలిసిపోయేవారు. ఆయనలోని మంచితనం వినయం చూశాక మంచి వాళ్లకు తప్పకుండా మంచే జరుగుతుందనే విషయాన్ని మరింతగా నమ్మాను. ఇంతటి ఇమేజ్‌కి ఆయన అర్హుడు. హాస్పిటల్ సీన్ లో ఆయన అద్భుతంగా పర్ ఫార్మ్ చేశారు. ఆయా సీన్లు చేయడం చాలా కష్టం, కానీ ప్రభాస్ అద్భుతంగా చేశారు. ఆయనతో సెట్ లో సినిమాలు, లైఫ్ ఇలా అనేక విషయాల్లో చాలా సరదా సంభాషణలు జరిగేవి` అని తెలిపింది నిధి.
ది రాజా సాబ్ రిజల్ట్ పై నిధి ఏమన్నదంటే
నిధి అగర్వాల్ ఇంకా మాట్లాడుతూ, `రాజా సాబ్` సినిమాకి వస్తోన్న స్పందనపై ఆమె రియాక్ట్ అవుతూ, `సినిమాకు వస్తోనన రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాను. ఈ సినిమా కోసం మేమంతా 3 ఏళ్లు కష్టపడ్డాం. ఆ కష్టానికి ప్రేక్షకులు మంచి రిజల్ట్ ఇచ్చారని భావిస్తున్నాం. సినిమాకు మొదట్లో కొద్దిగా మిక్డ్స్ టాక్ వచ్చినా ఇప్పుడు ప్రతి ప్రేక్షకుడు మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా స్ట్రాంగ్ హోల్డ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీకి ముందు `హరి హర వీరమల్లు`లో నేను రాకుమారి పాత్రలో నటించాను. ఈ సినిమాలో ఏంజెల్ గా కనిపించాను. ఈ రోల్ లో నటించడాన్ని ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టర్ వరకు కాకుండా మొత్తం కథ విన్నాను. అప్పుడే ఇది ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని అర్థమైంది. అన్ని తాంత్రిక విద్యలు, సైకలాజికల్ గేమ్స్ ఆడే ఓ దుష్టశక్తిని దైవికంగా ఎదుర్కోవడాన్ని కొత్తగా దర్శకుడు మారుతి గారు చూపించారు. ఆ పాయింట్ యూనిక్ గా అనిపించింది` ని చెప్పింది.
నిద్ర కూడా ఉండేది కాదు
అలాగే ఆమె ఇంకా చెబుతూ, `సప్తగిరి, ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్.. ఇలా చాలామంది కమెడియన్స్ తో కలిసి సీన్స్ చేశాం. సెట్స్ లో చాలా ఫన్ గా ఉండేది. నేను `హరి హర వీరమల్లు`తో పాటు ఈ సినిమా షూటింగ్ కూడా చేశా. రెండు సినిమాల షూటింగ్స్ కోసం ట్రావెల్, నిద్ర కూడా ఉండకపోయేది. ఆ టైమ్ లో `రాజా సాబ్` మేకర్స్ బాగా సపోర్ట్ చేశారు. నన్ను సెట్ లో బాగా చూసుకునేవారు. అందుకే ప్రభాస్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు నిధి అగర్వాల్ అంటే సెట్ లో అందరికీ ఇష్టమని. ఈ కెరీర్ అంటే నాకు ప్యాషన్ కాబట్టి ఇలా కష్టపడటం ఇబ్బందిగా అనిపించలేదు` అని వెల్లడించింది.
మారుతి క్లారిటీ ఉన్న దర్శకుడు
`డైరెక్టర్ మారుతి ఎంతో క్లారిటీగా ఈ సినిమాను రూపొందించారు. ఆయన సెట్ కు వచ్చేప్పుడే ఏ సీన్ షూట్ చేయాలనేది క్లియర్ గా ఉండేవారు. ఒకేసారి ఐదారుగురు ఆర్టిస్టులతో సీన్ చేయించడం సులువు కాదు. ఆయన సెట్ లో సరదాగా ఉండేవారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించడం అంటే ఎంతో ప్యాషన్ ఉండాలి. అలాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు. ఈ మూవీలోని విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఎక్కడా విశ్వప్రసాద్ గారు రాజీ పడలేదు. అందుకే ఇంత హై క్వాలిటీతో సినిమా మన ముందుకు వచ్చింది`.
తెలుగు సినిమా గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు
`టాలీవుడ్ లో నేను భాగం. నాది తెలుగు సినిమా అని చెప్పుకుంటాను. ఇటీవల ముంబై వెళ్లినప్పుడు అక్కడ తెలుగు సినిమాలు ఎంత క్వాలిటీగా ఎంత పెద్ద స్కేల్ లో జరుగుతున్నాయో నార్త్ వాళ్లు చెబుతుంటే విన్నాను. మా మూవీనే కాదు సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆదరణ పొందాలని నేను కోరుకున్నాను. మనమంతా ఒకే పడవలో వెళ్తున్నాం. ప్రమాదం జరగాలని చూస్తే అందరం మునిగిపోతాం. పవన్ కల్యాణ్ గారితో హరి హర వీరమల్లులో నటించినప్పుడు ఆయనను పవర్ స్టార్ అని ఎందుకు అంటారో అర్థమైంది. చాలా ధైర్యంగా ఉంటారు. ప్రభాస్ గారితో వర్క్ చేసినప్పుడు ఎంత ఎదిగినా వినయంగా ఎలా ఉండాలో అర్థమైంది. ఈ జర్నీలో ఎంతో నేర్చుకున్నా` అని చెప్పింది నిధి అగర్వాల్.

