MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • MSG Day 2 Collection: బాక్సాఫీసు వద్ద మన శంకర వర ప్రసాద్‌ గారు ర్యాంపేజ్‌.. చిరంజీవి సక్సెస్‌ పార్టీ

MSG Day 2 Collection: బాక్సాఫీసు వద్ద మన శంకర వర ప్రసాద్‌ గారు ర్యాంపేజ్‌.. చిరంజీవి సక్సెస్‌ పార్టీ

చిరంజీవి, అనిల్‌ రవిపూడి కాంబినేషన్‌లో చేసిన `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 14 2026, 04:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ థియేటర్లలో రచ్చ
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ థియేటర్లలో రచ్చ

మెగాస్టార్‌ చిరంజీవి ఈసంక్రాంతికి `మన శంకర వర ప్రసాద్‌ గారు` సినిమాతో అల్లాడిస్తున్నారు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. వెంకటేష్‌ స్పెషల్‌ అప్పీయరెన్స్ సినిమాకి పెద్ద అసెట్‌గా నిలిచింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
మంచి వసూళ్ల దిశగా మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ
Image Credit : Asianet News

మంచి వసూళ్ల దిశగా మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ

అనిల్‌ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి, చిరంజీవి కామెడీ టైమింగ్‌, యాక్టింగ్‌ తోడు కావడంతో సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఆడియెన్స్ ని ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ మూవీ బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లని రాబడుతోంది.

Related Articles

Related image1
MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Related image2
AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?
310
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ మొదటి రోజు కలెక్షన్లు
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ మొదటి రోజు కలెక్షన్లు

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ మూవీ మొదటిరోజు ఊహించని వసూళ్లని రాబట్టింది. ఇది మొదటి రోజు ఏకంగా రూ.84కోట్లు వసూలు చేసింది. ఆరవై కోట్లు దాటితే ఎక్కువ అనుకుంటే, ఏకంగా ఎనబై కోట్లకుపైగా గ్రాస్‌ సాధించి ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది.

410
ఫస్ట్ డే ఊహించని వసూళ్లు
Image Credit : Asianet News

ఫస్ట్ డే ఊహించని వసూళ్లు

ఈ మూవీకి అందరి నుంచి హిట్‌ టాక్‌ వచ్చింది. నెగటివ్‌ టాకే లేదు. అదే ఈ మూవీకి పెద్ద అసెట్‌గా మారిందని చెప్పొచ్చు. సినిమాని చూసిన ఆడియెన్స్ తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. దీంతో పాజిటివ్‌ టాక్‌ స్ప్రెడ్‌ అయ్యింది. అది కలెక్షన్లకి కలిసి వచ్చింది.

510
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రెండు రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రెండు రోజుల కలెక్షన్లు

ఇక రెండు రోజు సగానికి పడిపోయింది. రూ.36కోట్లు రాబట్టింది. సినిమాల పోటీ ఉన్నప్పటికీ ఈ రేంజ్‌లో వసూళ్లని రాబట్టడం విశేషమనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇది ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ.120కోట్లు రాబట్టిందని టీమ్‌ ప్రకటించింది. బాక్సాఫీసు వద్ద చిరంజీవి రచ్చ వేరే లెవల్‌లో ఉందని తెలిపింది.

610
సక్సెస్‌ సెలబ్రేషన్‌లో మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ టీమ్‌
Image Credit : Asianet News

సక్సెస్‌ సెలబ్రేషన్‌లో మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ టీమ్‌

ఈ అంతేకాదు టీమ్‌ కూడా సక్సెస్‌ సెలబ్రేషన్‌లో మునిగిపోయారు. మంగళవారం బ్లాక్‌ బస్టర్‌ థ్యాంక్స్ మీట్‌ పెట్టారు. రాత్రి చిరంజీవి ఏకంగా టీమ్‌ అందరికి పార్టీ కూడా ఇచ్చాడు.  ఇందులో టీమ్‌ అంతా పాల్గొని రచ్చ చేశారు.

710
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్‌
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్‌

ఇక `మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీ సక్సెస్‌ సెలబ్రేషన్‌లో చిరంజీవి, వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి, నిర్మాతలు సుస్మిత, సాహు గారపాటి, కెమెరామెన్‌, ఎడిటర్‌, ఆర్ట్ డైరెక్టర్‌ ఇతర టీమ్‌ అంతా పాల్గొన్నారు. 

810
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ సెలబ్రేషన్‌లో చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ సెలబ్రేషన్‌లో చరణ్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

వీరితోపాటు ఇందులో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా పాల్గొన్నారు. ఆయన స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఆయన లుక్‌ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకోగా, అవి వైరల్‌ అవుతున్నాయి. 

910
మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌
Image Credit : Asianet News

మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ థియేట్రికల్‌ బిజినెస్‌

`మన శంకర వర ప్రసాద్‌ గారు` మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ.140కోట్లకుపైగా థియేట్రికల్‌ బిజినెస్‌ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.105కోట్లు, ఇతర రాష్ట్రాల్లో కలిసి రూ.120కోట్లు అయ్యిందని, ఓవర్సీస్‌ కలిపి రూ.140కోట్ల వరకు బిజినెస్‌ అయ్యిందని సమాచారం.

1010
40శాతం కలెక్షన్లు రికవరీ
Image Credit : Asianet News

40శాతం కలెక్షన్లు రికవరీ

ఈ లెక్కన సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే ఇది సుమారు మూడు వందల కోట్లు రాబట్టాలి. ఇప్పుడు 40శాతం వచ్చింది. ఇంకా 60 శాతం రావాలి. మరి అది ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. మూడు వందల కోట్ల మార్క్ ని దాటితే మాత్రం ఈ చిత్రం పెద్ద హిట్‌గా చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Korean Kanakaraju 13 Days Collections: చతికిల పడ్డ కొరియన్‌ కనకరాజు.. వరుణ్‌ తేజ్‌ మూవీ టోటల్‌ ఎంత చేసిందంటే?
Recommended image2
Dil Raju: మహేష్, రాంచరణ్, బన్నీ రిజెక్ట్ చేసిన కథతో సూపర్ హిట్ కొట్టిన హీరో.. వాళ్ళు చేసుంటే సినిమా షెడ్డుకే
Recommended image3
Sowcar Janaki: ఐసీయూలో షావుకారు జానకి.. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
MSG Movie Review: మన శంకర వర ప్రసాద్‌ గారు మూవీ రివ్యూ, రేటింగ్‌.. ఈ సంక్రాంతి మొత్తం చిరంజీవిదే
Recommended image2
AOR Movie Review: అనగనగా ఒక రాజు మూవీ రివ్యూ.. నవీన్‌ పొలిశెట్టి నవ్వించాడా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved